Brahmamudi Serial Today Episode: రాజ్, కావ్య శోభనం కోసం అంతా రెడీ చేసిన అపర్ణ, ఇందిరాదేవి ఎదురుచూస్తుంటారు. ఇంత టైం అయినా ఇంకా రాలేదేంటని అపర్ణ కంగారుపడుతుంది. వసుసులో ఉన్నవాళ్లు సరాదాగా గడిపి వస్తారులే అని ఇందిరాదేవి చెప్తుంది. తాను ఇన్ని రోజులు కావ్యను అపార్థం చేసుకున్నానని ఇకపై కావ్య సంతోషమే తన సంతోషమని చెప్తుంది. తర్వాత తెల్లవారుతుంది. బూత్ బంగ్లాలో కావ్య, రాజ్ ల శోభనం అయిపోయి ఉంటుంది. రాజ్ మెల్లగా నిద్ర లేచి కిందకి రాగానే రెస్టారెంట్ మేనేజర్ వస్తాడు.
మేనేజర్: సార్ అరైంజ్‌మెంట్స్ ఎలా ఉన్నాయి సార్.
రాజ్: స్టుపిడ్ ఫెల్లో నేనేం చెప్పాను.. నువ్వేం చేశావు.
మేనేజర్: మీరు చెప్పిందే చేశాను సార్
రాజ్: దూరం నుంచి నైట్ ఎఫెక్ట్ లో దెయ్యంలా వెళ్లమంటే నా పక్కనుంచే వెళ్తావా?
మేనేజర్: సార్ మేడం గారు భయపడ్డారు కదా సార్.
రాజ్: నువ్వు దెయ్యంలా వెళ్లినందుకు భయపడలేదు. నేను అరిచిన అరుపులకు నన్ను చూసి భయపడింది.
అని చెప్పగానే మేనేజర్ సరేలేండి సార్ ఎలాగోలా మీ శోభనం అయిపోయిందిగా మరోసారి శోభనం చేసుకోవాలనుకుంటే ఇక్కడికే రండి సార్ అంటాడు. దీంతో రాజ్ మేనేజర్‌ను తిడతాడు. శోభనం ఒక్కసారే చేసుకుంటారని చెప్తాడు. మేనేజర్‌కు పేమెంట్ ఇచ్చి పంపిస్తాడు. వెనక నుంచి అంతా వింటున్న కావ్యను చూసి రాజ్ షాక్ అవుతాడు.
కావ్య: అబ్బబ్బా ఏం ప్లాన్ చేశారండి మీరు. అంటే ఈ బూత్ బంగ్లాకు నన్ను కావాలనే తీసుకొచ్చారన్నమాట.
రాజ్: అలాంటిదేం లేదు కళావతి. ఏదో అలా జరిగిపోయింది.
కావ్య: నాకు అంతా అర్థం అయ్యింది. ఈ బూత్ బంగ్లాలో భూతంలా తిరిగింది వాడేనన్న మాట. రాత్రి వర్షం కురిపించిన వరుణ దేవుడు వాడేనన్న మాట. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థం అయ్యింది. మీకు కింద నుంచి పై దాకా ఇగో ఉంటుంది.
రాజ్: అయ్యో నాకు ఏం ఇగో లేదు.
కావ్య: నన్ను ప్రేమతో దగ్గరకు తీసుకోలేక ఇన్ని తింగరి వేషాలు వేస్తారా? పెళ్లి అయిన సంవత్సరం తర్వాత మీరు మీ పెళ్లాంతో కాపురం వెలగబెట్టడానికి మీకు ఇంతకన్నా సుందరమైన, రమణీమైన స్థలమే దొరకలేదా?
అనగానే రాజ్, కావ్యకు సారీ చెప్తాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఇంటి దగ్గర అపర్ణ, ఇందిరాదేవి రాజ్, కావ్యలు ఇంకా రాలేదని కంగారుగా ఎదురుచూస్తుంటారు. ఇంతలో రాజ్, కావ్య వస్తారు. రాత్రంతా ఎక్కడికి వెళ్లారని నిలదీస్తారు. రాజ్ కంగారుగా ఏదేదో చెప్తుంటే ఇందిరాదేవి రాజ్‌ను తిడుతుంది. కావ్య నువ్వు నిజం చెప్పు అని అడుగుతుంది. దీంతో కావ్య భూత్ బంగ్లాలో రాత్రి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. దీంత అపర్ణ, ఇందిరాదేవి షాక్ అవుతారు. తర్వాత ఇందిరాదేవి, కావ్య దగ్గరకు వెళ్లి రాజ్ గురించి చెప్తుంది. వాడికి నీ మీద అమితమైన ప్రేమ ఉంటుందని వాడిని తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్తుంది. దీంతో ఆయన మీద ఆయనకంటే నాకే ఎక్కువ నమ్మకం ఉందని కావ్య చెప్తుంది. అయితే త్వరలోనే నాకు ఒక మనవడినో..మనవరాలినో ఇవ్వండి అంటుంది ఇందిరాదేవి. దీంతో కావ్య సిగ్గుతో బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: దర్శకుడితో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ - జైలుకు వెళ్లిన దర్శన్ కలిపిన జంట!