Brahmamudi Serial Today Episode: ఇంట్లోంచి రాహల్‌, రుద్రాణి ఎస్కేప్‌ అవుతారు. అది గమనించిన స్వప్న వెంటనే ఇందిరాదేవికి ఫోన్‌ చేసి చెప్తుంది. సరే మేము చూసుకుంటామని బామ్మ చెప్తుంది. అందరూ రాజ్‌, యామిని నిశ్చితార్థంలో హడావిడిగా ఉంటారు.  

Continues below advertisement


వైదేహి: గతంలో నిశ్చితార్థం జరిగినప్పుడు ఇలా తాంబూలాలు మార్చుకోలేదు. ఈరోజు తల్లి స్థానంలో మీరుండి ఈ కార్యం జరిపిస్తున్నందుకు మీకు చాలా థాంక్స్‌ అపర్ణ గారు


ఇందిరాదేవి: కొన్ని పనులు ఎవరి చేతుల మీదుగా జరగాలో ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి వైదేహి. కాదని మనం ఎంత ప్రయత్నించినా ఇదిగో ఇలా ఆటంకాలు వస్తూనే ఉంటాయి


పంతులు:  అమ్మా శుభ ఘడియలు మొదలయ్యాయి ఇక తాంబూలాలు మార్చుకోండి


యామిని: చూశావా మీ అత్తగారి చేతుల మీదుగానే తాంబూలాలు తీసుకుంటున్నాను. (మనసులో అనుకంటుంది.)


కావ్య:  తాంబూలాలు మార్చుకోవడమే కదా ఇంకా జరిగేది చాలా ఉంది. మనసులో అనుకుంటుంది. అపర్ణ, వైదేహి తాంబూలాలు మార్చుకుంటారు.


పంతులు:  అమ్మా వధూవరులిద్దరూ ఉంగరాలు మార్చుకోండి. ఆ తర్వాత నేను పెళ్లికి మంచి ముహూర్తం పెడతాను


వైదేహి:  అలాగే పంతులు గారు.. ఉంగరాలు గదిలో ఉన్నాయి తీసుకొస్తాను.


ఉంగరం తీసుకుని వస్తుండగా.. వెనక నుంచి వచ్చిన కనకం.. వైదేహి కిందపడేలా చేస్తుంది. దీంతో వైదేహి చేతిలోని ఉంగరాలు కిందపడిపోతాయి. కనకం వచ్చి వైదేహిని పట్టుకుని రింగ్స్‌  మార్చి ఇస్తుంది.


కనకం: చూసుకుని నడవాలి కదా వైదేహి గారు ఎత పెద్ద బాధ్యత నెత్తిన పెట్టుకున్నారు


వైదేహి: ఎంత పెద్ద బాధ్యత ఉన్నా నీలా డబ్బున్న వాళ్ల ఇంటికి కూతురును పంపించాలన్నా ఆరాటం నాకు లేదులే


కనకం: అవునులేండి.. మీలా పెళ్లైపోయిన వాళ్లను విడగొట్టి.. నాటకాలు ఆడి.. పరాయి వాళ్ల మెగుణ్ని మీ కూతురుకు మొగుడిగా మార్చాలన్నా గొప్ప మనసు నాకు రాలేదు దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను


వైదేహి వెళ్లిపోతుంది. పంతులుకు రింగ్స్‌ బాక్స్‌ ఇస్తుంది. అందులో రింగ్స్‌ కనబడవు.


పంతులు:  అమ్మా ఇందులో ఉంగరాలు ఎక్కడ..?


ధాన్యలక్ష్మీ:  సరిపోయింది. ఈ పెళ్లి జరగడం కంటే ఆగిపోవడమే ఎక్కువయింది. దోషాలు పోగోట్టాలని చెప్పి ఈ నిశ్చితార్థం జరిపిస్తే ఇది కూడా ఆగిపోయేలా ఉంది. ఏవండి ముత్తయిదులు మీరు ఏమీ అనరేంటి..?


ముత్తయిదలు: ఇది అపశకునం.. ఈ పెళ్లి జరగకూడదు.. ఆపేయండి


పంతులు: ఇదంతా నీ పనా (మనసులో అనుకుంటాడు)


కనకం: లేకపోతే నేను ఉండగా ఈ పెళ్లి జరగనిస్తానా..? (మనసులో అనుకుంటుంది)


పంతులు:  అమ్మా ముహూర్తం దాటి పోతుంది. అసలు ఉంగరాలు ఉన్నాయా లేవా..? అసలు నిశ్చితార్థం జరుగుతుందా..? లేదా..? ముహూర్తం పెట్టమంటే పెడతాను కానీ ఉంగరాలు తీసుకురమ్మంటే తీసుకురాలేనమ్మా


యామిని: శాస్త్రి గారు కొత్త ఉంగరాలే మార్చుకోవాలా..? పాతవి మార్చుకోకూడదా..?


పంతులు: బేషుగ్గా మార్చుకోవచ్చమ్మా


యామిని: బావ నీ చేతికి ఉన్న ఉంగరం నాకు పెట్టు నా చేతికి ఉన్న ఉంగరం నీ చేతికి తొడుగుతాను


రాజ్‌ సరే అంటాడు. ఇద్దరూ రింగ్స్‌ మార్చుకోవడానికి రెడీ అవుతుంటే కనకం ప్లాన్‌ బీ అమలు చేయాలని అందరినీ డైవర్ట్ చేసి తాను వెళ్లి యామినికి రింగ్‌ తొడుగుతుంది. రాజ్‌, పంతులు తప్పా ఎవ్వరూ చూడరు. తర్వాత పంతులు రేపు మంచి ముహూర్తం ఉంది పెళ్లి రేపు చేద్దాం అని చెప్తాడు. అందరూ సరే అంటారు. అయితే ఇవాళ మెహందీ ఫంక్షన్‌ చేద్దాం అంటుంది యామిని. తర్వాత పెళ్లి చెడగొట్టేందుకు దుగ్గిరాల ఫ్యామిలీ ఆలోచిస్తుంటే.. అప్పు వచ్చి యామిని గురించి నిజం తెలిసింది. బావకు యాక్సిడెంట్‌ చేయించింది యామినియే నట అని చెప్తుంది. ప్లాన్‌ ప్రకారం యామిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని చెప్తుంది.ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


  


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!