Brahmamudi Serial Today Episode: రాజు ఓవరాక్షన్ చేస్తున్నాడని అతనికి ఇచ్చే పేమెంట్‌లో రెండు వేలు కట్ చేస్తాను అంటుంది ఇందు. దీంతో ఇవాళ బ్రహ్మముడి ఏపిసోడ్ చాలా ఫన్నీగా జరిగింది. అయితే ఇందు ఇచ్చేదే పదివేలు అందులో రెండు వేలు కట్ చేస్తే ఎలా అంటూ రాజు బాధపడతాడు.
రాజు: అయినా నా యాక్టింగ్ వల్లే అందరూ మనం నిజంగానే పెళ్లి చేసుకున్నామని నమ్మేశారు కదా
ఇందు: అందరినీ నమ్మించడం కోసం నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తావా..?
రాజు: సారీ ఈ పాయింటే తట్టలేదు నాకు
ఇందు: అదంతా నాకు తెలియదు. నీ పేమెంట్‌లో రెండు వేలు కట్ చేస్తున్నాను
రాజు: అసలే నువ్వు గీకి గీకి పది వేలు ఇస్తానన్నావు.. ఇప్పుడు అందులో రెండు వేలు కట్ చేస్తే.. ఇక నాకేం మిగులుతుంది.
ఇందు: అది నువ్వు ముందు ఆలోచించుకోవాలి. చూడు ఇదేం నువ్వు కిడ్నాప్ చేసిన ప్లేస్ కాదు. నీ ఇష్టం వచ్చినట్టు ఉండటానికి
రాజు: అక్కడ కూడా నీకు ఇష్టం వచ్చినట్టే ఉన్నావు కదా..
ఇందు: ఎక్కువ మాట్లాడితే ఇంకో రెండు వేలు కట్ చేస్తాను
అనగానే రాజ్ అమ్మా తల్లి ఇంకా ఆ రెండు వేల దగ్గరే ఆగిపో చివరికి నాకు చిల్లి గవ్వ కూడా ఇచ్చేలా లేవే.. అంటూ వెటకారంగా నవ్వుకుంటాడు. తర్వాత ఐశ్వర్య, రాజు దగ్గరకు వెళ్లి తనకు కావాల్సిన పది లక్షల గురించి అడుగుతుంది.
ఐశ్వర్య: ఓరేయ్ నా డబ్బేదిరా..? మొదట కిడ్నాప్ డ్రామా ఆడావు.. తర్వాత నా ఇరవై లక్షలు కొట్టేశావు ఇప్పుడు ఈ ఆస్థి కొట్టేయడానికి వచ్చావా..? అందుకే ఈ పెళ్లి డ్రామా ఆడుతున్నావా..?
రాజు: డ్రామా ఏంటి డ్రామా..? మేము నిజంగానే పెళ్లి చేసుకున్నాము
ఐశ్వర్య: నీ గురించి నాకు తెలియదా..? నువ్వు డబ్బులకు తప్ప ఏ ఎమోషన్‌కు వ్యాల్యూ ఇవ్వవు. అలాంటిది ప్రేమ అంటూ దాన్ని పెళ్లి చేసుకున్నావు అంటే నేను ఎలా నమ్ముతానురా..? ఒకవేళ నీకు ఈ ఆస్తి మీద కన్నుంది అంటే మా రేఖ ఆంటీ నిన్ను బతకనివ్వదు.. ఇరవై అయిదేళ్లుగా ఈ ఆస్థి కోసం తను కాచుకు కూర్చుంది
రాజు: హలో ఈ గొడవల వల్ల ఉపయోగం ఏమీ లేదు.. వారం రోజుల్లో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను
ఐశ్వర్య: నాకు ఇప్పుడే కావాలి
రాజు: ఇప్పుడే కావాలంటే ఎలా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు
ఐశ్వర్య: కచ్చితంగా నీ దగ్గర డబ్బులు ఉండే ఉంటాయి. నాకు ఇప్పుడే డబ్బులు కావాలి
రాజు: నువ్విలా ప్రెసర్ పెడితే బాగోదు చెప్తున్నా
ఐశ్వర్య: ఏం చేస్తావురా..? చెప్పు ఏం చేస్తావు..
రాజు: ఏముంది ఈ విషయాలు మొత్తం మీ రేఖ ఆంటీ దగ్గరకు తీసుకెళ్తాను. ఎలాగూ కిడ్నాప్ చేసింది నేనే అని అందిరికీ తెలుసు. ఇప్పుడు నీకు నాకు లెక్కల్లో తేడా వచ్చింది అని చెబితే తను ఏం సాల్వ్ చేస్తుందో అదే ఫాలో అవుదాం
ఐశ్వర్య: అలా అయితే ఈ కిడ్నాప్ చేయించింది నేనే అని తెలుస్తుంది కదా..?
రాజు: అక్షరం పొల్లుపోకుండా చెప్తాను. నువ్వే ఇందును కిడ్నాప్ చేయమన్నావని ఇరవై లక్షలకు ఒప్పుకోమన్నావని మొత్తం చెప్తాను
ఐశ్వర్య: ఏంటి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా..?
రాజు: అవును కాకపోతే నీ డబ్బులు నీకు ఇవ్వాలనుకుంటున్నాను.. కొద్దిగా టైం ఇస్తే.. లేదంటే మీ రేఖ ఆంటీకి అంతా చెప్పేస్తాను
అంటూ బెదిరించి రాజు వెళ్లిపోతాడు. ఐశ్వర్య మాత్రం రాకేష్ డబ్బుల గురించి ఆలోచిస్తుంది. మరోవైపు రేఖ ఎలాగైనా ఇందు పెళ్లిని క్యాన్సిల్ చేయాలని ఆలోచిస్తుంది. అప్పుడే అక్కడకు వచ్చిన ఇందు తనకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని మీరేం చెబితే అది చేస్తానని అంటుంది. దీంతో రేఖ అయితే విడాకులు ఇస్తావా…? అని అడగ్గానే.. ఇందు ఇస్తానని చెప్తుంది. అయితే నువ్వు వెళ్లు నేను చూసుకుంటాను అంటుంది రేఖ. ఇందు వెళ్లిపోగానే.. చూశావా వదిన ఇష్టం లేని పెళ్లి అవ్వగానే.. ఎలా మన వైపు తిరిగిందో… దీనికి వెంటనే విడాకులు ఇప్పించిన మదన్‌తో పెళ్లి జరిపించాలి అంటుంది. అయితే భ్రమరాంబ మాత్రం మదన్‌తో స్వాతి పెళ్లి చేయాలని ఎలాగైనా రేఖ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయ్యేలా చేయాలని మనసులోనే అనుకుంటుంది. ఇక ఒకవైపు లక్కీ, మరోవైపు చలపతి, రాజుకు ఫోన్ చేస్తారు. ఫోన్ స్విచ్చాప్ రావడంతో ఒకరికి ఒకరు ఫోన్ చేసుకోవాలనుకుంటారు. అప్పుడే లక్కీ ఫోన్ చేయడంతో చలపతి రాజు గురించి అడుగుతాడు. తన దగ్గర లేకే నేను మీకు ఫోన్ చేశానని లక్కీ చెప్పడంతో చలపతి, లక్ష్మీ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
