Brahmamudi Serial Today Episode: రాజ్‌, కావ్య కలిసి మాయను వెతకడానికి వెళ్తారు. కావ్య దేవుడా ఆపరేషన్‌ మాయ త్వరగా సక్సెస్‌ అయ్యేలా చూడు అని మొక్కుతుంది. ఇంతలో కారు ఆగిపోతుంది. దీంతో రాజ్‌ ఇరిటేటింగ్‌ గా ఆపరేషన్‌ మాయ స్పీడుగా ముందుకెళ్లడం కాదు. మన కారు ఆగిపోయింది. అని వెళ్లి ఇంజన్‌ రిపేరు చేసి వెళ్దాం పద అని వెళ్లబోతుంటే కారు వెనకాల మాయ పరుగత్తుకొస్తుంది. ఆమె వెనకాల రౌడీలు  తరుముతుంటారు. కావ్య సైడు గ్లాసులోంచి మాయను చూసి కారు ఆపమని రాజ్‌కు చెప్పడంతో రాజ్‌ కారు ఆపి మాయను రౌడీల నుంచి సేవ్‌ చేస్తాడు. ఇద్దరూ కలిసి మాయను ఇంటికి తీసుకొస్తారు.


కావ్య: ఆ మాయ అబద్దం ఈ మాయే నిజం.. ఈ నిజాన్ని మీ ముందు నిలబెట్టడానికే నేను చాలా ప్రయత్నాలు  చేశాను. ఎందుకంటే ఈ నిజం వెనక కూడా చాలా అబద్దాలు ఉన్నాయి. ఇన్ని రోజులు మామయ్యగారు కూడా మోసపోయారు. నిజానికి మోసం చేసింది మామయ్యగారు కాదు ఈ మాయ. తల వంచుకుంటే చాలదమ్మా నోరు విప్పి నిజాలన్నీ బయటపెట్టు.


రుద్రాణి: ఏం మాయ చేద్దామని ఇంకోక మాయను తీసుకొచ్చావు కావ్య. ఎవరిని మాయ చేద్దామని ఈ మాయను తీసుకొచ్చి నిలబెట్టావు. ఓ సారి తెరతీసి ఆ మాయను చూపెట్టావు. ఈసారి తెరతీసి ఈ మాయను చూపెడుతున్నావు. ఆ నాటకం బయటపడే కదా మా వదినకు హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చింది. ఇప్పుడు ఇంకెవరికి హార్ట్ స్ట్రోక్‌ తెప్పించాలనుకుంటున్నావు.


కావ్య: మీకే... మీకే రుద్రాణి గారు కావాలా?


స్వప్న: ఆ పని చేయవే నెలకో పిండం పెట్టి దండం పెట్టుకుంటాను.


రుద్రాణి: ఏం మాట్లాడుతున్నారు మీ అక్కాచెల్లెల్లు. ఈమె నిజమైన మాయ అని ఫ్రూప్స్‌ ఏంటి?


సుభాష్‌: నేనే.. ఈమె మాయ


రుద్రాణి: అబద్దం. కావ్య రాజ్‌ కలిసిపోయి మళ్ళీ మోసం చేస్తున్నారు.


రాజ్‌: అవునా.. నీకెలా తెలుసు..? నీకెలా తెలుసు చెప్పు..


READ ALSO: షారుఖ్ ఇంట్లో ఒక్క రోజైనా స్టే చెయ్యాలని ఉందా? ఇంత చెల్లిస్తే చాలు మీరే వన్ డే బాద్‌షా


స్వప్న: రాత్రి కలోచిందా? లేదంటే అందరూ కలిసిపోయే టై వచ్చేసరికి కుళ్లు వచ్చిందా? నువ్వు నోరు మూసుకుంటే మాయ నోరు తెరుస్తుంది..


ప్రకాష్‌: రుద్రాణి నిన్ను ఆరోజే పాములుండే ఫామ్‌ హౌస్‌ కు పంపించి ఉంటే బాగుండేది.


కళ్యాణ్‌: నీకు ఇలాంటి చావు తెలివి తేటలు ఎక్కడి నుంచి వస్తాయి అత్తా..? మాయ నోరు విప్పక ముందే  అబద్దం అని ఎలా చెప్తున్నావు.


ధాన్యలక్ష్మీ: అసలు మాయని జరిగిందేంటో కనుక్కోక ముందే నువ్వెందుకు ఉలిక్కిపడుతున్నావు రుద్రాణి.


రాహుల్‌: చాలా ఇంత మందితో మాటలు పడుతున్నావు చాలా? నువ్వు ఇంట్లో వాళ్ల మంచి కోరి చెప్తున్నా వాళ్లు పట్టించుకోనప్పుడు కామ్‌ గా ఉండొచ్చు కదా?


రాజ్‌: మమ్మీ డాడీ మోసపోయారు ఇది నిజం. డబ్బు కోసం కన్నబిడ్డను దూరం చేసుకున్న ఈ మనిషి మోసాన్ని కనిపెట్టింది కావ్య. ఆ మోసాన్ని నిరూపించేందుకు ఒకసారి చాలా పెద్ద ప్రమాదంలో పడింది. అప్పుడు నేనే సేవ్‌  చేశాను. తర్వాత ఈ మాయ ఉండాల్సిన అడ్రస్‌లో దొంగ మాయ ఉంది. కావ్యను మోసం చేసి మన ఇంట్లోకి వచ్చింది.


 అంటూ రాజ్‌ జరిగిన విషయాలు  మొత్తం చెప్తాడు.  మాయ కూడా జరిగిన విషయాలు మొత్తం చెప్తుంది. ఆ బిడ్డ నాకు పుట్టలేదు. సుభాష్‌ గారికి పుట్టలేదు. ఆ బిడ్డను అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చి నాకిచ్చి సుభాష్‌ గారిని బెదిరించి  నెలకు  పది లక్షలు గుంజమని చెప్పారు. అంటూ అన్ని నిజాలు చెప్తుంది మాయ. ఇంకెప్పుడు మీ జీవితాల్లోకి రానని వెళ్లిపోతుంది. అందరూ హ్యాపీగా.. సంతోషంగా ఊపిరి పీల్చుకుంటారు. ఇంతలో రుద్రాణి అంతా బాగానే ఉంది కానీ మళ్లీ ఈ బిడ్డను  ఏం చేస్తారు అని అడుగుతుంది. దీంతో రాజ్‌, కావ్య తామే ఆ బిడ్డను పెంచుకుంటామని చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.