Brahmamudi Serial Today Episode:  ఆస్థులు పంచమన్న ధాన్యలక్ష్మీ, రుద్రాణిలను ఇందిరాదేవి తిడుతుంది. అసలు ఆస్తులు పంచమనడానికి మీరెవరు అంటూ ప్రశ్నిస్తుంది. ఎలాంటి కుటుంబంలో ఎలాంటి వాళ్లు తయారయ్యారు. ఇంటి పెద్దకు ఆపదొస్తే ఎలా బతికించుకోవాలా అని ఆరాటపడతారు.  ఉమ్మడి కుటుంబంలో ఉండాల్ని వారేనా మీరు...? ఇవాళ నాకు ఇంత కష్టం వస్తే ఓదార్చడం పోయి కనీసం భోజనం కూడా చేయకుండా చేస్తున్నారా..? అంటూ తినకుండా వెళ్లిపోతుంది ఇందిరాదేవి. తర్వాత కావ్య భోజనం రెడీ చేస్తుంది. అపర్ణ వస్తుంది.


అపర్ణ: ఈ భోజనం ఎవరి కోసం కావ్య


కావ్య: అమ్మమ్మగారికి గారికి అత్తయ్య.. ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఇప్పుడు కూడా తినకుండా టాబ్లెట్స్ వేసుకోకుండా ఉంటే అమ్మమ్మ కు బీపీ డౌన్‌ అవుతుంది.


అపర్ణ: సరే అయితే పద నేను వస్తాను.


 ఇద్దరూ కలిసి ఇందిరాదేవి రూంలోకి వెళ్తారు. అక్కడ ఇందిరాదేవి కనిపించదు. అమ్మమ్మగారు ఎక్కడికి వెళ్లారో నాకు అర్థం అయింది అత్తయ్య అంటుంది కావ్య. ఇందిరాదేవి హాస్పిటల్‌ లో సీతారామయ్య పక్కన కూర్చుని బాధపడుతుంది.


ఇందిర:  ఏంటి బావ ఇది ఇలా ఉలుకు పలుకూ లేకుండా ఇలా పడుకున్నావు. లేవు బావ కళ్లు తెరువు నీ చిట్టితో మాట్లాడు.. నువ్వు బాగున్నావు అని చెప్పు..


కళ్యాణ్‌: తాతయ్యకు ఏం కాదు నాన్నమ్మ.. తొందరలోనే కళ్లు తెరచి మనందరిని చిరునవ్వుతో పలకరిస్తాడు. మన ఇంట్లో హుషారుగా తిరుగుతారు. అందరితో కలిసి భోజనం చేస్తారు


ఇందిర: ఆ ఆశలు చచ్చిపోయాయి కళ్యాణ్‌. ఆ ఇంట్లో ఆనందపు ఆనవాళ్లు లేకుండా పోయాయి. మనవాళ్లు అనుకున్న వాళ్లంతా కాకుండా పోయారు. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇన్నేళ్లు ఆ ఇంటి పరువు ప్రతిష్టలను గుప్పిట్లో పెట్టుకుని కాపాడుకుంటూ వచ్చారు. కానీ పచ్చగా పెరిగే చెట్టుకు చెదలు పట్టినట్టు కుళ్లు కుతంత్రం అనే చెదలు ఆ ఇంటికి పట్టింది.


కళ్యాణ్‌:  అలా అనకు నాన్నమ్మ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా..? మనకు మంచి రోజులు వస్తాయి.


ఇందిర:  అది కలలో కూడా జరిగే అవకాశం లేదురా..


కావ్య: అందుకని  ఇలా ఎవ్వరికీ చెప్పకుండా వచ్చేస్తే ఎలా అమ్మమ్మ. ఇంట్లో వాల్లు గొడవ పడ్డారు. ఏదో మాట మాట అనుకున్నారు. కానీ మీరు ఇలా వచ్చేస్తే ఎలా..? మీరు కనిపించకపోయే సరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా..?


అంటుంది కావ్య. కావ్యను చూసిన ఇందిరాదేవి ఎమోషనల్‌ అవుతుంది. నాకు అక్కడ ఎవరున్నారని అందుకే ఇక్కడకు వచ్చాను అంటుంది. నేను లేనా అమ్మమ్మ గారు అంటూ భోజనం తనే కలిపి తినిపిస్తుంది. ఇందిరాదేవి ఎమోషనల్ అవుతుంది. తర్వాత బయటకు వచ్చిన కళ్యాణ్‌తో కావ్య మాట్లాడుతుంది.


కావ్య: తాతయ్య గారి గురించి డాక్టర్లు ఏమన్నారు కళ్యాణ్‌..


కళ్యాణ్‌: డాక్టర్లు తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పారు వదిన. రోజులు, నెలలు, సంవత్సరాలు అంటూ ఒక్కో పేషెంట్‌ ఒక్కో టైంలో స్పృహలోకి వస్తారంట


కావ్య: నిస్సహాయ స్థితిలో అమ్మమ్మ గారిని.. నిశ్చల స్థితిలో తాతయ్యగారిని చూస్తుంటే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇంతకీ అప్పు ఎక్కడ..


కళ్యాణ్‌: తను ఎస్సై రిటన్‌ టెస్ట్‌ లో సెలెక్ట్‌ అయింది. ట్రైనింగ్‌ కు రమ్మని లెటర్‌ వచ్చింది అందుకే ట్రైనింగ్‌కు వెళ్లింది వదిన.


కావ్య: అప్పుకు తాతయ్యకు ఇలా జరిగిందని చెప్పావా..?


కళ్యాణ్‌: చెప్పలేదు. వదిన తెలిస్తే తను టెన్షన్‌ పడుతుందని ట్రైనింగ్‌ కూడా వెళ్లనని అంటుందని చెప్పలేదు.


అని కళ్యాణ్‌ చెప్పగానే మంచి పని చేశారు కవిగారు అంటుంది కావ్య. రూంలో ఆస్థుల పంపకం గురించి ఆలోచిస్తున్న ధాన్యలక్ష్మీని ప్రకాష్‌ తిడతాడు. నీకు డబ్బు పిచ్చి పట్టిందని తగ్గించుకోకపోతే నీకే మంచిది కాదని హెచ్చరించి వెళ్లిపోతాడు. ధాన్యలక్ష్మీ మాత్రం నేను చేయాలనుకున్నది చేసే తీరతాను అని మనసులో అనుకుంటుంది. కిచెన్‌లో పడుకున్న కావ్యను చూసిన అపర్ణ, రాజ్‌ను పిలిచి తిడుతుంది. నీ భార్య ఎక్కడికి వెళ్లింది ఏం చేస్తుంది అని కనీసం ఆరా తీయవా అంటూ ప్రశ్నిస్తుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!