Brahmamudi Serial Today Episode: ఎవరి జీవితాలను వాళ్లు.. ఎవరి సంతోషాలను వాళ్లు చూసుకోవడంలో తప్పు లేదు అని కావ్య చెప్పగానే ఈ అభ్యుదయ భావాలు ఇంకా నీలోన ఉన్నాయి అంటే చాలా గ్రేట్ బుజ్జి ఇంకా నువ్వు ఇంత విశాలంగా ఆలోచిస్తున్నావు అంటే నీది ఎంత గొప్ప మనసు బుజ్జి అని వాళ్ల బావ పొగడుతూనే అయినా భార్య వద్దనుకున్న మనిషితో కలిసుండాల్సిన కర్మ నీకేంటి అనగానే రాజ్ షాక్ అవుతాడు. చీచీ ఆ ఆమ్మాయికేంటి అని మాట మారుస్తాడు. దీంతో కోపంగా రాజ్ వచ్చిన పని చూసుకుందామా అంటూ కేక్ కట్ చేస్తాడు.
రాజ్: నువ్వేం దిగులు పడకు త్వరలోనే నీ జీవితానికి నేనో చక్కటి దారి చూపించబోతున్నాను.
కావ్య: అవునవును మా ఆయన తలుచుకుంటే ఆ దారిలో చక్కటి సిమెంట్ రోడ్డు వేస్తాడు శ్వేత.
రాజ్: అదేంటి శ్వేత నువ్వు తినిపించవా? మా ఆవిడ ఉందనా? లైట్ తీసుకో తనది చాలా బ్రాడ్ మైండ్ కదా?
కావ్య: నేనేం అనుకోను శ్వేత తినిపించు తినిపించు.
అనగానే శ్వేత కేక్ తీసుకుని రాజ్‌కు తినిపిస్తుంది. తర్వాత కావ్య తనకు రెండు గంటల పర్మిషన్ కావాలని మా బావతో బైటికి వెళ్లాలని రాజ్‌ను అడుగుతుంది. ఆఫీసు టైంలో పర్మిషన్ ఇవ్వనని రాజ్ అనడంతో మీరు ఇచ్చినా ఇవ్వకున్నా నేను వెళ్తాను అనడంతో ఫస్ట్ బెట్టు చేసిన రాజ్ తర్వాత పర్మిషన్ ఇవ్వడంతో కావ్య వాళ్ల బావతో వెళ్తుంది. రాజ్ ఇరిటేట్‌గా ఫీలవుతాడు. మరోవైపు ధాన్యలక్ష్మీ, అనామిక బాధగా ఆలోచిస్తూ కూర్చుని ఉంటే రుద్రాణి వస్తుంది.
రుద్రాణి: ఆధిపత్యపు పోరులో అణగదొక్కబడ్డ అత్తా కోడళ్లు మింగలేక, కక్కలేక, ఏడ్వలేక, ఎదురించలేక, చేయడానికి పనులేవీ లేక, అరవడానికి అవకాశం లేక పాపం మౌనంగా కూర్చున్నారా?
ధాన్యలక్ష్మీ: దెప్పి పొడుస్తున్నావా?
రుద్రాణి: చెప్పి పొడుస్తున్నాను. మీకు జరిగింది మీకే చెప్పి ముల్లుతో పొడుస్తున్నాను. నువ్వెంత ప్రయత్నం చేసినా నీ తోడి కోడలు కంచు కదలదు, బెదరదు, వదలదు.
ధాన్యలక్ష్మీ: ఇప్పుడేం చేయాలో అర్థం కాక మేము బుర్ర చించుకుంటుంటే నువ్వేంటి మధ్యలో
అనగానే ఇప్పుడు మీరేమైనా చేయోచ్చు. ముందు మా అమ్మని వాళ్లకు సపోర్టు రాకుండా వాళ్ల మధ్య తగువు పెట్టు. తర్వాత అపర్ణ, కావ్యకు మధ్య కూడా తగువు పెట్టు అంటూ చెప్తుంటే ఇంతలో స్వప్న వచ్చి రుద్రాణిని తిడుతుంది. నాకు ఆరెంజ్ జ్యూస్ తీసుకురా లేటయితే బాగుండదు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది స్వప్న.
ధాన్యలక్ష్మీ: ముందు నీ కోడలును కంట్రోల్ లో పెట్టడం నేర్చుకో.. తర్వాత మా మధ్య తగువులు పెట్టడం నేర్పుదువు గానీ.
అంటూ చెప్పి అనామికను తీసుకుని లోపలికి వెళ్తుంది ధాన్యలక్ష్మీ. రుద్రాణి ఇరిటేటింగ్‌గా ఓసేయ్ స్వప్న అంటూ తిట్టుకుంటుంది. మరోవైపు కారులో వెళ్తున్న కావ్య వాళ్లు రాజ్ గురించి ఆలోచిస్తారు. మన ప్రయత్నం బెడిసికొట్టకుండా చూసుకోవాలని, జాగ్రత్త పడి డీల్ చేయాలి. మనం డ్రైవర్‌ను తీసుకురాకుండా రావడంతో అక్కడ రాజ్ ఎంతలా ఫీలవుతున్నాడో అని కావ్య వాళ్ల బావ అంటాడు. అటువైపు రాజ్ కూడా నిజంగా ఇరిటేట్ అవుతుంటాడు. ఇప్పుడే ఇంటికి వెళ్లి కావ్య వాళ్ల బావతో తిరుగుతుందని ఇంట్లో వాళ్లకు చెప్పి డైవర్స్ తీసుకుంటానని రాజ్ ఇంటికి వెళ్తాడు. మరోవైపు మూర్తి హ్యాపీగా కనకం దగ్గరకు వచ్చి కావ్య ఆడుతున్న నాటకం సక్సెస్ అవుతుందని చెప్తాడు. కావ్యకు అవసరమైతే నేను కూడా రంగంలోకి దిగుతానని చెప్తాడు. మరోవైపు ఇంటికి వెళ్లిన రాజ్ గార్డెన్‌లో కూర్చున్న నాన్నమ్మ చూసి ఆమె దగ్గరకు వెళ్తాడు.
ఇందిరాదేవి: ఏంటి మనవడా పెనం మీద సగం కాలిన పెసరట్టులా రుసరుసలాడుతున్నావు ఎంటి విషయం.
రాజ్: నీ మనవరాలు పక్కన ఉంటే పెన్నం మీద కాదు నేరుగా స్టౌ మీద కూర్చున్నట్లే ఉంటుంది.
ఇందిరాదేవి: నా మనవరాలికి అన్ని తెలివితేటలు ఉంటే నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్లు ఆడగలవా?
రాజ్: నేనేమాడాను.
అనగానే ఇందిరాదేవి మాట మారుస్తుంది. నువ్వు మీ అమ్మా ఎప్పుడూ నా మనవరాలిని ఎందుకు తిడతారు. అనగానే అది మరీ గడుసుది ఫారిన్ నుంచి తన బావ రాగానే బయటకు వెళ్లి షికార్లు కొడుతుంది అని రాజ్ అనగానే.. అదేం లేదని తన బావను తీసుకుని ఇంటికే వచ్చిందని అందరూ లోపల భోజనం చేస్తున్నారని ఇందిరాదేవి చెప్పగానే రాజ్ షాక్ అవుతూ ఇరిటేటింగ్ లోపలికి వెళ్తాడు. మా ప్లాన్ వర్కవుట్ అవుతుంది అని ఇందిరాదేవి అనుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: ఎల్లో సిల్క్ శారీలో అందంతో కట్టిపడేస్తోన్న లేడీ సూపర్ స్టార్ - అవార్డు వేడుకలో మెరిసిన నయన్