Brahmamudi Serial Today Episode: శీనును పట్టుకోవడానికి రాజ్‌ అద్బుతమైన ప్లాన్‌ చేస్తాడు. అందుకోసం రేవతికి ఫోన్‌ చేసి శీను వాళ్ల అమ్మ దగ్గరే రాత్రికి పడుకోమని చెప్తాడు. రేవతి సరే అంటుంది. వాడు ఏ టైంలో ఫోన్‌ చేసినా లోకేషన్‌ ట్రేస్‌ చేయోచ్చని అనుకుంటాడు. తర్వాతి రోజు అప్పు, కళ్యాణ్‌, కావ్య కోర్టులో కంగారు పడుతూ రాజ్‌ కోసం వెయిట్‌ చేస్తూ ఉంటారు.

కళ్యాణ్: ఏంటి వదిన ఇంత టైం అవుతున్నా అన్నయ్యా ఇంకా రావడం లేదేంటి..?

కావ్య: నేను ఆయన గురించి చూస్తున్నాను కవిగారు

అప్పు: అసలు ఆ శ్రీను గాడి గురించి ఏమైనా ఇన్మఫర్మేషన్‌ తెలిసి ఉంటుందా అక్కా

కావ్య: అదేమీ తెలియదు అప్పు ఫోన్‌ చేస్తే ఆయన ఫోన్‌ స్విచ్చాప్‌ వస్తుంది. ఆయన వస్తే గానీ అసలు ఏం జరిగిందో తెలియదు

అప్పుడే రాజ్‌ వస్తాడు.

కావ్య:  రామ్‌ గారు ఆ శ్రీనుగాడు ఎక్కడున్నాడో తెలిసిందా..?

రాజ్‌: నాకేం తెలియదు కళావతిగారు

కావ్య: ఏంటి రామ్‌ గారు రాత్రి ఏదో ఒకటి చేస్తానని చెప్పి ఇప్పుడు నీకేం తెలియదు అంటున్నారేంటి..? ఇంకాసేపట్లో హియరింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఈ లోపు మనం వాణ్ని పట్టుకుని కోర్టులో అప్పు ఆ తప్పు చేయలేదు అని చెప్పించకపోతే జడ్జి గారు వాళ్లు చెప్పిందే నిజం అని నమ్మి.. అప్పును సస్పెండ్‌ చేసి శిక్ష కూడా వేస్తారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం రామ్‌ గారు

రాజ్‌: మీరేం కంగారు పడకండి కళావతి గారు మీరు భయపడ్డట్టు ఏమీ జరగదు.

కావ్య: అవతల ఒకపక్క కోర్టుకు టైం అవుతుంది. ఇంతవరకు ఆ శ్రీను జాడ తెలియదు ఇలాంటి టైంలో భయపడకపోతే ఎలా అండి

రాజ్‌:  నేను రాత్రే రేవతి అక్కతో మాట్లాడాను కళావతి గారు. వాడికి సంబంధిచిన ఏ ఇన్ఫర్మేషన్‌ దొరికినా నాకు కాల్ చేస్తాను అని చెప్పింది. కానీ ఇంత వరకు కాల్‌  చేయలేదు.. నేను ఆమె కాల్‌ కోసమే ఎదురుచూస్తున్నాను.

కావ్య: మీకు ఆవిడ కాల్‌ చేయకపోతే మీరే ఆవిడకు కాల్‌ చేసి అసలు ఏం జరిగిందో కనుక్కోవచ్చు కదా రామ్‌ గారు త్వరగా కాల్ చేయండి

అని కావ్య చెప్పగానే రాజ్‌ కాల్‌ చేయబోతుంటే.. రేవతి కాల్‌ చేస్తుంది.

రాజ్‌: ఇదిగో అక్కే కాల్‌ చేస్తుంది.. హలో అక్కా…

రేవతి: తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్టే రాత్రి శ్రీను వాళ్ల అమ్మకు కాల్‌ చేశాడు.

రాజ్‌:  చాలా థాంక్స్‌ అక్కా నేను ఇప్పుడే వస్తాను

అని చెప్పి కాల్‌ కట్‌ చేసి కావ్యను అప్పు దగ్గరే ఉండమని చెప్పి రాజ్‌ వెళ్లిపోతాడు. ఇంతలో పోలీసులు వచ్చి అప్పును తీసుకెళ్తారు. అప్పుతో పాటు కళ్యాన్‌ వెళ్తాడు. అక్కడే చాటుగా ఉన్న యామిని, కావ్య దగ్గరకు వస్తుంది.  ఇప్పటికైనా రాజ్‌ను నాకు వదిలేయ్‌ నీ చెల్లిని నేనే నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను అని చెప్తుంది. కావ్య యామినిని తిడుతుంది. యామిని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు శ్రీను వాళ్ల ఇంటికి వెళ్లిన రాజ్‌ శ్రీను కాల్‌ చేసిన నెంబర్‌ తీసుకుని కానిస్టేబుల్‌ శేషుకు ఇచ్చి లొకేషన్‌ ట్రేస్‌ చేయమని చెప్తాడు. శేషు లొకేషన్‌ ట్రేస్‌ చేసి రాజ్‌కు చెప్తాడు. రాజ్‌ అక్కడకు వెళ్తాడు. మరోవైపు కోర్టులో అప్పు కేసు హియరింగ్‌ మొదలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!