Brahmamudi Serial Today Episode: రుద్రాణి, దాన్యలక్ష్మీ.. రాజ్‌, కావ్యలను తిడుతూ.. మీరేమైనా చేసుకోండి ఆస్థిలో మా వాటా మాకు ఇవ్వండి అని అడుగుతారు. దీంతో  అందరూ గొడవ పడుతుంటారు. ఇంతలో ఆపండి అంటూ సీతారామయ్య, ఇందిరాదేవి వస్తారు. సీతారామయ్యను చూసి అందరూ షాక్‌ అవుతారు.


సీతారామయ్య: ఇంతకాలం ఇది నా కుటుంబం అనుకున్నాను. మీ అందరి భవిష్యత్తు కోసం ఎంతో సంపాదించాను. కానీ ఈరోజు నా మాటను కూడా పక్కన పెట్టి మీ స్వార్థం కోసం నా పరువు, మర్యాదలు తీయాలనుకున్నారు. నేను పోయే వరకు మీరంతా నాకు తోడుగా ఉంటారనుకుంటే వాటాలు పంచుకుని ఈ లోపే పోవాలనుకుంటున్నారు. నా పరువు మర్యాదలే మీకు అక్కరలేనప్పుడు మీరు నాకు అక్కర్లేదు. రాజ్‌ బ్యాంకు వాళ్లకు ఎంత అప్పు ఉందో అంతా మన ఆస్తులు జప్తు చేయించి కట్టేసెయ్‌.. ఎవ్వరు ఏమై పోయినా నాకు అనవసరం.


ధాన్యలక్ష్మీ: అదేంటి మామయ్యగారు మీ వారసులు ఏమై పోయినా పర్వాలేదా..?


ఇందిరాదేవి: చాల్లే నోరు మూయ్‌.. మీ మామయ్య పరువు మర్యాదలు అక్కర్లేనప్పుడు మీరు మా వారసులు ఎలా అవుతారు. ఈయన మాటలకు ఎదురు చెప్పే అర్హత ఇక్కడ ఎవ్వరికీ లేదు. రాజ్‌ తాతయ్య చెప్పినట్టు చేయ్‌


బ్యాంకు ఆఫీసరు: ప్రాపర్టీ తాలుకూ డాక్యుమెంట్స్‌ అన్ని మాకు హ్యాండోవర్‌ చేయ్‌ రాజ్‌


రాజ్: అవన్నీ బ్యాంకు లాకర్‌లో ఉన్నాయి రేపే హ్యండోవర్‌ చేస్తాను.


అని రాజ్‌  చెప్పగానే బ్యాంకు ఆఫీసర్స్‌ వెళ్లిపోతారు. తర్వాత రుద్రాణి, రాహుల్‌ బాధపడుతుంటారు. ఆస్థి చేతికి వచ్చే టైంలో ముసలోడు అడ్డు పడ్డాడు అనుకుంటారు.


రుద్రాణి: అదేదో సినిమాలో చెప్పినట్టు ముసలోడే కానీ మహానుబావుడు.


రాహుల్‌: అవును మన పాలిట యముడిలా తయారయ్యాడు


రుద్రాణి: అక్కడి నుంచి అటే పోతాడనుకుంటే మళ్లీ దాపురించాడు. అసలు ఏం జరగుతుంది ఇంట్లో


రాహుల్‌: రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపడానికి సైంటిస్టులు కూడా నీ అంత ఆలోచించరేమో మమ్మీ నువ్వు అంతకన్న ఎక్కువే ఆలోచించావు ఈ ఆస్తి కోసం


రుద్రాణి: ఈ మధ్య పాతికేళ్లకే హార్ట్‌ ఎటాక్‌ వచ్చి పోతున్నారు కదరా..? అలాంటిది సెంచరీకి చేరువలో ఉన్నాడు కదా ఈయన ఎలా బతికి వచ్చాడు.


రాహుల్‌: భూమ్మీద నూకలు ఉంటే సెంచరీ దాటిని మళ్లీ వస్తారు మమ్మీ.. ఇప్పుడు తాతయ్య గురించి అనుకుని ప్రయోజనం ఏముంటుంది మమ్మీ ముందు మన పరిస్థితి ఏంటో ఆలోచించు


రుద్రాణి: నేను అదే ఆలోచిస్తున్నానురా..? ఉన్నదంతా ఊడ్చి పెడుతున్నారు.. మనకు మిగిలేది ఏంటో


 స్వప్న ఒక బొచ్చ తీసుకుని వచ్చి రుద్రాణి మీద పడేస్తుంది.


స్వప్న: మీకు మిగిలేది ఇదే.. మీరు చేసిన దానికి మిగిలేది ఈ బొచ్చ మాత్రమే


రుద్రాణి: అంత కర్మ మాకు పట్టలేదు


స్వప్న: ఇప్పుడు అలాగే అంటారు కానీ.. రేపు ఈ ఇంటితో సహా ఆస్థి పోయాక ఇద్దరు కలిసి రోడ్డున పడతారు. బతకడానికి రోడ్డు సైడు కూర్చుని చిరిగిపోయిన బట్టలతో ఈ బొచ్చతో అడుక్కుంటుంటే చూడ్డానికి విజువల్‌ ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో అత్తా


అని స్వప్న చెప్పగానే రుద్రాణి, రాహుల్‌ చిరిగిన బట్టలతో తాము అడుక్కుంటన్నట్టు ఊహించుకుని చీచీ అనుకుంటారు. మరోవైపు ప్రకాష్‌ బాధపడుతుంటే.. అపర్ణ, సుభాష్‌, ఇందిరాదేవి ఓదారుస్తారు. తర్వాత సీతారామయ్య ఇంటిని చూసుకుని బాధపడుతుంటే ఇందిరాదేవి వెళ్లి ఓదారుస్తుంది. తర్వాతి రోజు రాజ్‌ బ్యాంకు వెళ్లి ఇంటి డ్యాంకు మెంట్స్‌ తీసుకురావడానికి వెళ్తాడు. మరోవైపు కళ్యాణ్‌ పోలీస్‌ స్టేషన్‌కు అప్పు లంచ్‌ తీసుకెళ్తాడు. అక్కడి లేడీ కానిస్టేబుల్‌ కళ్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!