Brahmamudi Serial Today Episode: పంతులు తనకు తెలుసని ఆయన వీక్‌ పాయింట్‌ కూడా తెలసని కనకం చెప్తుంది. ఏంటని అపర్ణ, ఇందిరాదేవి అడగ్గానే ఆయన వీక్‌ పాయింట్‌ కనకాంబరం అని చెప్పి మీరు వెళ్లి పంతులను కనకాంబరం వచ్చింది పైన గదిలో ఉందని తీసుకురండి. అక్కడ పంతులును లాక్‌ చేసి మన దారిలోకి తెచ్చుకుందాం అని చెప్తుంది. సరేనని అపర్ణ, ఇందిరాదేవి పంతులు దగ్గరకు వెళ్లి చూస్తుంటారు.


పంతులు:  ఎంటండీ నా వంక అలా చూస్తున్నారు. కొంప దీసి నన్ను తినేస్తారా ఏంటి..?


ఇందిరాదేవి: అంత అదృష్టం మాకు వద్దులేండి శాస్త్రిగారు


పంతులు: మరి ఎందుకు అలా చూస్తున్నారు


అపర్ణ: ఎందుకంటే మీకోసం ఒకరు ఎదురుచూస్తున్నారు కాబట్టి


పంతులు: ఏమిటీ నాకోసం ఒకరు ఎదురుచూస్తున్నారా..? ఎవరు వాళ్లు


ఇందిరాదేవి: కనకాంబరం


అపర్ణ: పైన గదిలో ఉంది వెళ్లండి


పంతులు: చాలా థాంక్స్‌ అమ్మా దీర్ఘాయుష్మాన్‌భవ.. ఓరేయ్‌ శిష్యా చూస్తూ ఉండు ఇప్పుడే వస్తాను


పంతులు గదిలోకి వెళ్లి కనకాన్ని చూసి షాక్‌ అవుతాడు. నా కనకాంబరం ఎక్కడ అని అడుగుతాడు. ఇంట్లో ఉంటుంది అని కనకం చెప్తుంది. ఇంతలో అపర్ణ, ఇందిరాదేవి వస్తారు. పంతులును బెదిరించి ‌బ్లాక్‌ మెయిల్ చేసి పెళ్లి ఆపేసేందుకు ఒప్పిస్తారు. తర్వాత రాజ్‌, కావ్యను పక్కకు తీసుకెళ్లి నిజం చెప్తాడు.


రాజ్‌: మీరు అనుకుంటున్నట్టు యామిని పెళ్లి చేసుకుందామంటే నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేదండి. యామిని ఈ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది. అందుకే ఒప్పుకోవాల్సి వచ్చింది. నిజం చెప్పాలంటే నాకు ఈ పెళ్లే ఇష్టం లేదు. ఈ విషయం గురించి మీకు చెబుదామనుకుంటే మీరేమో వినిపించుకోవడం లేదు. ఇప్పుడు చెప్పండి కళావతి గారు నేను ఈ పెళ్లికి ఒప్పుకోవడంలో తప్పు ఏమైనా ఉందా..?


కావ్య: చనిపోతాను అని బెదిరిస్తే పెళ్లి చేసుకుంటారా రామ్‌ గారు. ఈరోజు యామిని బెదిరిస్తే పెళ్లి చేసుకుంటున్నారు. రేపు ఇంకో అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అంటే అప్పుడేం  చేస్తారు.. మనిషి బయపడితే పెళ్లి చేసుకోవడం కాదండి.. మనసుకు అనిపిస్తే చేసుకోవాలి. ఆ మనిషి కళ్ల ముందు లేకపోతే మనం బతకలేము అనిపిస్తే చేసుకోవాలి.. రామ్‌ గారు మీకు అలాంటి వాళ్లు ఎవరైనా ఉన్నారా..?


రాజ్‌:  ఉన్నారండి.. కానీ..


కావ్య:  అది నాకు చెప్పవలసిన అవసరం లేదు. మీ మనసును అడిగి తెలుసుకోండి..


అని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. మరోవైపు రూంలో బంధీలుగా ఉన్న రుద్రాణికి యామిని కాల్ చేస్తుంది.


రుద్రాణి: హలో చెప్పు యామిని


యామిని: ఏంటి ఫోన్‌ లిప్ట్‌ చేయడానికి ఇంత లేటు


రుద్రాణి:  ఫోన్‌ సైలెంట్‌లో ఉంది. చూసుకోలేదు.


యామిని: ఫోన్‌ మాత్రమే సైలెంట్‌లో ఉందా..? లేకపోతే నీ ప్లాన్‌ కూడా సైలెంట్‌లో ఉందా..?


రుద్రాణి: అదేంటి యామిని అలా అడిగావు..?


యామిని: ఈ పెళ్లి జరిపిస్తానని మాటిచ్చారు. కానీ ఇంత టైం అయినా మీరు  ఇంకా ఎక్కడ కనిపించడం లేదేంటి..? అసలు పెళ్లికి వచ్చావా..? లేదా..?


రుద్రాణి: వచ్చాను యామిని ఇదిగో ఇక్కడే పక్కన ఉన్నాను టైం చూసి ఎంట్రీ ఇద్దామని ఆగిపోయాను


యామిని: సరే సరే ఓకే..


అని ఫోన్‌ కట్‌ చేస్తుంది. పంతులతో కలిసి పై గదిలోంచి కిందకు వస్తున్న ముగ్గురిని కావ్య చూస్తుంది. అనుమానంగా పంతులును బ్లాక్‌ మెయిల్‌ చేశారా అంటూ నిలదీస్తుంది. అదేం లేదని నువ్వు ప్రతిదానిలో అనుమానిస్తున్నావేంటి అంటూ ఇందిరాదేవి తిడుతుంది. అందరూ అక్కడి నుంచి పూజ దగ్గరకు వెళ్తారు. పంతులు పూజ జరిపిస్తుంటే.. కనకం, అపర్ణ, ఇందిరాదేవి కోపంగా చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


  


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!