Brahmamudi Serial Today Episode: తనకు తల్లిని కావాలని ఉందని మా అక్కలాగా పాపనో బాబునో ఎత్తుకోవాలని ఉందని.. అందుకోసం మనం వెంటనే బూత్‌ బంగ్లాకు వెళ్దామని అడుగుతుంది కావ్య. నాకు అలాగే ఉందని కానీ అందుకోసం బూత్‌ బంగ్లా దాకా ఎందుకని రాజ్‌, కావ్యను హగ్‌ చేసుకుని ఇప్పుడు చెప్పు నీకెవరు కావాలి అని అడుగుతాడు. నీలాంటి బాబు కావాలని కావ్య చెప్తుంది. అయితే నాకు నీలాంటి పాప కావాలని చెప్తాడు రాజ్‌. మరుసటి ఉదయం కళ్యాణ్‌కు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఫోన్‌ చేస్తాడు.


మ్యూజిక్‌ డైరెక్టర్‌: గుడ్‌ మార్నింగ్‌ కళ్యాణ్‌, అండ్‌ కంగ్రాచ్యులేషన్స్‌


కళ్యాణ్‌: గుడ్‌ మార్నింగ్‌ సార్‌.. కానీ కంగ్రాచ్యులేషన్స్‌  నాకెందుకు చెప్తున్నారు సార్‌


మ్యూజిక్‌ డైరెక్టర్‌: నువ్వు నా సినిమాలో సోలో కార్డుతో సాంగ్స్‌ రాస్తున్నావు అందుకే కంగ్రాచ్యులేషన్స్‌ చెప్తున్నాను


కళ్యాణ్‌:  సార్‌ ఇంకొన్ని రోజులు మా గురువు గారి దగ్గరే వర్క్‌ నేర్చుకుందామనుకుంటన్నాను


మ్యూజిక్‌ డైరెక్టర్‌: ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్‌ అవకాశాలు ఎప్పుడూ రావు. అవకాశం వచ్చి నీ తలుపు తడితే నువ్వు గురువు గారు అంటావేంటి..? నీకు నీ కెరియర్‌ ఇంపార్టెంటా… ఆ గురువు గారు ఇంపార్టెంటా..?


కళ్యాణ్‌ :  గురువు గారికి ఇచ్చిన మాట ఇంపార్టెంట్‌ సార్‌. అవకాశం వచ్చింది కదా అని ఇలా మధ్యలోనే ఆయన్ని వదిలి నేను రాలేను. దానికి నా మనస్సాక్షి ఒప్పుకోదు


మ్యూజిక్‌ డైరెక్టర్‌:  వెరీ గుడ్‌ కానీ మీ గురువు గారే నాకు కాల్ చేసి నీకీ అవకాశం ఇవ్వమని చెప్పారు. ఆయన ఫోన్‌ కట్‌ చేసి నీకు ఫోన్‌ చేశాను. కావాలంటే మీ గురువు గారికి కాల్ చేసి  మళ్లీ నాకు చేయ్‌.


అని చెప్పగానే కళ్యాణ్‌ రైటర్ కు ఫోన్‌ చేస్తాడు. పక్కనే అప్పు కూర్చుని రైటర్‌ను బెదిరిస్తుంది. దీంతో నీకు ఆ అవకాశం నేను ఇవ్వమన్నాను అని చెప్తాడు రైటర్‌. దీంతో కళ్యాణ్‌ హ్యాపీగా ఫీలవుతాడు. అందరూ హాల్లో కూర్చుని ఉండగా కళ్యాణ్‌ డల్లుగా కిందకు వస్తుంటాడు.


ప్రకాష్‌: ఏమైంది రా కళ్యాణ్‌ ఎందుకు అలా ఉన్నావు..


కళ్యాణ్‌: ఒక గుడ్‌ న్యూస్‌ నాన్నా..


సుభాష్‌: ఓరేయ్‌ రాజ్‌ వాణ్ని ఒకసారి గిల్లరా.. గుడ్‌ న్యూస్‌ అంటాడు డల్లుగా ఉన్నాడు.


రాజ్‌: ఏంట్రా కళ్యాణ్‌ ఏమైంది. ఎందుకు డల్లుగా ఉన్నావు. డాడ్‌ చెప్పినట్టు గిల్లమంటావా..?


కళ్యాణ్‌: నాకు సినిమాలో పాటలు రాసే చాన్స్ వచ్చిందోచ్‌..


అంటూ హ్యాపీగా గట్టిగా అరుస్తాడు. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. అందరూ కంగ్రాట్స్‌ చెప్తుంటారు.


ఇందిరాదేవి: ధాన్యలక్ష్మీ నీ కొడుకు తనను తాను ఫ్రూవ్‌ చేసుకున్నాడు చూడు


కావ్య: ఆగండి ఆగండి ఉత్తి కంగ్రాట్స్ కాదు స్వీట్లు తీసుకొస్తాను.


స్వీట్లు తీసుకొచ్చి అందరికీ ఇస్తుంది. ఇంతలో స్వప్న ఉత్తి స్వీట్లేనా..కళ్యాణ్‌.. పార్టీ లేదా పుష్పా అంటుంది. దీంతో రాజ్‌ ఎందుకు లేదు రాత్రికి గ్రాండ్‌ పార్టీ చేద్దాం అని చెప్తాడు.   రాత్రికి రాజ్‌, కావ్య కలిసి పెద్ద కేక్‌ తీసుకొచ్చి అందరినీ పిలిచి అప్పు, కళ్యాణ్‌ చేత కేక్‌ కట్ చేయిస్తారు. తర్వాత అందరూ కలిసి పాటలు పెట్టుకుని డాన్స్‌ చేస్తుంటారు. ఇంతలో రాజ్‌కు ఫ్యాక్టరీ నుంచి సెక్యూరిటీ ఫోన్‌ చేసి ఎవరో తనను కొట్టి పెట్రోల్‌ తీసుకుని లోపలికి వెళ్లాడు సార్‌ ఫ్యాక్టరీని మొత్తం కాల్చేస్తాడట అని చెప్పగానే రాజ్ కంగారుగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాజ్‌ను గమనించిన కావ్య బయటకు వచ్చి రాజ్‌ను పిలుస్తుంది. రాజ్‌ వినకుండా వెళ్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!