Jagadhatri Serial Today Episode : కౌషికి దగ్గర ఉన్న పెన్‌డ్రైవ్‌ ఎలాగైనా కొట్టేసి మీనన్‌కు ఇవ్వాలని యువరాజు, నిషిక, వైజయంతి, కమలాకర్‌ అనుకుంటారు. దానికి కమలాకర్ ఓ ప్లాన్‌ రెడీ చేసి చెబుతాడు. నిషిక కూడా ఇది చాలా బాగుందని అంటుంది. అయితే అందరం డిన్నర్‌ చేసేప్పుడు దీన్ని అమలు చేద్దామని చెబుతాడు కమలాకర్‌. అందరూ కలిసి డిన్నర్ చేయడానికి కిందకు వస్తారు. అప్పుడు వైజయంతి, నిషిక ఇద్దరూ కలిసి జగధాత్రి, కేదార్‌కు ఎప్పుడూలేని మర్యాద ఇస్తూ భోజనానికి రమ్మని పిలుస్తారు. జగధాత్రి కిచెన్‌లోకి వెళ్లి భోజనం తీసుకొస్తానని చెప్పినా....మేం వడ్డిస్తాం మీరు వెళ్లి కూర్చుని తినండని చెప్పి వాళ్లను డైనింగ్ టేబుల్ వద్దకు పంపిస్తారు. ఎప్పుడూ లేనిది వీళ్లేంటి ఇలా ప్రవర్తిస్తున్నారని కేదార్ అంటాడు. దీనివెనక ఏదో కుట్ర ఉండి ఉంటుందని ధాత్రి అంటుంది. సరిగ్గా అప్పుడే అందరూ కూర్చుని అన్నం తినడానికి రెడీ అవుతారు. నిషిక మాత్రం తనకు వాళ్ల అమ్మ ఫోన్ చేసిందని అబద్ధం చెబుతూ...మాట్లాడుతున్నట్లు నటిస్తూ పక్కకు వెళ్తుంది. సరిగ్గా కౌషికి వాళ్ల బెడ్‌రూం వద్ద నిల్చుని ఫోన్ మాట్లాడుతుంది. వెంటనే ధాత్రికి అర్థమైపోతుంంది. వీళ్లు పెన్‌డ్రైవ్‌ కొట్టేయడానికి ప్లాన్ వేస్తున్నారని కేదార్‌కు చెబుతుంది. వాళ్లిద్దరూ నిషి ఏం చేస్తుందని చూస్తుంటారు. వాళ్లు అలా చూస్తుండటంతో ఆమెకు కౌషికి గదిలోకి వెళ్లడం కుదరదు. వెంటనేవాళ్ల అత్తకు సైగ చేయగానే....ఆమె కేదార్‌, జగధాత్రికి సాంబార్ పోస్తున్నట్లు నటించి వారి  దృష్టి మరల్చుతుంది. అంతే నిషిక వెంటనే కౌషికి రూమ్‌లోకి వెళ్తుంది. లోపలికి వెళ్లి పెన్‌డ్రైవ్ కోసం వెతుకుతూ ఉంటుంది.ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుండగా....ధాత్రి వెంటనే వదిన మీ ఫోన్ మోగుతోందని చెబుతుంది. అయ్యే రూమ్‌లో ఛార్జింగ్ పెట్టాను తీసుకొస్తానంటూ కౌషికి లేస్తుంది.అంతే యువరాజు, వైజయంతి ఫీజ్‌లు ఆరిపోతాయి. లోపల ఇప్పుడు నిషికను చూసిందంటే  మూడో ప్రపంచ యుద్ధం ఖాయమని వైజయంతి అనుకుంటుంది.అయితే కౌషికి రాక గుర్తించి నిషిక తెలివిగా  వెళ్లి మంచం చాటున దాక్కుంటుంది.లోపలికివచ్చిన కౌషికి డ్రాయర్‌ తెరిచి ఉండటం చూసి పెన్‌డ్రైవ్‌ బయట ఉంటే ప్రమాదమని గ్రహించి లాకర్‌లో పెట్టి తాళం వేసి వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ధాత్రి కౌషికిని పెన్‌డ్రైవ్‌ గురించి అడుగుతుంది.ఇప్పుడే  లాకర్‌లో పెట్టి తాళం వేశానని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటుంది. నిషిక బతుకు జీవుడా అనుకుంటూ కౌషికి రూమ్ నుంచి బయటకు వస్తుంది.                 భోజనాలు ముగిసిన తర్వాత ఎవరిరూమ్‌కు వాళ్లు వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంటారు. ఒక ప్లాన్ బెడిసి కొట్టడంతో కమలాకర్‌ రెండో ప్లాన్ అమలుచేయాలని చూస్తాడు. కేదార్‌ను తనకు తోడుగా తన రూమ్‌లో పడుకోమని చెబుతాడు. దీనికి  అతను సరేనని చెప్పి కమలాకర్‌ను తన రూమ్‌కు తీసుకెళ్తాడు కేదార్‌. జగధాత్రికి విషయం అర్థమవుతుంది.కేదార్‌ లేకుండా చూసి నన్ను ఒంటరిదాన్ని చేసి పెన్‌డ్రైవ్ కొట్టేయాలని చూస్తున్నారని తెలుసుకుంటుంది. నిషిక,వైజయంతి మాత్రం ఈ పెన్‌డ్రైవ్‌ ఎలా కొట్టేయాలని ఆలోచిస్తుంటారు. కౌషికి చిన్నసౌండ్‌  వచ్చిన వెంటనే మెలుకువతో లేచిపోతుందని ఆమె రూమ్‌లోకి వెళ్లి ఆ పెన్‌డ్రైవ్‌ ఎలా తీసుకురావాలని మదనపడుుతుంటారు.అప్పుడే అక్కడికి వచ్చిన యువరాజు.....అక్క, బావ తాగే పాలల్లో నిద్రమాత్రలు కలిపానని రేపొద్దున వరకు  ఏం జరిగినా వాళ్లు నిద్రలేవరని చెప్పడంతో వాళ్ల సంతోషానికి అవధులే ఉండవు. ఇక వాళ్లిద్దరూ పడుకోగానే మనం జగధాత్రి రూమ్‌ లాక్‌ చేసి ఆమె బయటకురాకుండా చేయాలని అనుకుంటారు. ఆ తర్వాత మనం కౌషికి రూమ్‌కు వెళ్లి ఏం చేసినా ఎవరూ అడ్డుకునే వారు ఉండరని భావిస్తారు.