Brahmamudi Serial Today Episode: రాజ్‌, కావ్యల వల్లే మళ్లీ రేవతికి అపర్ణకు గొడవ అయిందని ఇందిరాదేవి కోప్పడుతుంది. అలాగే రేవతి కూడా పెళ్లి విషయంలో తొందరపడిందని తిడుతుంది.

ఇందిరాదేవి: మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాలను ఎటు తీసుకువెళ్లాలో నిర్ణయిస్తాయి అంటారు. ఆరోజు నువ్వు ఆవేశంలో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటే ఈరోజు ఇలా అందరం బాధపడేవాళ్లం కాదు అందరం కలిసి సంతోషంగా ఉండేవాళ్లం

రేవతి: నా రాత అలా ఉంటే నేనేం చేయగలను నాన్నమ్మ

ఇందిరాదేవి: అప్పట్లో నువ్వు మీ అమ్మకు చెప్పకుండా ఏ పని చేసే దానివి కాదు.. అలాంటిది ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావు. అంత ధైర్యం నీకెలా వచ్చింది.

రేవతి: అమ్మా నాన్నలకు చెప్పి వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం నాన్నమ్మ. కానీ రుద్రాణి అత్తయ్య ఇచ్చిన సలహా వల్లే ఇదంతా జరిగింది.

ఇందిరాదేవి: ఏంటి రుద్రాణి సలహా ఇచ్చిందా..?

రేవతి: అవును నాన్నమ్మ.. ఒక రోజు నేను ఈయన కలిసి ఉండటం రుద్రాణి అత్తయ్య చూసేసింది. ఇంట్లో వాళ్లకు తెలిస్తే పెళ్లికి ఒప్పుకోరని.. చెప్పకుండా పెళ్లి చేసుకుని వస్తే అందరూ ఏమీ చేయలేరని చెప్పింది. అందుకే మేము అలా చేశాము

ఇందిరాదేవి: ఇదంతా ఆ దొంగముఖంది ఇచ్చిన సలహానా..? దాని మాటలు నమ్మి నువ్వు ఇంత వరకు తెచ్చుకున్నావా..? అసలు దాని మాటలు ఎలా నమ్ముకున్నావే

రేవతి: ఇప్పుడు ఆవిడను తిట్టుకుని ఏం లాభం నాన్నమ్మ.. నా జీవితం ఇలా ఉండాలని ముందే ఆ దేవుడు రాసి పెట్టి ఉంటాడు. దానికి రుద్రాణి అత్తయ్య మాట తోడైయింది అంతే  

కావ్య: అనుకున్నాను.. నేను అనుకున్నాను…  ఇంట్లో ఇంత జరిగితే రుద్రాణి హస్తం లేకుండా ఉందా..? అని కానీ నా అనుమానమే నిజం అయింది

రాజ్‌: ఆవిడను చూడటానికి చాలా అందంగా ఉన్నా మనసులో ఇంత కన్నింగ్‌ దాచుకుందా..? నేను అస్సలు ఊహించలేదు

రేవతి: ఇప్పుడు ఎన్ని అనుకున్నా.. జరిగింది మార్చలేము కదా తమ్ముడు

ఇందిరాదేవి: మీరు ఊరుకున్నా నేను ఊరుకోను దానికి సరైన బుద్ది చెబుతాను.

అనుకుంటూ లోపలికి వెళ్తుంది. లోపల బెడ్‌రూంలో సాంగ్స్‌ పెట్టుకుని డాన్స్‌ చేస్తుంది రుద్రాణి. ఇంతలో రాహుల్‌ వచ్చి సాంగ్స్‌ ఆపేస్తాడు.

రుద్రాణి: రేయ్‌ ఏంట్రా సాంగ్స్‌ ఆపేశావు.. ప్లే చేయ్‌రా..?

రాహుల్‌: మామ్‌ ఏంటి ప్లే చేసేది అసలు ఏం చేస్తున్నావు నువ్వు

రుద్రాణి: ఆనందం తట్టుకోలేక డాన్స్‌ చేస్తున్నానురా..? ఇలాంటి ఫీలింగ్‌ వచ్చినప్పుడు దాన్ని బయటకు ఎక్స్‌ప్రెస్‌ చేస్తే అది డబుల్ అవుతుందంట కమాన్‌ నువ్వు కూడా చేయరా..?

రాహుల్‌: మామ్‌ నీ హ్యపీనెస్‌ను నేను కూడా అర్థం చేసుకోగలను కానీ కొంచెం కంట్రోల్‌ చేసుకో ఫ్లీజ్‌

రుద్రాణి: ఎందుకు కంట్రోల్‌ చేసుకోవాలిరా..?

రాహుల్‌: ఇంట్లో ఎవరైనా చూశారంటే ఈ గొడవ కావాలనే మనమే చేసినట్టు వాళ్లకు డౌటు వస్తుంది.

అని చెప్తుండగానే ఇందిరాదేవి రూంలోకి వస్తుంది. ఎందకమ్మా వచ్చావని రుద్రాణి అడగ్గానే నీకో గిఫ్ట్‌ ఇద్దామని వచ్చాను అంటూ చెంప పగులగొట్టి వెళ్లిపోతుంది. దీంతో రాహుల్‌, రుద్రాణి షాక్‌ అవుతారు. మరోవైపు రాజ్‌ ను కావ్య తిడుతుంది. నీ వల్లే ఇంత గొడవ జరిగింది అంటుంది. దీంతో కూతురు వల్ల కానిది మనవడి వల్ల అవుతుంది. రేవతి అక్క కొడుకును రంగంలోకి దించుదాం ఈసారి గ్యారంటీగా సక్సెస్‌ అవుతాం అంటాడు రాజ్‌. కావ్య కూడా సరే అంటుంది. ప్లాన్‌ ప్రకారం అపర్ణ గుడికి వెళ్లేలా చేస్తుంది కావ్య. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!