Brahmamudi Serial Today Episode: రాజు తాను చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న కష్టాల గురించి డబ్బు లేకపోతే వచ్చే ఇబ్బందుల గురించి ఎమోషనల్‌ గా ఇందుకు చెప్తాడు. డబ్బు లేని జీవితం ఎంత దుర్బరంగా ఉంటుందో వివరిస్తాడు.

Continues below advertisement

రాజు: నీకంటే లెక్క లేనంత డబ్బు ఉంది కాబట్టి నీకు దాని విలువ తెలియకపోవచ్చు. కానీ మాకు రేపటి నుంచి పెట్రోల్ రేటు రూపాయి పెరుగుతుందంటే ఈరోజే క్యూలో నిలబడి పెట్రల్‌ కొనే బతుకులు మావి..

ఇందు: ( మనసులో) వీడు మంచోడే కానీ కాస్త డబ్బు పిచ్చి ఎక్కువగా ఉంది

Continues below advertisement

అనుకుంటూ వెళ్లిపోతుంది. ఇక ఐశ్వర్యకు రాకేష్‌ ఫోన్‌ చేస్తాడు.

ఐశ్వర్య: హలో రాకేష్‌

రాకేష్‌: ఏంటి ఫోన్‌ లేటుగా లిఫ్ట్ చేస్తున్నావు.. ఎత్తాలా వద్దా అనుకుంటూ ఎత్తావా..?

ఐశ్వర్య: అదేం లేదు ఫోన్‌ చూసుకోలేదు

రాకేష్‌: నా డబ్బు సంగతి కూడా మర్చిపోయాయా..

ఐశ్వర్య:  ఏం లేదు.. నాకు కొన్ని డబ్బులు వచ్చేది ఉంది. అవి రాగానే ఇస్తాను.

రాకేష్‌: ఇప్పటికి ఇలా చాలాసార్లు చెప్పావు..ఇక నేను నిన్ను నమ్మను.. నేరుగా వచ్చి మీ ఆంటీనే అడుగుతాను

అని కాల్‌ కట్‌ చేస్తాడు.

ఐశ్వర్య: రేఖ ఆంటీ కోటి రూపాయల పని ఏం చేసిందో కనుక్కోవాలి. (అనుకుంటూ రేఖ ఆగ్గరకు వెళ్తుంది.) ఆంటీ ఏం ఆలోచిస్తున్నారు

భ్రమరాంబ: ఆ ఇక్కడ ఆటలు ఆడుతున్నాం నువ్వు రా ఆడుదువు..

ఐశ్వర్య:  పిన్ని నువ్వు కాస్త సైలెంట్‌గా ఉంటావా..? నేను ఆంటీతో మాట్లాడాలి. ఆంటీ ఇందును కిడ్నాప్‌ చేసి చాలా రోజులు అయింది కదా..? వాళ్లు అడిగిన కోటి రూపాయలు రెడీ అయ్యాయా..?

రేఖ: లేదు ఐశ్వర్య చాలా కష్టం మీద సర్దితే ఒక ఇరవై లక్షలు రెడీ అయ్యాయి… ఇక అంతకు మించి డబ్బులు వస్తాయని నాకు నమ్మకం లేదు. ఎవ్వరినీ అడిగినా డబ్బులు ఇవ్వడం లేదు..

ఐశ్వర్య:  అలా అయితే ఎలా ఆంటీ

రేఖ: అదే నాకు అర్థం కావడం లేదు ఆ కిడ్నాపరేమో రేపటి వరకు టైం ఇచ్చాడు. ఆ తర్వాత ఇందును కనిపించకుండా చేస్తామని బెదిరిస్తున్నారు

ఐశ్వర్య: అయితే ఒక పని చేయండి ఆంటీ ఆ ఇరవై లక్షలు ఇస్తామని కన్వీన్స్‌ చేయండి (మనసులో ఆ ఇరవై లక్షలన్నా చేతిలో పడితే ఆ రాకేష్‌ గాడి పీడ విరగడి అవుతుంది)

రేఖ: నీకేమన్నా పిచ్చిగా ఉందా..? లాస్ట్‌ టైం యాభై లక్షలు ఇస్తామన్నా వాళ్లు ఒప్పుకోలేదు.. ఇప్పుడు ఇరవై లక్షలు ఇస్తామంటే ఒప్పుకుంటారా..?

ఐశ్వర్య: ఏమో ఎవరికి తెలుసు.. డబ్బు అవసరం ఎవరికి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా..? ఒకసారి అడిగి చూడండి

భ్రమరాంబ: నువ్వేంటి అంతా తెలిసిదానిలా మాట్లాడుతున్నావు

ఐశ్వర్య: ముందు నువ్వు ఆపుతావా పిన్ని.. ఆంటీ మీరు ఒకసారి ట్రై చేయండి.. ఇప్పుడు ఇరవై లక్షలు ఇస్తామని చెప్పండి.. ఇందు ఇంటికి వచ్చాక మిగతా డబ్బు ఇస్తామని చెప్పండి

భ్రమరాంబ: అవును రేఖ ఆలోచిస్తే ఇదే మంచిదని అనిపిస్తుంది. ఒకసారి ఫోన్‌ చేయ్‌

రేఖ, రాజుకు  ఫోన్‌ చేస్తుంది. డబ్బులు ఇరవై లక్షలే ఉన్నాయని చెప్తుంది. రాజు కోపంగా తిట్టి కాల్‌ కట్‌ చేస్తాడు. ఐశ్వర్య తన రూంలోకి వెళ్లి రాజుకు ఫోన్‌ చేసి పరిస్థితులు బాగా లేవని వచ్చిన ఇరవై లక్షలు తీసుకోవడమే బెటర్‌ అని చెప్తుంది. దీంతో రాజు మళ్లీ రేఖకు ఫోన్‌ చేసి ఇరవై లక్షలకు డీల్‌ ఓకే అంటాడు. మరుసటి రోజు గుడి దగ్గర డబ్బులు ఇవ్వమని అక్కడే ఇందును అప్పగిస్తామని చెప్తాడు. చెప్పినట్టు గానే.. రేఖ, భూషణ్‌ డబ్బులు తీసుకెళ్లి రాజు చెప్పిన చోట పెట్టేసి గుడిలోకి వెళ్తారు. గుడిలో దేవుడికి మొక్కి తిరిగి చూసిన ఇందుకు ఎదురుగా రేఖ కనిపిస్తుంది. రేఖను చూసి ఇందు షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!