Brahmamudi Serial Today Episode: రేఖ నుంచి ఎలాగైనా ఆస్థిని ఇందుకు దక్కేలా చేయడానికి అపర్ణ లాయరును కలుస్తుంది. లాయరుకు అన్ని వివరాలు చెప్తుంది. లాయరు అంతా విన్న తర్వాత అపర్ణకు ధైర్యం ఇస్తాడు. 

Continues below advertisement

లాయరు: అది పూర్తిగా ఇల్లీగల్‌ మేడం మీరు ఎందుకు ఊరికే ఉన్నారు 

అపర్ణ: అప్పుడున్న పరిస్థితులకు అలా ఉండాల్సి వచ్చింది. 22 ఏళ్లుగా మా ఖర్చుల కోసం కంపెనీ నుంచి ప్రతి నెలా వస్తున్న డబ్బు మొత్తం ఆ రేఖే తీసుకుంటుంది. దాని వల్ల నా మనవరాళ్లకు అన్యాయం జరుగుతుంది

Continues below advertisement

లాయరు: ఇది ఇంకా పెద్ద తప్పు మేడం.. మీరు కానీ కోర్టుకు వెళ్లితే ఇన్నేళ్లుగా మీకు రాకుండా వాళ్లు దోచుకున్న డబ్బు వడ్డీతో సహా మీకు కట్టాలని కోర్డు ఆర్డర్‌ ఇస్తుంది

అపర్ణ: లాయరు గారు వాళ్లు ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి రాకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నా మనవరాలు మేజర్‌ కాబట్టి తన పేరు మీదకు ఆస్థి మొత్తం ట్రాన్స్‌ఫర్‌ అయ్యే వరకు పవరాఫ్‌ పటార్ని కూడా నా మనవరాలికి వచ్చేలాగా కోర్టులో కేసు వేయండి.. 

లాయరు: ఇది చాలా చిన్న కేసు మేడం.. రేఖ గారు ఎంత ట్రై చేసినా కేసులో నిలవలేరు. వాళ్లు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తారు. ఇందులో తప్పకుండా మీరే గెలుస్తారు.

అపర్ణ: నాకు ఇప్పుడు కావాల్సింది గెలుపు ఓటములు కాదు లాయరు గారు.. న్యాయం.. ఇన్నేళ్లుగా నా మనవరాలికి జరుగుతున్న అన్యాయానికి ఇప్పుడే న్యాయం కావాలి. 

లాయరు: తప్పకుండా మేడం ఇవాళే ఆ రేఖ గారి మీద కేసు వేస్తాను.. తన పేరు మీద ఉన్న పవరాఫ్‌ పటార్ని ఇందు గారి పేరు మీదకు వచ్చేలా చేస్తాను.. 

అపర్ణ: థాంక్యూ  లాయరు గారు కానీ ఒక్క ముఖ్యమైన విషయం 

లాయరు: ఏంటి మేడం చెప్పండి..

అపర్ణ: కోర్టులో ఈ కేసు మాకు అనుకూలంగా వచ్చే వరకు ఈ విషయం బయటకు రాకూడదు.. ముఖ్యంగా ఆ రేఖకు ఈ విషయం తెలియకూడదు.. 

లాయరు: నాకు తెలుసు మేడం వాళ్లకు ఈ విషయం తెలిస్తే.. వాళ్లు ఏదో విధంగా జాగ్రత్త పడతారు 

అపర్ణ: ఆరోజు అన్యాయంగా నాచేత ఎలా సంతకం పెట్టించుకుందో వాటికి సంబంధించిన డాక్యెమెంట్స్‌ ఇందులో ఉన్నాయి 

లాయరు: మేడం ఈ విషయం నాకు వదిలేయండి నేను చూసుకుంటాను

అపర్ణ: ఇప్పుడున్న పరిస్తితుల్లో నేను మీకు ఫీజు రూపంలో డబ్బులు ఇవ్వలేను అందుకే వీటి రూపంలో ఇస్తున్నాను.. అపర్ణ నగలు ఇస్తుంది.

లాయరు: ఏంటి మేడం ఇది 

అపర్ణ: ఇలా ఇస్తున్నానని మీరు ఇబ్బంది పడకండి నా మనవరాలికి న్యాయం జరిగితే అంతే చాలు ఆలోచించకండి లాయరు గారు ఫ్లీజ్‌ తీసుకోండి.. 

లాయరు నగలు తీసుకుని అపర్ణకు ధైర్యం చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు ఇంటర్వ్యూలు అయిపోయాక ఇందు ఆఫీసుకు వెళ్తుంది. అక్కడ హెచ్‌ఆర్‌ జాబ్ లేదని చెప్పడంతో ఇంటికి బయలుదేరుతుంది. మరోవైపు రాజు ల్యాప్‌ టాప్‌ డీల్‌ లో డబ్బులు సంపాదించాలనుకుంటాడు. అందుకోసం ఒక వ్యక్తితో డీల్‌ సెట్‌ చేసుకుంటాడు. గుడి నుంచి అపర్ణ, బయటి నుంచి ఇందు ఒకేసారి ఇంటికి వస్తారు. ఇంట్లో సుభాష్‌ రూంలోంచి రేఖ, డాక్టర్‌ బయటకు రావడం చూసి షాక్‌ అవుతారు. ఏమైందని రేఖను అడగ్గానే.. సుభాష్‌కు మూర్చ వచ్చిందని అందుకే డాక్టర్‌ను పిలిపించానని చెప్తుంది. దీంతో ఇందు, అపర్ణ లోపలికి వెళ్లి కంగారుపడుతుంటే.. సుభాష్‌ మాత్రం తనకు ఏమీ కాలేదని మీరెందుకు కంగారు పడుతున్నారంటూ చెప్తుండగానే నిజంగానే సుభాష్‌కు మూర్చ వస్తుంది. దీంతో ఇందు, అపర్ణ భయంగా హాల్లోకి వెళ్లి రేఖను అడగ్గానే.. రేఖ కోపంగా ఇద్దరిన తిడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.