Brahmamudi Serial Today Episode: అప్పు ఇన్వెస్టిగేషన్‌ లో పోలీసుల సహకారం అడుగుతుంది. హాస్పిటల్‌ లో పాప మీద అటాక్‌ చేసిన రౌడీలను పట్టించాలని కోరుతుంది. అందుకోసం కళ్యాణ్‌ను హెల్ప్‌ అడుగుతుంది. అయితే ఇందులో నిజం తెలిసే వరకు ఇంట్లో వాళ్లకు చెప్పొద్దని అంటాడు కళ్యాణ్‌. తర్వాత రుద్రాణి, రాహుల్‌ , రేఖ సీక్రెట్‌ గా కలుసుకుని మాట్లాడుతుంటారు.

Continues below advertisement

రాహుల్‌: మమ్మీ నిన్ను ఆ ఇంట్లో నుంచి తరిమేశాక.. నువ్వు చేసిన ఏ ఒక్క ప్లాన్ సక్సెస్ చేయలేకపోయావు

రేఖ: కావ్యని లేకుండా చేస్తానని అన్నావు.. అది బతికి మా బతుకుల్ని శాసిస్తోంది.

Continues below advertisement

రుద్రాణి: నేను అన్ని కరెక్ట్‌గానే ప్లాన్ చేశాను.. కానీ టైం బాగాలేదు. ఇలా బెడిసికొడుతుందని అసలు ఊహించలేదు..

రేఖ: నువ్వు ఇంకా ఇక్కడ ఊహల్లోనే ఉండు అక్కడ వాళ్లు ఆస్తుల వాటాల పంచుకుంటున్నారు

రాహుల్‌: ఉన్న ఆస్తిలో సగం వాళ్లు పంచుకుని, మిగతా ఆస్తితో ట్రస్ట్ పెట్టాలని అనుకుంటున్నారు.

రేఖ: పేదలకు సాయం చేస్తారట, రేపు రాబోయే తరాలు దుగ్గిరాల ఫ్యామిలీ గురించి చెప్పుకోవాలట

రాహుల్‌: కావ్య ఐడియా చెప్పడంతో అంతా ఒప్పుకున్నారు.. కానీ ధాన్యలక్ష్మీ అత్తయ్య మాత్రం ఒప్పుకోలేదు. కళ్యాణ్ కు అన్యాయం జరుగుతుందని గొడవ చేస్తుంది

రేఖ: ఆవిడ అంటే కావ్య, రాజ్‌ ఆగే రకమా..?

రాహుల్‌: అదే జరిగితే మన చేతికి చిప్పే గతవుతుంది.. అసలే నా బిజినెస్‌ కూడా లాస్‌లో ఉంది. ఇక మన ముగ్గురికి గుడి మెట్లే దిక్కు

రుద్రాణి: నేను బ్రతికుండగా అలా జరగనిస్తానా?

రేఖ:  వాళ్లకు ఒక్కసారి ఆలోచన వచ్చిందంటే దానిని ఇంప్లిమెంట్ చేసేవరకు వదిలిపెట్టరు

రుద్రాణి: ఈ పరిస్థితుల్లో నేను ఆ ఇంట్లోనే ఉండి ఉంటే ట్రస్ట్ ఆలోచనని తుంచేసే దానిని.. నిజం బయటకు రాకుండా ఆ మినిస్టర్ నోరు మూయించగలిగాను కానీ, ఆ ఇంట్లోకి నేను అడుగుపెట్టే మార్గం తెలియడం లేదు

అంటుంటే అప్పుడే రౌడీలు రుద్రాణికి ఫోన్‌ చేసి పోలీసులు, అప్పు ఎంక్వైరీ చేస్తున్న విషయం చెప్తారు. ఎట్టి పరిస్తితుల్లో మీరు దొరకొద్దని.. వెంటనే అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లిపోమ్మని చెప్తుంది. ఒకవేళ పోలీసులకు దొరికినా తన పేరు మాత్రం చెప్పొద్దంటూ వార్నింగ్‌ ఇస్తుంది.

రాహుల్‌: దానికి ఏమాత్రం అనుమానం వచ్చినా నీ దాకా వచ్చేస్తుంది.

రుద్రాణి: అది నా గురించి ఆలోచించే లోగా.. నేనే దాని మీద అటాక్ చేయిస్తా. దాన్ని వాడుకుని అప్పూని కిడ్నాప్ చేయించింది రాజ్‌ అని  ధాన్యలక్ష్మీని నమ్మిస్తా. ఆస్తి కోసమే రాజ్, కావ్యలు అప్పూని కిడ్నాప్ చేశారని.. అప్పూని కిడ్నాప్ చేసి ధాన్యలక్ష్మీకి వారసత్వం లేకుండా చేశారని రెచ్చగొడతా. అప్పుడు ధాన్యం చేసే గొడవకి దుగ్గిరాల కుటుంబం జుట్టు పీక్కుంటుంది.

అని రుద్రాణి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు పోలీసులు అప్పుకు ఫోన్‌ చేసి పాప మీద అటాక్‌ చేసిన రౌడీలను పట్టుకున్నామని ఎంత కొట్టినా మినిస్టర్‌ పేరే చెప్తున్నారనడంతో అప్పు, కళ్యాణ్‌ ను ఒప్పించి రౌడీల దగ్గరకు వెళ్తారు. అంతా గమనించిన రేఖ, రుద్రాణికి ఫోన్‌ చేసి చెప్తుంది. వెంటనే రుద్రాణి రౌడీలకు ఫోన్‌ చేసి అప్పు, కళ్యాణ్‌ లను కిడ్నాప్‌ చేయమని చెప్తుంది. తర్వాత రాజ్‌, కావ్యలు ఆస్థిలో కళ్యాణ్‌ పేరు మీద సగం రాశామని పేపర్స్‌ ధాన్యలక్ష్మీ చేతిలో పెడతారు. దీంతో ఇంట్లో గొడవ జరుగుతుంది. అందరూ ధాన్యలక్ష్మీని తిడతారు. ఎవ్వరూ కూడా ధాన్యలక్ష్మీని తిట్టోద్దని కావ్య చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!