Brahmamudi Serial Today Episode: రాజ్‌ ఫోన్‌ తీసుకుని చార్లెస్‌ తమ రూంలోనే ఉన్నాడని.. తమను కట్టిపడేశాడని అప్పుకు మెసేజ్‌ చేస్తాడు. వెంటనే అప్పు, కళ్యాణ్‌ ఇంటికి వస్తారు. ఈలోపు రాజ్‌ కావ్య కట్లు విప్పుకుని అదే తాడుతో చార్లెస్‌ను కట్టిపడేస్తారు. అప్పు వాళ్లు రాగానే సంచిలో మూటగట్టి కిందకు విసిరేస్తారు. కానిస్టేబుల్స్‌ వచ్చి చార్లెస్‌ను తీసుకుని వెళ్లిపోతారు. అప్పు, కళ్యాణ్‌ లోపలికి వెళ్తేందుకు ప్రయత్నిస్తుంటే.. ధాన్యలక్ష్మీ, ప్రకాష్‌ చూస్తారు. అందరూ హాల్లోకి వస్తారు.

రుద్రాణి: మీకు  ఇంకా అర్థం కాలేదా..? అప్పు కేసు పని మీద పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలని చెప్పింది కదా..? దానికి ధాన్యలక్ష్మీ నో అంది దానికే మొగుణ్ని కన్వీన్స్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లినట్టు ఉంది

ధాన్యం: రుద్రాణి చెప్పింది నిజమా..?

రుద్రాణి: నిజమా అని అలా అడుగుతావేంటి ధాన్యలక్ష్మీ నిన్ను మోసం చేసి వెళ్లారు

కళ్యాణ్‌: అత్తా  నువ్వు లేనిపోని గొడవలు పెట్టకు.. కాసేపు ఆగు..  అమ్మా నిన్ను మోసం చేయాలనో బాధ పెట్టాలనో కాదు.  మేము పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది నిజమే కానీ వెల్లడానికి ఒక కారణం ఉంది. అప్పు ఎంతో కష్టపడి పట్టుకున్న ఒక దొంగ తప్పించుకున్నాడు. వాణ్ని పట్టుకోవడానికే మేము వెళ్లాము. అలా వెళ్లకపోయి ఉంటే అప్పు జాబ్‌ పోయేది

ప్రకాష్‌: కూల్‌గా ఇంతకీ ఆ దొంగ దొరికాడా..?

ధాన్యలక్ష్మీ: ఇప్పుడు అదా ముఖ్యం మీ కోడలు చేసే పనికిరాని చేజింగ్‌ లోకి మన కొడుకును కూడా తీసుకెళ్లి వాడిని కూడా రిస్క్‌ లో పడేసింది. ఒకవేళ వాడికి జరగరానికి జరిగి ఉంటే..

కళ్యాణ్‌:  అమ్మ  అర్ధరాత్రి నా భార్య బయటకు వెళ్తుంటే తోడుగా  వెళ్లకుండా ఎలా ఉండమంటావు. అయినా ఇప్పుడు నాకేం కాలేదు కదా

ధాన్యలక్ష్మీ: ఒకవేళ అయి ఉంటే..

అప్పు: అత్తయ్యా మీరు చెప్పింది కరెక్టే.. నేను చేసే పనిలో కళ్యాణ్‌ ను ఇన్వాల్వ్‌ చేసి చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి అత్తయ్యా

రుద్రాణి: చేతులెత్తి దండం పెట్టినంత మాత్రానా నువ్వు చేసింది తప్పు కాకుండా పోతుందా..?

ఇందిరాదేవి: ఆగ్నికి ఆజ్యం తోడైనట్టు ఇప్పుడు ధాన్యలక్ష్మీని ఎందుకు రెచ్చగొడుతున్నావు నోరు మూసుకుని ఉండలేవా…

రుద్రాణి:  ప్రతిసారి నన్నే అనండి కానీ నేను ఏం చెప్తున్నానో అర్తం చేసుకోకండి.. ఒకవేళ వీళ్లు పట్టుకోవాలనుకున్న దొంగ దగ్గర రివాల్వర్‌ ఉండి ఉంటే.. వాడు కళ్యాణ్‌ను కాల్చి ఉంటే..

అంటూ బెదిరిస్తుంది రుద్రాణి. దీంతో అందరూ రుద్రాణిని తిట్టి అప్పు, కళ్యాన్‌లను మెచ్చుకుంటారు.

ఇందిరాదేవి: అవును మీరిద్దరూ బయట ఉన్నారు. మరి కావ్య రాజ్‌ ఎక్కడున్నారు.

అప్పు: అక్కా బావ మా రూంలో ఉన్నారు అమ్మమ్మ..

ఇందిరాదేవి: అదేంటి నేను ఫోన్‌ చేస్తే టెర్రస్‌ మీద పూలు ఆరబెడుతున్నాం అన్నారు..? అంటే అందరూ కలిసి నాటకం ఆడారన్నమాట. పదండి ముందు పైకి

అంటూ అందరూ కలిసి శోభనం గదిలోకి వెళ్తారు. అక్కడ అందరిని చూసిన రాజ్‌, కావ్య సిగ్గు పడతారు. కావ్య అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. మీరిద్దరూ రూంలో ఉన్నా కూడా కావ్య ఏమీ అనలేదంటే ఇక నువ్వు ప్రపోజ్‌ చేయాల్సిన టైం వచ్చింది మనవడా అంటుంది ఇందిరాదేవి. అవునని రాజ్‌ బయటకు వెళ్లి కావ్యకు ప్రపోజ్‌ చేయబోతుంటే.. వైదేహా ఫోన్‌ చేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!