Brahmamudi Serial Today Episode: కావ్య ఏడుస్తూ రాజ్‌ జీవితంలోంచి తప్పుకుంటానంటుంది. దీంతో ఇంట్లో వాళ్లందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇందిరాదేవి వస్తుంది. నువ్వు తప్పుకుంటాననడంలోనే తప్పు ఉందని నువ్వెందుకు అలాంటి తప్పు చేస్తావని అడుగుతుంది. ఇందిరాదేవిని చూసిన కావ్య షాక్‌ అవుతుంది. లేచి బామ్మగారు అంటూ దగ్గరకు వెళ్తుంది.


ఇందిరాదేవి: నువ్వు నీ స్నేహితురాలి కథ అంటూ నీ కథే చెప్తున్నావని నాకప్పుడే అర్థం అయ్యింది. అందుకే నేను తొందరపడకుండా నీ సమస్యకు ఒక పరిష్కారం సూచించాను. నీకు పరిష్కారం దొరకలేదని సమస్యని మరింత పెద్దది చేసుకోవాలనుకుంటున్నావు. అది నేనెప్పటికీ సమర్థించను కావ్య. ఎంత మంది దంపతులు సుఖంగా ఉన్నారు. ఎంత మంది సంతోషంగా ఉన్నారు. ఇంటింటి కిటికీ తెరచి చూస్తే లోపల కలిసి ఉండేవాళ్లు కొందరు సర్దుకుపోయేవాళ్లు కొందరు, పోట్లాడుకునే వాళ్లు కొందరు. కానీ వాళ్లంతా తప్పుకోవాలని అనుకోవడం లేదు కదా అన్ని కుటుంబాలు అలాగే ఉంటాయని నేను చెప్పడం లేదు. అభిప్రాయ బేధాలున్నా భార్యాభర్తల గురించే మాట్లాడుతున్నాను.


కావ్య: మీకు తెలియదు అమ్మమ్మగారు. ఆయనకు నేను అక్కర్లేదు.


ఇందిరాదేవి: అక్కర్లేదు అనుకున్నవాడు ఇంతకాలం ఎందుకు ఆగుతాడు.


కావ్య: ఇంట్లోని పరిస్థితులు ఆయన్ని ఆపుతున్నాయి తప్పా ఆయన నాతో కలిపి ఉంటానని ఏనాడు అనలేదు. అనుకోలేదు.


ఇందిరాదేవి: కలిసే ఉంటున్నాడు కదా


కావ్య: ఇది కూడా కలిసి ఉండటమేనని మీరనుకుంటున్నారా?


ఇందిరాదేవి: ఇలా కూడా కలిసి ఉండే భార్యాభర్తలు చాలా మందే ఉన్నారని అంటున్నాను. అలాగని నీ మనసు చంపుకుని నీ ఉనికిని నీ వ్యక్తిత్వాన్ని, నీ అస్థిత్వాన్ని వదులుకుని బానిసలా పడుండమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఒక మాట అడుగుతాను చెప్పు వాడి మనసులో నువ్వు లేవని ఎందుకు అనుకుంటున్నావు?  


కావ్య: ఉన్నానని ఎలా అనుకోవాలి అమ్మమ్మ.. నన్ను వదిలించుకోవాడానికి వేరే దారి లేక ఇంకో అమ్మాయిని అడ్డుపెట్టుకుంటున్నారు.


ఇందిరాదేవి: కానీ ఆ అమ్మాయితో వాడు ఎలాంటి తప్పుడు సంబంధం పెట్టుకోలేదు కదా? అవకాశం ఉన్నా పరాయి స్త్రీని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాడని నీకు అర్థం అయ్యింది కదా? అది వాడి వ్యక్తిత్వం.


కావ్య: మీరు చెప్పేవన్నీ నిజమే అమ్మమ్మగారు కానీ నేను ఎందుకు వద్దు? ఏం తప్పు చేశాను. నాకు అందం లేదా? చదువు లేదా? ఎవరితో ఎలా నడుచుకోవాలో వివేకం లేదా? గదిలో అంత బాధ అనుభవిస్తున్న బయటికి వస్తే ఎవ్వరికీ చెప్పుకోలేనంత విజ్ఞత లేదా?


ఇందిరాదేవి: ఇందులో నీ తప్పేం లేదు.


కావ్య: అందుకే నేను తప్పుకోవాలనుకుంటున్నాను. అప్పుడైనా ఆయన ప్రశాంతంగా ఉంటాడేమో?


ఇందిరాదేవి: ఉండలేడు. నిన్ను శాశ్వతంగా దుఃఖంలో ముంచేసి అక్కడ వాడు సుఖంగా ఎలా ఉంటాడనుకున్నావమ్మా? పిచ్చివాడైపోతాడు నువ్వు లేకపోతే.. వాడది గుర్తించడం లేదు అంతే


మూర్తి: మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటో మీరే చెప్పండి అమ్మా.. అటు దేవుణ్ని తప్పు పట్టలేక.. ఇటు కన్న మమకారం వదులుకోలేక మా పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.


ఇందిరాదేవి: సహనం వహించాలి. వాడి మనసులో తొక్కి పెట్టిన ప్రేమను బయటకు తీసుకొచ్చేంత వరకు  ఓపిక అవసరం.


కావ్య: మీలాంటి వారి సిఫార్సులతో మనసులో ప్రేమ బయటకు వస్తుందా? అసలు ఆయనకు నామీద ప్రేమ లేదు కదా?


ఇందిరాదేవి: నీ మీద వాడికి ప్రేమ ఉందమ్మా.. కానీ అది ఒప్పుకోవడానికి ఇంగ్లీష్‌లో ఏదో అంటారే ఈగో అడ్డోస్తుంది.


అంటూ కావ్యను ఇందిరాదేవి కన్వీన్స్‌ చేస్తుంది. వాడొక అమ్మాయిని అడ్డం పెట్టుకుని నిన్ను వదులుకోవాలనుకున్నట్లే నువ్వు ఒక అబ్బాయిని అడ్డం పెట్టుకుని దూరం అయిపోతున్నట్లు నటించాలి అని ఇందిరాదేవి సలహా ఇస్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు.  నీ వెనుక నేనుంటాను కాబట్టి నీ శీలం మీద మచ్చ పడనివ్వను అంటుంది. దీంతో మూర్తి కూడా ఈ ప్రయత్నాన్ని ఒప్పుకోమని కావ్యకు సలహా ఇస్తాడు. దీంతో కావ్య సరే అంటుంది. అయితే మూర్తి తన అక్క కొడుకు వస్తున్నాడని వాడినే సాయం అడుగుతే చేస్తాడని చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. దుగ్గిరాల ఇంట్లో అందరూ ఫీలవుతుంటారు. ఇంతలో ఇందిరాదేవి, కావ్య ఇంటికి వస్తారు. ధాన్యలక్ష్మీ, రుద్రాణి ఒక్కసారిగా కావ్యపై తిట్లపురాణం మొదలుపెడతారు. దీంతో ఇందిరాదేవి వాళ్లను తిడుతుంది. అయితే రెండు లక్షలు పోయిన విషయం చెప్తుంది ధాన్యలక్ష్మీ. దీంతో షాక్‌ అయిన ఇందిరాదేవి డబ్బుల గురించి అపర్ణను అడుగుతుంది. దీంతో అపర్ణ సీరియస్‌గా పూచిక పుల్లకు కొరగాని వాళ్లకు ఇలా మాట్లాడే అవకాశం ఇవ్వడం కరెక్ట్‌ కాదని చెప్పడంతో ఇంతలో స్వప్న బయటి నుంచి వస్తూ గట్టిగా ఆపండి అంటూ అరుస్తుంది. లోపలికి వచ్చి  రుద్రాణి, ధాన్యలక్ష్మీలను తిట్టి అపర్ణ దగ్గరకు వెళ్లి సారీ చెప్పి.. ఇంత పెద్ద నింద పడటంతో కావ్య షాక్‌ అయినట్లుందని ఆ రెండు లక్షలు కావ్య నాకు ఇచ్చిందని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read:  ప్రస్తుతం హీరో తరుణ్‌ ఎక్కడున్నాడు? - ఏం చేస్తున్నాడో తెలుసా?