Brahmamudi Serial Today Episode: కళ్యాణ్‌ అప్పు మీద తనకున్న అభిమానాన్ని కవిత రూపంలో ఓ పేపరు మీద రాసి తర్వాత దాన్ని విసిరిపడేస్తాడు. ఆ పేపరు తీసుకుని చదివిన రాజ్‌.  అప్పు మీద నీ మనసులో ఇంత ప్రేమను పెట్టుకుని బయటకు లేనట్లు నటిస్తున్నావురా అనుకుని నీ ప్రేమను నేను ఎలాగైనా గెలిపిస్తానని అనుకుని వెళ్లిపోతాడు. మరోవైపు కనకం వాళ్ల అక్క మీనాక్షితో  అప్పుకు పెళ్లి సంబంధం గురించి  ఫోన్‌లో మాట్లాడుతుంది. వాళ్లను ఈరోజు రమ్మని చెప్పు అని ఫోన్‌ కట్‌ చేస్తుంది.  


మూర్తి: ఎవరినే రమ్మని చెప్తున్నావు.


కనకం: మా అక్క మీనాక్షి ఫోన్‌ చేసిందయ్యా తనకు తెలిసిన మంచి సంబంధం ఉందట. అబ్బాయి కానిస్టేబుల్‌ అట. కాకపోతే మధ్యతరగతి కుటుంబం. ఒక్కడే కొడుకట.


మూర్తి: అది సరే ఈ పెళ్లి సంబంధం గురించి అప్పుకు చెప్పావా?


   అనగానే అప్పు మొత్తం వింటుంది. కనకం అప్పు దగ్గరకు వెళ్లి అడుగుతుంది. మూర్తి వచ్చి మనం ఆలోచించడం కాదు. స్వప్న, కావ్యలను కూడా పిలువు అందరం కలిసి మాట్లాడుదాం అంటాడు. కనకం ఓకే అంటుంది. మరోవైపు రాజ్‌ కూర్చుని ఉంటే కావ్య వచ్చి చేసిందంతా చేసి ఏమీ తెలియనట్లు సుద్దపూసలా కూర్చున్నాడు అంటుంది.


కావ్య: ఏవండి ఈ రెండిట్లో ఒక వేలు పట్టుకోండి.


రాజ్‌: ఎందుకు?


కావ్య: మనకు పుట్టబోయేది అమ్మాయా? అబ్బాయా? అని తెలుసుకోవడానికి. అబ్బా ఏం చూపు అది ప్లాన్‌ మీద ప్లాన్‌ వేసి బూత్‌ బంగ్లాలో శోభనం అరెంజ్‌ చేసినప్పుడు ఈ కోపం అంతా ఏమైపోయిందో.


రాజ్: ఆ భూత్‌ బంగ్లాను భూతంలా పట్టుకునే ఉంటావా?


కావ్య: మన శోభనం జరిగిన ప్లేస్‌ కదండి జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. సరే ఒక వేలు పట్టుకోండి.


రాజ్‌: రాత్రి శోభనం జరిగింది. అప్పుడే అమ్మాయో.. అబ్బాయో తెలుసుకుంటావా?


కావ్య: తప్పేముందండి. శోభనం అయ్యాక పుట్టేది బిడ్డలే కదా? బిడ్డలు పుడితే పేర్లు పెట్టాలి కదా? అమ్మాయి పుడితే ఏ పేరు పెట్టాలి. అబ్బాయి పుడితే ఏ పేరు పెట్టాలి. అసలు ఏ హాస్పిటల్‌లో పురుడు పోసుకోవాలి. అన్నప్రాసన కాశీలో చేయాలి. అక్షరాభ్యాసం బాసరలోనే చేయాలి.


రాజ్: అలాగా మరి పెళ్లి ఎక్కడ చేద్దాం.


కావ్య: జైపూర్‌లో కోట ఒకటి బుక్‌ చేసి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేద్దాం.


రాజ్: మరి వాడి శోభనం..


కావ్య: భూత్‌ బంగ్లా ఉందిగా పైగా మనకు అచ్చి వచ్చింది.


అనగానే రాజ్ కోపంగా.. భూత్‌ బంగ్లా గురించి ఎవరికీ చెప్పనని  అందరికీ ఎందుకు చెప్పావని కోప్పడతాడు. ఇంతలో కనకం ఫోన్‌ చేసి అప్పుకు మంచి సంబంధం వచ్చిందని నువ్వు స్వప్న, అల్లుడు గారు రావాలని చెప్తుంది. తర్వాత రాజ్‌ ఏంటని అడగ్గానే అప్పుకు ఇవాళ పెళ్లిచూపులట. నన్ను మిమ్మల్ని రమ్మంటున్నారు మా అమ్మ. అని చెప్పగానే రాజ్ షాక్‌ అవుతాడు. ఈ పెళ్లి చూపులు అడ్డుపెట్టుకుని కళ్యాన్ మనసులో మాట బయటపెట్టించాలి అనుకుంటాడు. మరోవైపు అప్పు బాధగా కూర్చుని ఉంటుంది. ఇంతలో కావ్య, స్వప్న వెళ్తారు. అందరూ హ్యాపీగా ఉంటారు. మరోవైపు రాజ్‌, కళ్యాణ్‌ దగ్గరకు వెళ్లి అప్పుకు పెళ్ళిచూపులట అని చెప్పగానే కళ్యాణ్‌ షాక్ అవుతాడు. లోపల బాధపడుతుంటాడు. మరోవైపు అప్పును పెళ్ళి చూపులకు రెడీ చేస్తారు ఇద్దరు అక్కలు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: మత్తుకళ్లతో మాయ చేస్తున్న 'గుప్పెడంత మనసు' ఫేం జ్యోతిరాయ్‌