Brahmamudi Serial Today Episode: మినిస్టర్‌ ధర్మేంద్ర భార్య తులసికి పుట్టిన బిడ్డ కదలడం లేదని ఇంక్యుబేటర్‌లో పెడతారు డాక్టర్లు. తర్వాత ఆపరేషన్‌ థియేటర్‌ లోంచి డాక్టర్‌ చక్రవర్తి డల్లుగా బయటకు వస్తాడు.

Continues below advertisement

ధర్మేంద్ర: చక్రవర్తి ఎవరు పుట్టారు నాకు పాపా..? బాబా..? చెప్పు చక్రవర్తి పలకడం లేదేంటి.? ఎవరు పుట్టారు నాకు.

డాక్టర్‌: ఆడపిల్ల పుట్టింది సార్‌

Continues below advertisement

ధర్మేంద్ర: ఆడపిల్ల అని అంత డల్లుగా చెప్తావేంటయ్యా..పాప అంటే ఇంటికి మహాలక్ష్మీ పుట్టింది.. నాకు కంగ్రాట్స్‌ చెప్పవయ్యా…? చెప్పు

డాక్టర్‌: ఆడపిల్ల పుట్టింది కానీ

ధర్మేంద్ర: ఏంటి చక్రవర్తి ఇలాంటి గుడ్‌ న్యూస్‌ చెప్పే పద్దతి ఇదా..? ఏమైంది నీకు.. నేను వెంటనే పాపను చూడాలి మా ఆవిడతో మాట్లాడాలి పదా

డాక్టర్‌: సార్‌ ఒక్క నిమిషం

ధర్మేంద్ర: ఏంటి చక్రవర్తి ఎందుకు అదోలా ఉన్నావు.. నన్నెందుకు కంగారుపెడుతున్నావు

డాక్టర్‌: సార్‌ నేను చెప్పే విషయం కాస్త జాగ్రత్తగా ధైర్యం తెచ్చుకుని వినండి.. సార్‌.. పాప కండీషన్‌ బాగాలేదు సార్‌. మేడం సమస్య లేకుండా ప్రసవించినా..? పుట్టిన పాపకు మాత్రం ఒక ప్రాబ్లమ్‌ వచ్చింది

ధర్మేంద్ర: చక్రవర్తి ప్రమాదం ఏమీ లేదు కదా..?

డాక్టర్‌: చాలా ప్రమాదం సార్‌.. ఈ కండీషన్‌లో బేబీకి గుండె ఎడమభాగం సరిగ్గా పని చేయదు. దాని వల్ల ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఆపరేషన్‌ చేయాలి

ధర్మేంద్ర: దానికి ఎందుకు చక్రవర్తి అంత ఆలోచిస్తున్నావు.. వెంటనే చేసేయ్‌ ఎవరో స్పెషలిస్టు ఉన్నారని చెప్తున్నావు కదా..?

డాక్టర్‌: సార్‌ ఆ సర్జరీ ఇప్పుడు చేయకూడదు. బేబీ అండర్‌ వెయిట్ ఉంది. ఇంక్యూబేటర్‌లో పెట్టాం తను పూర్తిగా డెవలప్ అయిన తర్వాతే ఆపరేషన్‌ చేయగలం.. అది ఎప్పుడు అనేది స్పష్టంగా చెప్పలేం

ధర్మేంద్ర: ఏం మాట్లాడుతున్నావు చక్రవర్తి బేబీ కడుపులో ఉన్నప్పుడు చాలా హెల్దీగా ఉందని చెప్పావు కదా..?

డాక్టర్‌: అప్పుడు అంత వరకే తెలుస్తుంది. డెలివరీ అయ్యాక పాప చాలా సేపు కదలలేదు.. అప్పుడు టెస్టులు చేస్తే తెలిసింది ప్రాబ్లమ్‌ ఏంటా అనేది..

ధర్మేంద్ర: అంటే ఓ సంవత్సరం పోయాక పాపకు సర్జరీ చేయోచ్చా..?

డాక్టర్‌: చేయోచ్చు కానీ పాప చనిపోయే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది సార్‌. అంటే సర్జరీని తట్టుకునే శక్తి పాపకు ఉండాలి కదా..?

అంటూ డాక్టర్‌ చెప్పగానే ధర్మేంద్ర ఎమోషనల్ అవుతుంటాడు. దూరం నుంచి అంతా రుద్రాణి చూస్తుంది. కట్‌ చేస్తే ఐసీయూలో దుగ్గిరాల ప్యామిలీ మొత్తం కావ్య దగ్గర ఉంటారు. అందరూ హ్యాపీగా ఉంటే కానిస్టేబుల్‌ వచ్చి రాజ్‌ను స్టేషన్‌కు రమ్మని అడుగుతాడు. రాజ్‌ వెళ్లబోతుంటే అప్పు, కళ్యాణ్‌ వస్తారు.

అప్పు: కానిస్టేబుల్స్‌ మా బావ ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు.

కానిస్టేబుల్: మేడం ఇప్పటిదాకా మీ వల్లే ఇతనికి ఈ టైం ఇవ్వాల్సి వచ్చింది. మళ్లీ మీరే అడ్డు పడటం

అప్పు: అడ్డు పడుతుంది నేను కాదు కోర్టు. మా బావ మీద ఆరోపణ చేసిన వాడే కుట్రపూరితంగా రాజ్‌ను ఇరికించాను అని మన ఎస్సై గారి ముందు ఒప్పుకున్నాడు. శాండీ గాడి సాక్ష్యం బట్టే జడ్జి గారిని కలవడం జరిగింది. జడ్జి గారు మా బావను నిర్దోషి అని నమ్మి ఈ అరెస్ట్‌ను ఆపమని ఆర్డర్‌ ఇచ్చారు. మీరే చూశారు కదా..? మన ఎస్సై గారే సాక్షి. కావాలంటే ఫోన్‌ చేసి కనుక్కోండి. ఇక మీరు వెళ్తారా..?

అని చెప్పగానే కానిస్టేబుల్స్‌ వెళ్లిపోతారు. అందరూ అప్పుకు సారీ చెప్తారు. అందరూ హ్యాపీగా ఉంటే రాహుల్‌, రేఖ మాత్రం బాధతో చచ్చిపోతుంటారు. మరోవైపు ధర్మేంద్ర దగ్గరకు వెళ్లిన రుద్రాణి.. ఇంక్యుబేటర్‌లో ఇద్దరు బేబీస్‌ ఉన్నారని అక్కడున్న హెల్దీ బేబీని మీరు మార్చేంయండని చెప్తుంది. అందుకు ధర్మేంద్ర ఒప్పుకోడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!