Brahmamudi Serial Today Episode: దుగ్గిరాల ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉండగా రుద్రాణి, రాహుల్‌ సీమంతానికి అయ్యే ఖర్చు గురించి లెక్కలు వేస్తుంటారు. అసలు సీమంతం అంటే ఇలా కూడా చేయాలా అంటాడు రాజ్‌. ఏవండి ఆవిడ ఇప్పుడు సీమంతం డ్రామా ఎందుకు మొదలుపెట్టిందో నాకు తెలుసండి. అయినా వాళ్ల రాతలేవో వాళ్లు రాసుకొనివ్వండి.. మా అక్క సీమంతం జరుగుతుంది.  కానీ ఇంత రిచ్‌ గా కాదు అంటుంది కావ్య.

రుద్రాణి: ఏంటి మొగుడు పెళ్లాం ఏదో చెవి కొరుక్కుంటున్నారు

కావ్య: కొరుక్కోవడానికి కొబ్బరి చిప్పలేం లేవని.. మీకెందుకండి చాలా ఉత్సాహంగా ఏర్పాట్ల గురించి ఏదో చర్చిస్తున్నారు కదా..? కానియండి

రాహుల్‌:  మమ్మీ కొంప దీసి కావ్య ఏమైనా పిట్టింగ్‌ పెడుతుంది అంటావా…?

రుద్రాణి: అందరి ముందు మాట ఇచ్చింది కదరా..? ఇదిగో కావ్య సీమంతానికి మొత్తం ఖర్చు 20 లక్షలు

ప్రకాష్‌:  సీమంతానికి 20 లక్షలా…?

ధాన్యలక్ష్మీ: మనం అడిగితే రూపాయి ఇవ్వదు కానీ వాళ్లకు 20 లక్షలు ఇస్తుందా..? ఇవ్వని చూస్తా..

కావ్య: అలాగే నేను కూడా కరెక్టుగా 20 లక్షలకే చెక్‌ రాశాను ఇదిగోండి చెక్‌

  కావ్య 20లక్షల చెక్కును రుద్రాణికి ఇస్తుంది. ఇంతలో కనకం అమ్మా స్వప్న అంటూ వస్తుంది.  

అపర్ణ:  మేమే నీకు కబురు చేద్దామనుకున్నాను

కనకం: ఏదైనా విశేషమా వదిన గారు

అపర్ణ: అవును స్వప్న సీమంతం చేయించడానికి రుద్రాణి ఏర్పాట్లు చేస్తుంది.

కనకం:  నో నో నో..  రుద్రాణి సీమంతం చేయించడం ఏంటి నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను

రుద్రాణి: నువ్వు ఒప్పుకోకపోవడం ఏంటి..? నీ పర్మిషన్‌ ఎవరికి కావాలి..?

కనకం: చూడండి మా ఇంటి ఆచారం ప్రకారం మా ఇంటి ఆడబిడ్డకు సీమంతం పుట్టింట్లోనే చేయాలి. అది మా వంశాచారం

రుద్రాణి: మా ఇంట్లో నీ కూతురు సీమంతం ఎలా జరిపిస్తామో తెలుసా…?

రుద్రాణి: అసలు మీకు ఇంత హఠాత్తుగా నా కూతురు మీద ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది. అన్నయ్యా మీరు నమ్ముతున్నారా..?

 అంటూ ఇంట్లో అందరినీ అడుగుతుంది. అందరూ తమకు అర్థం కావడం లేదని చెప్తారు. ఎవరేం చెప్పినా మా ఇంట్లోనే సీమంతం జరిపిస్తానని రుద్రాణి చెప్తుంది. దీంతో కనకం ఎమోషనల్‌ గా ధాన్యలక్ష్మీని అడుగుతుంది. ధాన్యలక్ష్మీ కూడా మీ పుట్టింట్లో జరుపుకోవడమే కరెక్టు అంటుంది. 

ఇందిర:  స్వప్న మీ వంశాచారం ప్రకారం నీ సీమంతం మీ ఇంట్లోనే జరగాలి. నీకు పుట్టబోయే బిడ్డకు మంచి జరగాలి.

స్వప్న: ఇక్కడ ఏదో జరుగుతుంది.. కానీ ఏంటో నాకు అర్థం కావడం లేదు

అపర్ణ:  ఏమీ జరగడం లేదమ్మా.. మీ అమ్మ నీ మంచి కోసమే. నీ బిడ్డ కోసమే ఇంతలా ఆరాటపడుతుంది.

స్వప్న:  ఏం సంప్రదాయమో ఏంటో సరేలే అందరూ ఒప్పుకున్నాక నేను మాత్రం ఏమంటాను.. కనీసం బారసాల అయినా ఇక్కడ జరిపించండి.

అని స్వప్న కాంప్రమైజ్‌ అవుతుంది. దీంతో కనకం సంతోషంగా అందరికీ నా బిడ్డ సీమంతం మా ఇంట్లో జరిపిస్తాను మీరంతా రావాలని అందరికీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత కావ్య, రుద్రాణి దగ్గరకు వెళ్లి ఇక ఈ చెక్‌తో అవసరం లేదనుకుంటా అని చెక్‌ తీసుకుని చింపేస్తుంది. మరోవైపు కళ్యాణ్‌ అప్పుకు ఫోన్‌ చేసి తాను రాసిన పాట వినిపిస్తాడు. ఆ పాట విన్న అప్పు సూపర్‌ గా రాశావని మెచ్చుకుంటుంది. మరోవైపు రుద్రాణి తనకు లైసెన్స్‌ గన్‌ కావాలని ఆ కనకాన్ని షూట్‌ చేసి పారేస్తాను అంటూ ఆవేశంతో ఊగిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!