Brahmamudi Serial Today Episode:  అప్పును రైల్వే స్టేషన్‌కు పంపించిన కళ్యాణ్‌.. హాస్పిటల్‌కు పరుగెత్తుకొస్తాడు. కళ్యాణ్‌ను చూసిన ఇందిరాదేవి మరింత ఎక్కువగా బాధపడుతుంది. తాతయ్యకు ఏం కాదు నాన్నమ్మా మేమంతా ఉన్నాం కదా..? అంటూ కళ్యాణ్, ఇందిరాదేవిని ఓదారుస్తాడు. దూరంగా నిలబడ్డ రుద్రాణి, రాహుల్‌ ఆస్థుల గురించి మాట్లాడుకుంటారు.


రుద్రాణి: వచ్చాడమ్మా ఓదార్పు యాత్రికుడు. అయినా ఆ ముసలాయనది పాతికేళ్ల గుండె అయినట్లు ఫీలవుతున్నారు. ఈ వయసులో ఆయన గుండె ఇంకా పనిచేయడమే చాలా పెద్ద విషయం.


కళ్యాణ్: తాతయ్యకు ఏం జరిగింది అన్నయ్యా ఇప్పుడెలా ఉంది…?


రాజ్‌: ఇంకా ఏమీ తెలియదు.. లోపల ట్రీట్‌మెంట్‌ జరగుతుంది కళ్యాణ్‌.


ఇంతలో డాక్టర్‌ వస్తాడు.


రాజ్‌: డాక్టర్‌ మా తాతయ్యకు ఎలా ఉంది. చెప్పండి డాక్టర్‌ ప్రాబ్లమ్‌ ఏమీ లేదు కదా…?


డాక్టర్‌: మా ప్రయత్నం మేము చేశాము.. కానీ బీపీ బాగా పెరిగిపోయి అది బ్రెయిన్‌ మీద ఎఫెక్ట్‌ పడి ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.


సుభాష్‌: మా నాన్నగారి ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదు కదా..? డాక్టర్‌


డాక్టర్‌: ఇప్పటివరకైతే హార్ట్‌ నార్మల్‌ గానే ఉంది. అంతా మంచే జరగాలని కోరుకుందాం.


 అని చెప్పి డాక్టర్‌ వెళ్లిపోతాడు. ఇందిరాదేవి ఏడుస్తుంది.


కళ్యాణ్‌: అన్నయ్యా నాన్నమ్మ ఇక్కడే ఉంటే తాతయ్యను చూస్తూ ఉండలేదు. మీరు నాన్నమ్మను తీసుకుని ఇంటికి వెళ్లండి ఏమైనా ఉంటే నేను ఫోన్‌ చేస్తాను.


ఇందిరాదేవి: నేను ఎక్కడికి రాను ఇక్కడే ఉంటాను.


కావ్య: అమ్మమ్మ గారు మీరు ఇక్కడే ఉండి మరో పేషెంట్‌ అవుతారా..? తాతాయ్యగారు మంచిగా అయి ఇంటికి వచ్చేసరికి మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆయన సంతోషంగా ఉంటారు.


అంటూ కావ్య తన మాటలతో ఇందిరాదేవిని కన్వీన్స్‌ చేస్తుంది. రాజ్‌ అందరినీ తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు. కనకానికి ఫోన్‌ చేసిన కావ్య సీతారామయ్య విషయం చెప్తుంది. ఇంతలో మూర్తి వచ్చి ఏం జరిగిందని అడగ్గానే కావ్య చెప్పిందంతా చెప్పి ఇప్పుడు కావ్య గురించే ఆలోచిస్తున్నాను అంటుంది. కావ్యకు ఏమైందని మూర్తి అడగ్గానే ఇంకా ఏమీ కాలేదు.. కానీ కావ్య ఇంట్లో అడుగుపెట్టగానే ఆ పెద్దాయకు అలా అయిందని ఎన్ని నిందలు వేస్తారో అని కనకం భయపడుతుంది. మరోవైపు రూంలో సీతారామయ్య ఫోటో చూస్తున్న ఇందిరాదేవి దగ్గరకు కావ్య వెళ్తుంది.


కావ్య: ఎంటి అమ్మమ్మ గారు మీరిలా బాధపడుతూ ఉంటే ఇంట్లో వాళ్లు అందరూ ధైర్యంగా ఎలా ఉంటారు చెప్పండి.


ఇందిరాదేవి: చెట్టంత మనిషి ఆ నాలుగు గోడల మధ్య ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉంటే నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు కావ్య.


కావ్య: మీరు ఇన్నేండ్ల జీవితంలో ఎన్నో చూసి ఉంటారు. మీకు ఎంతో అనుభవం ఉంది. మీరే ఇలా మాట్లాడితే ఎలా అమ్మమ్మ.


ఇందిరాదేవి: నాకు ఎంత అనుభవం ఉన్నా.. అదంతా మీ తాతయ్యగారి పక్కన ఉండి చూసిందే.. ఈరోజు ఆయనే పక్కన లేకుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది.


కావ్య: అమ్మమ్మ.. తాతయ్యగారు నమ్మకంతో  ప్రాణాలతో పోరాడుతున్నారు. కానీ మీరు మాత్రం ఆ నమ్మకం కోల్పోయి ఇలా బాధపడుతున్నారు. అమ్మమ్మ మీరు ఒక్కసారి ఆలోచించండి. తాతాయ్యగారి ఆరోగ్యం బాగుపడి ఇంటికి వచ్చినప్పుడు మీరు ఇలా ఉంటే.. నా వల్ల నా చిట్టి ఇలా అయిపోయిందని ఆయన బాధపడరా..?


 అని కావ్య, ఇందిరాదేవికి  మనోధైర్యం ఇవ్వడంతో పాటు భోజనానికి తీసుకెళ్తుంది. బయట డైనింగ్‌ టుబుల్‌ దగ్గర అందరూ భోజనానికి రెడీగా ఉంటారు. రుద్రాణి ఆకలి వేస్తుందని వడ్డించుకుని తిందామా అన్నయ్యా అని సుభాష్‌ను అడుగుతుంది. అమ్మా వచ్చాక తిందామని సుభాష్‌ చెప్తాడు. ఇంతలో ఇందిరాదేవిని తీసుకుని కావ్య వస్తుంది. మళ్లీ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర రుద్రాణి, ధాన్యలక్ష్మీ ఆస్థుల పంపకం కోసం గొడవ చేస్తారు. దీంతో ఇందిరాదేవి అందరిని తిడుతుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!