Brahmamudi Serial Today Episode: రాజ్‌ సంబంధించిన ఐడెంటిటీని మార్చేందుకు యామిని ట్రై చేస్తుంటే.. వాళ్ల అమ్మా నాన్నలు వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అయితే యామిని చేసే పనులను వాళ్ల నాన్న వ్యతిరేకిస్తాడు. నువ్వు ఇలా చేయడం నాకు ఇష్టం లేదని చెప్తాడు. రాజ్ కు నిజం తెలిస్తే బాగోదని హెచ్చరిస్తాడు.

Continues below advertisement


యామిని: అవేమీ జరగకూడదనే కదా రాజ్‌ను తీసుకుని ఫారిన్‌ వెళ్లాలని డిసైడ్‌ అయ్యాను


వైదేహి: అంతా నీ ఇష్టమేనా..? ఇన్నాళ్లు ఆరోగ్యం బాగాలేదని మాకు దూరంగా ఉన్నావు. మ అదృష్టం బాగుండి మళ్లీ తిరిగొచ్చావు. మాకు నచ్చకపోయినా.. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానిక ఒప్పుకున్నాం. ఇప్పుడేమో మళ్లీ ఫారిన్‌ వెళ్తా అంటున్నావు.


యామిని: ఇక్కడే ఉంటే రాజ్‌కు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌ ఎదురుపడొచ్చు. ఎవరొచ్చినా నేను మాత్రం రాజ్‌ను వదులుకునే ప్రసక్తే లేదు. అది వేరే సంగతి కానీ అనవసరంగా గొడవలు జరిగితే మా పెళ్లి లేట్‌ అవుతుంది. అందుకే ఫ్యారిన్‌ తీసుకెళ్లి అక్కడే పెళ్లి చేసుకుంటాను. గతం గుర్తు రాకుండా జాగ్రత్త పడతాను. మీరు కావాలనుకుంటే ఎప్పుడైనా రావొచ్చు. మమ్మల్ని చూడొచ్చు


యామిని ఫాదర్‌: నాకు ఇష్టం లేదు. ఇప్పటికే నువ్వు నా నోరు నొక్కి చాలా దూరం తీసుకొచ్చావు. సరే నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి పాపం అని తెలిసినా మౌనంగా ఊరుకున్నాం. కానీ ఇప్పుడు నువ్వు ఫారిన్‌ వెళ్లిపోతే పర్మినెంట్‌గా మాకు దూరం అయిపోతావు. మాకేం నలుగురు పిల్లలు లేరు. నువ్వు ఒక్క దానివే..


యామిని: డాడీ ఫ్లీజ్‌ అర్థం చేసుకో నా పరిస్థితి నీకు తెలుసు కదా


అంటూ డిస్కషన్‌ చేసుకుంటుంటే రాజ్‌ వస్తాడు. రాజ్‌ను చూసిన యామిని అంతా విన్నాడా..? అని భయడుతుంది.


రాజ్‌:  ఏమైంది అంకుల్‌ .. చాలా సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు.


యామిని ఫాదర్‌: ఆ తల్లి బిడ్డనే అడుగు వాళ్లే చెప్తారు.


రాజ్‌:  ఏమైంది యామిని, ఆంటీ చెప్పండి..


యామిని: ఏం లేదు బావ ఫ్యారిన్‌ వెళ్లి మనం సెటిల్‌ అవుదామంటే మమ్మీ డాడీ ఒప్పుకోవడం లేదు


వైదేహి: అదంతా తర్వాత బాబు మీ పెళ్లి ఇక్కడే జరిపించాలని నా కోరిక.


రాజ్‌:  నేను ఇంకా జరిగిన దాన్ని డైజెస్ట్‌ చేసుకోలేకపోతున్నాను. అప్పుడే ఫ్యారిన్‌ దాకా ఎందుకు.. పెళ్లి ఎందుకు ఫ్లీజ్‌ కొద్ది రోజులు ఆగండి.


అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు రూంలో కావ్య తనలో తాను మాట్లాడుకోవడం చూస్తుంది ఇందిరాదేవి. కిందకు వెళ్లి అందరితో కావ్య పరిస్థితి ఏం బాగాలేదని చెప్తుంది.


రుద్రాణి:  ఏం చీకటి గదిలో కూర్చుని చంద్రుడికి నాట్యం చేస్తుందా ఏంటి..?


అపర్ణ: ఒక్కమాట కూడా మంచి మాట మాట్లాడలేవా..?


స్వప్న: మానుఫాశ్చరింగ్‌ డిఫెక్ట్‌ ఆంటీ కొన్ని జీవితాలు అంతే


రుద్రాణి:  భయమేస్తుంది అంటే అలాంటిదేమైనా చేస్తుందేమోనని డౌటు వచ్చి బయటకు అనేశాను. వాక్‌ స్వాతంత్రం కూడా లేదా మాకు ఈ ఇంట్లో


ప్రకాష్‌:  సందు దొరికినప్పుడల్లా కుక్కలా మొరుగుతూ వాక్‌ స్వాతంత్రం లేదా అంటున్నావా..? అసలు సిగ్గు లేకపోతే సరి నీకు


సుభాష్‌: అమ్మా అసలు ఏమైందో చెప్పు


ఇందిరాదేవి: రాజ్‌ ఇంకా బతికి వస్తాడనే భ్రమలోనే తను బతుకుతుందిరా..


ధాన్యలక్ష్మీ:  తనంత గుడ్డిగా నమ్ముతుంది. మనం చెప్పినా వినే పరిస్తితిలో లేదు కదా


ఇందిరాదేవి: అవునురా రాజ్‌ తన పక్కనే ఉన్నట్టు.. తనతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటూ తనలో తానే మురిసిపోతుంది. రాజ్‌ ఇంకా వస్తాడని  వాడికోసం ఎదురుచూస్తుంది. ఈ రుద్రాణి చెప్పినట్టు..


రుద్రాణి: ఆపారేం చెప్పండి


ఇందిరాదేవి:  తన మానసిక పరిస్థితి మారిపోతుందేమో అనిపిస్తుందిరా


సుభాష్‌: ఏం చెప్తున్నావు అమ్మా


ఇందిరాదేవి: అవునురా ఇప్పుడే తనను లోపల చూసి వచ్చానురా


అంటూ అందరూ కావ్య గురించి బాధపడతారు. డాక్టర్‌ కు చూపించాలని డిసైడ్‌ అవుతారు. మరోవైపు ఒంటరిగా కూర్చుని కావ్యను గుర్తు చేసుకుంటాడు. హాస్పిటల్‌కు తీసుకెళ్లిన విషయం ఆలోచిస్తుంటాడు. ఇంతలో యామిని రాగానే కావ్య గురించి చెప్తాడు. దీంతో యామిని వెంటనే రాజ్ ఫారిన్‌ తీసుకెళ్లాలని మనసులో అనుకుంటుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో రాజ్‌కు కర్మకాండలు జరిపిస్తుంటారు.  ఇంతటితో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!