Brahmamudi Serial Today Episode:  అడవిలో స్పృహ తప్పి పడిపోయిన రాజ్‌, కావ్యల దగ్గరకు రౌడీలు వస్తారు. వాళ్లను అలా చూసి హ్యాపీగా ఫీలవుతారు. కావ్యను చంపడానికి ఇదే మంచి టైం అనుకుని కత్తి తీసుకుని పొడవడానికి వెళ్తారు. కట్ చేస్తే.. ఉదయం దుగ్గిరాల ఇంట్లో అందరూ కంగారు పడుతుంటారు. ఇందిరాదేవి కాల్‌ చేస్తుంది. కలవదు.

రుద్రాణి: మీరు ఎంత ట్రై చేసినా వాళ్లు మీకు  దొరకరు. ఆ యామిని చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ పాటికి ఆ రౌడీలు ఆ కావ్యను ఫినిష్‌ చేసి ఉంటారు. రాజ్‌ కావ్య శవం ముందు కూర్చుని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. (మనసులో అనుకుంటుంది.)

అపర్ణ: అత్తయ్యా ఏమైనా తెలిసిందా..? అప్పు ఫోన్‌ రింగ్‌ అవుతుందా..?

ఇందిరాదేవి: లేదు అపర్ణ ఫోన్‌ నాట్‌ రీచబుల్‌ అని వస్తుంది

ధాన్యం: అసలు వాళ్లు అడవిలో తప్పిపోవడం ఏంటి..? అప్పు వాళ్లను వెతుక్కుంటూ వెళ్లడం ఏంటి.. అడవిలో రాత్రంతా ఉన్నారంటే నాకు భయం వేస్తుంది

ప్రకాష్‌:  ధాన్యం అసలే వదిన కంగారు పడుతుంటే వాళ్లను ఇంకా నువ్వు కంగారు పెడతావేంటి..?

సుభాష్‌: అవును అపర్ణ అప్పు పోలీసులను తీసుకుని వెళ్లింది కదా..? తప్పకుండా వాళ్లను కాపాడి ఉంటుంది కంగారు పడకు తప్పకుండా వాళ్లు తిరిగి వస్తారన్న నమ్మకం నాకుంది

రుద్రాణి:  అని వదినను మోసం చేస్తున్నావా..? లేకపోతే నిన్ను నువ్వు మభ్య పెట్టుకుంటున్నావా..? అన్నయ్యా.. కోపంగా కాదు.. కాస్త లాజికల్‌ గా ఆశించండి వెళ్లింది ఏమైనా రుద్రమదేవి అనుకున్నారా..? అందరినీ మట్టు పెట్టి తిరిగి రావడానికి నిన్న కాక మొన్న జాయిన్‌ అయింది డ్యూటీలో అప్పుడు కూడా అంతే రాజ్‌, కావ్య శ్రీశైలానికి వెల్లినప్పుడు రాజ్‌ కనిపించకుండా పోయాడు. ఇప్పుడేమో ఇద్దరూ కనిపించకుండా పోయారు.

ఇందిరాదేవి: అసలే మేము వాళ్లకు ఏమైందని కంగారు పడుతుంటే.. అంత క్రూరంగా ఎలా మాట్లాడతున్నావే

రుద్రాణి:  అంతేలేమ్మా..? కాసేపట్లో అప్పు  డల్లుగా వచ్చి ఆపరేషన్‌ ఫెయిల్‌ అయిందని చెప్తుంది చూడండి.

ఇందిరాదేవి: చీ నోర్మూయ్ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో

అనగానే రుద్రాణి వెళ్లిపోతుంది. అపర్ణ భయపడుతుంది. నిజంగా రుద్రాణి అన్నట్టు వాళ్లకు ఏమైనా అయిందేమోనని కంగారు పడుతుంది. మరోవైపు యామిని రౌడీలకు ఫోన్‌ చేస్తుంది. ఫోన్‌ కలవదు. ఇంతలో వైదేహి వస్తుంది.

వైదేహి: అవును రాత్రి ఆ కావ్యను ఏదో చేయడానికి ప్లాన్‌ చేశాను అన్నావు ఇంతకీ ఏం ప్లాన్‌ చేశావు

యామిని:  ప్లాన్‌ ఏమీ  లేదు డైరెక్టుగా దాన్ని పైకి పంపించేందుకు టికెట్‌ బుక్‌ చేశాను

వైదేహి:  అంటే ఏంటి అర్థం యామిని..

యామిని: దాన్ని చంపమని రౌడీలకు సుపారి ఇచ్చాను

వైదేహి:  ఏంటే నువ్వు చెప్పేది.. చంపమని సుపారి ఇవ్వడమేంటి..?

యామిని:  అవును మమ్మీ నేను బావను  సొంతం చేసుకోవడానికి ప్లాన్‌ వేసి రిసార్ట్‌ కు తీసుకెళితే అక్కడకు వచ్చి నా ప్లాన్‌ వేస్ట్‌ చేసింది. బావను నా సొంతం చేసుకుందామనుకున్న ప్రతిసారి అది పంటి కింద రాయిలా తయారయింది. అందుకే దాన్ని చంపమని రౌడీలను పంపించాను.

అని చెప్పి వెళ్లపోతుంది యామిని. మరోవైపు ఒక దగ్గర రాజ్‌ కావ్య పడుకుని ఉంటారు. రౌడీలు చెట్టుకు కట్టేసి ఉంటారు. రాజ్‌ నిద్ర లేచి కావ్యన నిద్ర లేపి మెచ్చుకుంటాడు. అప్పు పక్కనే కూర్చుని వాళ్లను చూస్తుంది. రాత్రి అడవిలో ఏం జరిగిందో మొత్తం చెప్తుంది. తర్వాత రౌడీలను స్టేషన్‌కు పంపించి.. కావ్య, అప్పు ఇంటికి వెళ్తారు. ఇంట్లో జరిగిందంత చెప్తారు. అందరూ అప్పు ధైర్యాన్ని మెచ్చుకుంటారు. మరోవైపు యామిని ఇంటికి వెళ్లిన రాజ్‌ షాక్‌ అవుతాడు. అక్కడ పెళ్లి పనులు మొదలుపెట్టి ఉంటారు. దీంతో రాజ్‌ డైలమాలో పడిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!