Brahmamudi Serial Today Episode:  దుగ్గిరాల కుటుంబ సబ్యులు అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. కావ్య కాఫీ తీసుకురావడానికి కిచెన్‌లోకి వెళ్తుంది. రుద్రాణి అనామికను ఓదారుస్తూ నువ్వేం ఫీల్ కావొద్దని కావ్య వాళ్లు అంటే చిన్నప్పటి నుంచి ఇంటి పనులు చేస్తూ పెరిగారు అంటూ కావ్య ఫ్యామిలీని హీనంగా మాట్లాడుతుంది రుద్రాణి. దీంతో స్వప్న కోపంగా రుద్రాణిని తిడుతుంది. రాజ్‌ కు శ్వేత ఫోన్‌ చేయడంతో రాజ్‌ పైకి వెళ్లిపోతాడు. ఇంతలో కావ్య కాఫీ తీసుకొచ్చి అందరికి ఇస్తుంది. రాజ్‌ ఎక్కడని అడుగుతుంది. పైకి వెళ్లాడని చెప్పడంతో కాఫీ తీసుకుని కావ్య కూడా పైకి వెళ్తుంది. రాజ్‌ శ్వేతతో మాట్లాడుతూ ఉంటాడు.

రాజ్‌: నేను కాల్ చేసే వరకు ఫోన్‌ చేయొద్దని చెప్పాను కదా!

శ్వేత: ఏంటి కావ్య పక్కనే ఉందా?

రాజ్‌: ఇంట్లో అందరూ పక్కనే ఉన్నారు.

శ్వేత: ఇరకాటంలో పడేశానా?

రాజ్‌: కొంచెం అయ్యి ఉంటే ఇరుక్కుపోయేవాణ్ణి. ఇంచు గ్యాప్‌లో తప్పించుకున్నాను.

అనడంతో శ్వేత సారీ చెప్పి మీ తమ్ముడి పెళ్లి తర్వాత విడాకుల గురించి మాట్లాడాలి అన్నావు మర్చిపోయావా అనగానే రాజ్‌ సారీ మర్చిపోయాను లాయర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నావా? అని అడుగుతాడు. తీసుకున్నానని 9 గంటలకు కలవాలని చెప్పాడు అని శ్వేత చెప్పడంతో.. ఇప్పుడే 8 అవుతుంది. అంటూ కంగారుగా రాజ్‌ రెడీ అవుతుంటే కాఫీ తీసుకుని కావ్య వస్తుంది. ఎక్కడకు వెళ్తున్నారు అని అడగ్గానే ఆఫీసులో అర్జెంట్‌ మీటింగ్‌ వెళ్తున్నాను అని రాజ్‌ చెప్పడంతో టిఫిన్‌ ఎక్కడ చేస్తారు అని స్వప్న అడుగుతుంది. బయట తింటానని రాజ్‌ చెప్పడంతో… ఈయన బయట తినడు ఆయనకు బయటి ఫుడ్‌ పడదు నేనే టిఫిన్‌ రెడీ చేసుకుని ఆఫీసుకు తీసుకుపోవాలని రాజ్‌కు షాక్‌ ఇవ్వాలని మనసులో అనుకుంటుంది కావ్య. మరోవైపు అనామికను తనవైపు తిప్పుకోవాలని రుద్రాణి అనుకుంటుంది. గార్డెన్‌లో ఒంటరిగా కూర్చున్న అనామిక దగ్గరకు వెళ్లి లేనిపోని కట్టుకథలు చెప్పి అనామికను రెచ్చగొడుతుంది రుద్రాణి.  మరోవైపు లాయర్‌ను కలవడానికి వెళ్తున్న శ్వేత, రాజ్‌లు ఒక దగ్గర ఆగి ఐస్‌క్రీమ్‌ తింటుంటే ఆటోలో వెళ్తున్న కావ్య వారిద్దరిని చూస్తుంది. వాళ్లిద్దరూ రొమాంటిక్‌గా ఐస్‌క్రీమ్‌ తినడం చూసి షాక్‌ అవుతుంది కావ్య. వెంటనే రాజ్‌కు ఫోన్‌ చేస్తుంది కావ్య.

రాజ్‌: హలో

కావ్య: ఏవండి నేను కళావతిని

రాజ్‌: నువ్వని నాకు తెలీదా? ఏంటో చెప్పు

కావ్య: ఎక్కడున్నారు. మిమ్మల్నే అడిగేది.

రాజ్‌: ఎక్కడుంటాను.

కావ్య: మీటింగ్‌ అన్నారు కదా వెళ్లారా? లేదా అని కాల్‌ చేశాను.

రాజ్‌: వెళ్లకుండా ఎందుకుంటాను..?

అనగానే ఆఫీసులో ఉంటే ఆ ట్రాఫిక్‌ సౌండ్‌ ఎంటి అని అడుగుతుంది కావ్య. దీంతో విండో ఓపెన్‌ చేసి మాట్లాడుతున్నానులే అని రాజ్‌ చెప్పగానే కావ్య ఫోన్‌ పెట్టేసి రాజ్‌ గురించి ఆలోచిస్తూ వెళ్లిపోతుంది. కావ్య వెళ్తున్న ఆటో వెనకాలే రాజ్‌ కారు వెళ్తుంది. ఆటో డ్రైవర్‌ ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడంతో రాజ్‌ వచ్చి ఆటోను ఆపి డ్రైవర్‌కు వార్నింగ్‌ ఇస్తాడు. ఆటోలో కూర్చున్న కావ్య, రాజ్‌ తనను చూడకుండా ముసుగు వేసుకుంటుంది. హాల్లో అందరూ కూర్చుని ఉండగా.. స్వప్న కుర్చీ తీసుకువచ్చి రుద్రాణి నెత్తిన పెడుతుంది.

రుద్రాణి : ఏయ్‌ ఏంటిది?

స్వప్న: ఇది మీ నెత్తిన పెట్టుకోండి. నేను మీ నెత్తి మీద ఎక్కి  కూర్చుంటాను. ఉత్సవ విగ్రహంలా ఊరంతా ఊరేగించి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోండి.

రాహుల్‌: ఏయ్‌ నీకేమైనా మెంటలా?

స్వప్న: ఆ రోగం నీకు మీ అమ్మకే ఉంది.

అనగానే అపర్ణ మెల్లగా ధాన్యలక్ష్మీతో రుద్రాణికి కరెక్ట్‌ మొగుడు నువ్వో ,నేనో కాదు ఈ పిల్లే అని చెప్తుంది.  అందరిని ఉద్దేశించి తప్పు తనదే అని తేలితే నన్ను నెత్తిన పెట్టుకుంటానని ఈవిడ గారు చెప్పారా? లేదా? అంటూ అందరికీ చెప్తుంది స్వప్న.  దీంతో రుద్రాణి కోపంగా లేచి నేనేదో మాట వరసకు అంటే ఇలా చేస్తావా? అంటూ స్వప్నను తిడుతుంది. ఇప్పుడు నీకేం కావాలని బామ్మ అడగ్గానే మా అత్తయ్య నన్ను పట్టించుకోవడం లేదు అంటూ సీరియస్‌ గా చెప్తుంది స్వప్న. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: అమ్మ నన్ను ఆ తెలుగు బూతుతో తిట్టేది - జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్