Brahmamudi Serial Today Episode: కావ్యకు స్పృహ వస్తుంది. రాజ్‌ ఎక్కడని అడుగుతుంది. మీరు అందరూ నా దగ్గర ఎందుకున్నారని ఆయన్ని వెతకండని చెప్తుంది. అప్పును తిడుతుంది.  షర్ట్‌ దొరికిందంటే ఆయన ఉన్నట్టే కదా అంటుంది. ఆయన దారి తప్పి పోయాడేమో.. ఆయనకు దాహం వేస్తుందేమో.. ఆకలి వేస్తుందేమో.. అప్పు మనం వెళ్దాం పదే వెళ్లి వెతుకుదాం అంటుంది. అందరూ ఇప్పుడు వద్దు కావ్య ఆగు అని ఆపేస్తారు.

కావ్య: మీరు వచ్చినా రాకున్నా నేను వెళ్లి వెతుకుతాను.

డాక్టర్‌: హలో ఏంటిది… మిగతా పేషెంట్స్‌కు డిస్టర్బ్‌ గా ఉంది. మీకు గాయాలకు ట్రీట్‌మెంట్‌ చేశాం కదా..? డిస్‌చార్జ్‌ చేస్తాం వెళ్లిపోండి

కావ్య: త్వరగా చేయండి డాక్టర్‌. ఇక్కడే ఉంటే నేను మా ఆయనను వెతకలేను

డాక్టర్‌:  ఫార్మాలిటీస్‌ అన్ని పూర్తి చేసి చెప్తాము

కావ్య: నేను వెళ్లి వెతుకుతాను. ఆయన దొరుకుతారు. ఆయన ఎక్కడికి పోరు.. ఆయన క్షేమంగా ఉంటారు.

కనకం: అమ్మా కావ్య అల్లుడు గారు క్షేమంగా ఉంటే నీకోసం వస్తారు తల్లి.. అయన వచ్చే వరకు నువ్వు ధైర్యంగా ఉండాలి తల్లి

అంటూ కనకం ఓదారుస్తుంది. తర్వాత కావ్యను తీసుకుని ఇంటికి వెళ్తుంటారు. మరోవైపు రాజ్‌ను తీసుకుని యామిని వెళ్తుంది. ఇద్దరూ లిఫ్ట్‌ దగ్గర ఎదురు పడతారు అయితే అప్పటికే లిఫ్ట్‌ డోర్‌ క్లోజ్‌ కావడంతో ఒకరిని ఒకరు చూసుకోలేరు. రాజ్‌ను ఇంటికి తీసుకెళ్లిన యామిని కట్టుకథ చెప్పడం మొదలు పెడుతుంది. ఇంట్లో కూడా రాజ్‌ తో తను ఉన్న ఫోటోలు పెట్టి ఉంటుంది.

యామిని: బావ ఇదే మన ఇల్లు.. చిన్నప్పటి నుంచి మనం కలిసి పెరిగిన ఇల్లు. ఇక్కడే ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఇద్దరం కలిసి ఆడుకున్నాం. ఇద్దరం కలిసి బతకాలనుకున్నాం. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది బావ. చూశావా బావ మనకు ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగిపోయింది. నీకు ఏవీ గుర్తు రావడం లేదా..?

రాజ్‌: లేదు.. గుర్తు రావడం లేదు.

యామిని: సరే ఉండు బావ నీ రూం రెడీ చేసి వస్తాను

వైదేహి: చిన్నప్పటి నుంచి యామిని నువ్వే కాబోయే భర్తవు అని ఎన్నో కలలు కంది బాబు. దాని ఇష్ట ప్రకారమే అన్ని జరిపించాం. నిశ్చితార్థం కూడా జరిపించాం. కొద్ది రోజుల్లో పెళ్లి అనగా ఇలా జరిగింది బాబు. మీ ఇద్దరు సంతోషంగా ఉంటే కళ్లారా చూడాలని ఎంతో ఆశపడ్డాం. కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది. బాబు ఏమైనా గుర్తుకు వస్తుందా..?

యామిని:  అయ్యో బావా వచ్చింది ఇప్పుడే కదమ్మా..  రాగానే పాతవి అన్ని గుర్తు చేయాలా..? బావా రా రూం రెడీ చేశాను

అని రూంలోకి రాజ్‌ను తీసుకెళ్లి తమ ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు ఉన్న ఆల్బమ్‌ రాజ్‌కు ఇస్తుంది యామిని. ఆ ఆల్బమ్‌ చూస్తూ కన్ఫీజ్‌ అవుతుంటాడు రాజ్‌. మరోవైపు ఇంటికి వచ్చిన కావ్యను చూసి స్వప్న ఏడుస్తుంది. కావ్య మాత్రం గోడకు ఉన్న రాజ్‌ ఫోటో దగ్గరకు వెళ్లి చూస్తూ ఏమోషనల్‌ అవుతుంది. ఇందిరాదేవి వెళ్లి ఓదారుస్తుంటే.. నాకేం కాలేదని ఆయన ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటారని నా మనసు చెప్తుంది. కాకపోతే ఆయన ఎక్కడున్నారో తెలియదని బాధపడుతున్నానని అపర్ణ ను కూడా కావ్య ఓదార్చి వెళ్తుంది. అయితే కావ్యకు పిచ్చి పట్టిందని రుద్రాణి అనగానే ఇందిరాదేవి రుద్రాణిని కొడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!