Brahmamudi Serial Today Episode: నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నాకు మా బావను అదే రామ్‌ను దూరం చేయలేవని అంటుంది యామిని. మా పెళ్లి అయ్యాక అసలు నీ ముఖం కూడా చూడకుండా చేస్తానని వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో కావ్య బాధపడుతుంది. తర్వాత అపర్ణ, కళ్యాణ్‌,అప్పు, ఇందిరాదేవి, స్వప్న వెళ్లి రాజ్‌ను కలుస్తారు.

రాజ్‌: నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి మీరేంటి మౌనంగా ఉన్నారు.

అపర్ణ: అంటే అది బాబు..

రాజ్‌: మీరు మాట్లాడకండి.. మిమ్మల్ని ఎంతో నమ్మాను.. మీ కొడుకు స్థానంలో ఉండి మీ పుట్టిన రోజు జరిపించాను. కానీ మీరు నన్ను చాలా బాధపెట్టారు.

ఇందిరాదేవి: చూడు రామ్‌ వీళ్లు నీతో నిజం దాచారు. కానీ అలా దాచేసి నీతో ఏదో చేయకూడని పని చేశారా..? అన్నదానమే కదా చేయించారు.

రాజ: అది నిజం  చెప్పి చేయించొచ్చు కదా..? కళావతి చెప్పకపోతే పెద్దావిడ అయ్యుండి ఈవిడైన ఎలా అబద్దం చెప్తుంది.

అపర్ణ: కళావతి నన్ను చూడగానే.. ఎవరో తెలియనట్టు ఉండటంతో నేను అలాగే ఉండిపోయాను బాబు

రాజ్‌: అదే ఎందుకు కళావతి ఈ విషయం నా దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది..? అది మోసం కాదా..?    

ఇందిరాదేవి: కళావతి నీ దగ్గర నిజం దాచింది. నిజం చెప్పకపోవడం తప్పే అవుతుంది. అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం అవుతుంది. నా మనవరాలు నిన్ను మోసం చేయలేదు

రాజ్‌: కాస్త అర్థం అయ్యేట్టు చెప్పండి నాన్నమ్మగారు

అపర్ణ: ఇంకా అర్థం అయ్యేటట్టు అంటే ఎలా బాబు.. నువ్వే అర్థం చేసుకోవాలి.

స్వప్న: రామ్‌ నువ్వు ఇంకా నా చెల్లెలి మనసు అర్థం చేసుకోలేదా..? తను నిన్ను ప్రేమిస్తుంది.

రాజ్‌: అంటే ఇన్ని రోజులు కళావతి నాతో తిరిగింది..

ఇందిరాదేవి: నువ్వంటే ఇష్టంతోనే

రాజ్‌: నాతో కలిసి రెస్టారెంట్లకు తిరిగింది

కళ్యాణ్‌ నువ్వంటే ప్రేమ ఉంది కాబట్టి

రాజ్‌: అంటే నేను ఇచ్చిన చీరను కట్టుకుంది

అపర్ణ: నిన్ను భర్తగా కట్టుకోవాలనుకుంది కాబట్టి

రాజ్‌: అయ్య బాబోయ్‌ ఇన్ని రోజులు ఈ విషయం తెలియకుండానే పిచ్చోడిలా తిరిగానా..? అయితే డైరెక్టుగా వెళ్లి నేను కూడా ప్రేమిస్తున్నాను అని చెప్తాను.

అని రాజ్‌ చెప్పగానే.. వద్దని ఇప్పుడే నీ ప్రేమ గురించి చెబితే కావ్య ఒప్పుకోదని మెల్లగా తన మనసు డైవర్ట్‌ చేయాలని అప్పుడే నీ ప్రేమను యాక్సెప్ట్‌ చేస్తుందని అందరూ చెప్తారు. రాజ్‌ సరే అంటాడు. రాజ్‌ను తీసుకుని ఇంటికి వస్తారు. అందరూ కలిసి రాజ్‌కు టిఫిన్‌ పెడుతుంటే.. కావ్య కిందకు వస్తుంది.

కావ్య: ఈయన ఏంటి అమ్మమ్మ వాళ్లందరితో గతంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు. కొంపదీసి గతం గుర్తుకు వస్తుందా ఏంటి..?

రాహుల్‌, రుద్రాణి వచ్చి రాజ్‌ను చూసి షాక్‌ అవుతారు.

రుద్రాణి: ఏంటి మీరు మీరు ఒక్కటయిపోయారా.?

స్వప్న: అంటే ఎప్పటికైనా కావాల్సిన వాళ్లమేగా..?

రుద్రాణి: అంటే రాజ్‌కు నిజం చెప్పేశారా..?

రాజ్‌: రాజ్‌ ఎవరు.. ఏ నిజం చెప్పాలి..?

ఇందిరాదేవి: రాజ్‌ అంటే వీడి కొడుకు..

రాజ్‌: మరి రాజ్‌ ఎక్కడున్నారు..?

ప్రకాష్‌: అదిగో నువ్వే కదా ఇక్కడే ఉన్నావు కదా..?

రాజ్‌: నేను రాజ్‌ ఏంటి..? ఏం మాట్లాడుతున్నారు.

ఇందిరాదేవి: అంటే వాడి కొడుకు రాజ్‌ ఎప్పుడు నువ్వు కూర్చున్న ఈ కుర్చీలోనే కూర్చునే వాడు బాబు అందుకే అలా చెప్తున్నాడు.

రుద్రాణి: అంటే రాజ్‌కు గతం గుర్తుకు రాలేదన్నమాట

రాజ్‌: గతం అంటున్నారు.. ఎవరికి గతం గుర్తుకు రావాలి..?

అందరూ తమ మాటలతో రాజ్‌ను కన్పీజ్‌ చేస్తారు. ఇంతలో కావ్య వచ్చి రాజ్‌ను బయటకు తీసుకెళ్లి మళ్లీ మా ఇంటి వైపు రావొద్దని వార్నింగ్‌ ఇస్తుంది. అయినా కూడా వస్తానని రాజ్‌ చెప్పివెళ్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!