Brahmamudi Serial Today Episode:  కావ్య వర్జినల్‌ కిరీటాన్ని దాచి ఉంచి ఇప్పుడే డెలివరీ ఇచ్చిందని.. మీ దగ్గర ఉన్నది డమ్మీ కిరీటం అని సెక్యూరిటీ చెప్పగానే అనామిక, సామంత్‌ షాక్‌ అవుతారు. ఏయ్‌ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ తిడుతుంది. ఇంతలో కావ్య వచ్చి సెక్యూరిటీ చేతిలోని ఫోన్‌ లాక్కుంటుంది. అనామికకు వార్నింగ్‌ ఇస్తుంది. నీలాంటిది ఎప్పుడు ఉంటుందనే నేను నా జాగ్రతలో ఉన్నాను. ఇంకోసారి ఇలాంటి ప్లాన్లు వేస్తే నీకు గుణపాఠం నేర్పాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ సెక్యూరిటీకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లగొడుతుంది. సామంత్‌  అనామికపై ఫైర్‌ అవుతాడు.


సామంత్‌: వాళ్ల కంపెనీని దెబ్బ కొట్టడం మానుకో.. అది నీ కెప్పటికీ సాధ్యం కాదని తెలుసుకో.. ఆ కావ్య తెలివి తేటల ముందు నువ్వు ఎందుకు పనికిరావని ఇప్పటికైనా గుర్తుంచుకో..


అనామిక:  ఏయ్‌ ఏమ్మన్నావ్‌ నువ్వు ఏం మాట్లాడుతున్నావు.


సామంత్‌: నేను కూడా నీ గొంతు పట్టుకోవచ్చు.. చచ్చే దాకా తప్పించుకోలేవు. కావ్య గురించి తక్కువ అంచనా వేసి నేను కూడా నమ్మాను కాబట్టి ఊరికే ఉంటున్నాను.


అని సామంత్‌ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు.  జగదీష్‌, రాజ్‌కు మరోసారి సారీ చెప్పి వెళ్లిపోతాడు. రాజ్‌ ఆనందంతో చాంబర్‌ లోకి వచ్చి కావ్యను ఎత్తుకోబోతే వద్దని ఆపుతుంది కావ్య.


రాజ్: నువ్వు అందరి ముందు నా పరువు కాపాడినందుకు మెచ్చుకోవాలో.. డమ్మీ కిరీటం లాకర్‌ లో  పెట్టినందుకు మెచ్చుకోవాలో అర్థం కావడం లేదు.


కావ్య: అవసరం లేదు కానీ మనం సక్సెస్‌ అయ్యాం..


రాజ్‌: కానీ ఇప్పుడు ఇంకో చిక్కు సమస్య వచ్చింది.  జగదీష్‌ గారు అడ్వాన్స్‌ గా ఎంతో కొంత ఇస్తారనుకుంటే.. కాంట్రాక్ట్ పూర్తి అయ్యాక ఇస్తారట ఇపుడెలా..? కావ్య: ఆయన ఇచ్చిన ఐదు కోట్లతో గోల్డ్‌ మొత్తం కొనేశాం ఇప్పట్లో గోల్డ్‌ కొనే అవసరమే లేదు మనకు.


రాజ్‌: కానీ అకౌంట్‌ లో రూపాయి కూడా లేదు.


కావ్య: అది కూడా ఆలోచిద్దాం ఇక పదండి..


రాజ్‌: ఎక్కడికి…?


కావ్య: బూత్‌ బంగ్లాకు ..


రాజ్‌: ఏయ్‌ కళావతి ఏం మాట్లాడుతున్నావు.


కావ్య: అదే మన ఇంటికి అండి..


అనగానే ఇద్దరూ ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు ఇంట్లో ధాన్యలక్ష్మీ వాళ్ల మేనమా శ్రీనివాస్‌ వస్తాడు. తన దగ్గర గోల్డ్‌ చాలా ఉందని రెండేళ్ల కిందటి ధరకే ఇస్తానని ఆఫర్‌ ఇస్తాడు. అప్పుడే రాజ్‌, కావ్య ఇంటికి వస్తారు. వాళ్లను శ్రీనుకు పరిచయం చేస్తాడు ప్రకాష్‌. శ్రీను ఇస్తున్న గోల్డ్‌ ఆఫర్‌ గురించి చెప్తాడు ప్రకాష్‌.   


 కావ్య: కానీ మామయ్యగారు అంత గోల్డ్ ఇప్పట్లో మనకు అవసరమే రాదు


ప్రకాష్‌: అద కాదు కావ్య మనం ఎప్పటికైనా మళ్లీ గోల్డ్‌ కొనాల్సిందే కదా..?


కావ్య: కానీ చిన్న మామయ్యగారు..


శ్రీను: ఆపండి ఈ ఇంట్లో మీకు ఏపాటి గౌరవం ఉందో కళ్లారా చూస్తున్నాను.. ఇక వెళ్తాను.


అని శ్రీను వెళ్లిపోతాడు. ధాన్యలక్ష్మీ కోపంగా రాజ్‌, కావ్యలను తిడుతుంది.


ధాన్యలక్ష్మీ:  ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా..? మా పుట్టింటి వాళ్ల ముందు నన్ను నా భర్తను పూచికపుల్లతో తీసిపారేస్తారా..?


ప్రకాష్‌: రాజ్‌.. నిన్న కాక మొన్న కంపెనీలో అడుగుపెట్టిన కావ్యకేం తెలుసు ఆఫీసు విషయాలు..


ధాన్యలక్ష్మీ: ఆఫీసు విషయాలు నువ్వు చూసుకోవాలి కానీ మట్టి పిసుక్కునే నీ భార్యకేం తెలుసు


రుద్రాణి: ఇప్పుడు అందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు. ధాన్యలక్ష్మీకి చిన్నన్నయ్యకు ఇంత అవమానం జరుగుతుంటే ఒక్కరూ కూడా ఎందుకు ప్రశ్నించడం లేదు.


ప్రకాష్‌: అసలు నన్ను ఒక మనిషిలా చూస్తే కదా..


అని వెళ్లిపోతాడు. రుద్రాణి హ్యాపీగా ఇక మా చిన్నన్నయ్య ఇక మన సైడే అంటూ రాహుల్‌కు చిన్నగా చెప్తుంది.  తర్వాత ప్రకాష్‌.. తనకు జరిగిన అవమానానికి నిద్ర రావడం లేదని సుభాష్‌ దగ్గరకు వెళ్లి బాధపడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!