Brahmamudi Serial Today Episode: రుద్రాణి కాఫీ అడగడంతో రోజుకు రెండు సార్లు మాత్రమే కాఫీ ఇస్తానని ఇప్పుడు మీకు కాఫీ ఇస్తే ఇక ఈరోజు మీకు కాఫీ ఇవ్వనని చెప్తుంది శాంత. దీంతో నాకే ఆర్డర్ వేస్తున్నావా అంటూ రుద్రాణి కోప్పడుంతుంది. అయితే ఇదంతా కావ్య మేడం రూల్ అని శాంత చెప్పగానే సరే ఇక ఈరోజు కాఫీ అడగను ఇప్పుడైతే ఇవ్వు అంటుంది రుద్రాణి. శాంత కాఫీ తీసుకొచ్చి ఇవ్వగానే.. కాఫీ తాగుతూ బాల్కనీలోకి వెళ్తుంది రుద్రాణి. కింద కావ్య కార్లన్నీ కంపెనీకి రిటర్న్ పంపించడం చూస్తుంది రుద్రాణి.
రుద్రాణి: ఇది కదా మనకు గుడ్ న్యూస్
రాహుల్: ఏంటి తిరగడానికి ఇంట్లో కార్లు లేకుండా చేయడం గుడ్ న్యూసా మమ్మీ..
రుద్రాణి: ఇప్పుడు కావ్య చాదస్తం పీక్స్ కు చేరి కార్లన్నీ పంపిచింది. ఇన్నాళ్లు ఇంట్లో వాళ్లు కావ్యను వెనకేసుకొచ్చారు. ఇప్పుడు ఈ కార్ల వ్యవహారం అందరికీ చెప్పి అది ఈ ఇంట్లో అధికారం చెలాయించడానికి కాదు కదా..? అడుక్కు తినడానికి కూడా పనికిరాదు అని ఫ్రూవ్ చేయాలి.
అని రాహుల్‌కు చెప్పిన రుద్రాణి ఇంట్లోకి వెళ్తుంది. మరోవైపు రాజ్ ఆఫీసులో టెన్షన్ పడుతుంటాడు.
కావ్య: ఏమైందండి అంతలా టెన్షన్ పడుతున్నారు.
రాజ్: అది చెప్తే నువ్వు కూడా టెన్షన్ పడతావు
కావ్య: చెప్పకపోతే ఇంకా టెన్షన్ పడతాను.
రాజ్: ఏం లేదు జగదీష్ గారి కాంట్రాక్ట్ పూర్తి చేయాలంటే మనకు ఇప్పుడు 5 కోట్ల దాకా అవసరం పడతాయి. అంత డబ్బు ఎలా తీసుకురావాలి..?
కావ్య : ఓహో సరేలేండి..
రాజ్: చెప్తే టెన్షన్ పడతావు అనుకుంటే చెప్పినా టెన్షన్ పడటం లేదేంటి..?
కావ్య: మీరు కూడా టెన్షన్ పడకండి.. నారు పోసిన వాడే నీరు పోస్తాడు.
ఇంతలో జగదీష్ వస్తాడు. ఆయన్ని చూసిన రాజ్ కంగారు పడుతుంటాడు. మీరు ఇచ్చిన గడువు ఇంకా ఉంది కదా అంటూ రాజ్ అడగ్గానే.. నేను కావ్య ఫోన్ చేస్తే వచ్చాను. తను కొంత అమౌంట్ అడ్వాన్స్ గా ఇవ్వమని చెప్పింది ఇదిగో 5 కోట్లకు చెక్ తీసుకో అంటాడు జగదీష్. జగదీష్ మాటలకు రాజ్ హ్యాపీగా ఫీలవుతాడు. జగదీష్ వెళ్లిపోయాక సంతోషంతో కావ్యను ఎత్తుకుంటాడు రాజ్. ఇంతలో శృతి రావడంతో కింద పడేస్తాడు. దీంతో కావ్య ఏంటండి ఇలా కింద పడేస్తారేంటి అంటుంది. రాజ్ కంగారుగా చాంబర్ లోంచి బయటకు వెళ్లిపోతాడు. ఇంట్లోకి వెళ్లిన రుద్రాణికి సుభాష్ ఎదురొస్తాడు.
రుద్రాణి: ఏంటన్నయ్యా అంత హడావిడిగా వెళ్తున్నావు ఏదైనా ప్రాబ్లమా.. ప్రాబ్లం అయితే వీడిని తీసుకెళ్లు..
సుభాష్: వాడి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ అవుతాయి. అర్జెంట్‌గా క్లబ్‌కు వెళ్తున్నాను.
అని సుభాష్ వెళ్లిపోతాడు. రుద్రాణి నవ్వుతుంది.
రాహుల్: ఏంటి మమ్మీ కామ్‌గా వెల్లిపోయే వాడిని పిలిచి మరీ నన్ను తిట్టించినందుకా నవ్వుతున్నావు.
రుద్రాణి: కాదు రా రాహుల్.. ఇప్పుడే ఇంట్లో చిన్నసైజు సునామీ సృష్టించబోతున్నాను అందుకే నవ్వాను.. ఇక్కడే ఉండు
అని చెప్పి ధాన్యలక్ష్మీ రూంలోకి వెళ్తుంది రుద్రాణి.
రుద్రాణి: ఈ ఇంట్లో నువ్వే మహాలక్ష్మీలా కనిపిస్తావు
ధాన్యలక్ష్మీ: నాతో ఏమైనా పనుందా రుద్రాణి..
రుద్రాణి: అవును ధాన్యలక్ష్మీ.. నా నగలు మెరుగు పెట్టించడానికి బయటకు వెళ్తున్నాను. నువ్వు వస్తావేమోనని
అని రుద్రాణి పిలవగానే ధాన్యలక్ష్మీ రానంటుంది. దీంతో రుద్రాణి తన మాటలతో ధాన్యలక్ష్మీని కన్వీన్స్ చేసి తీసుకెళ్తుంది. ఇద్దరూ బయటకు వెళ్లగానే కార్లు కనిపించవు.. ధాన్యలక్ష్మీ డ్రైవర్‌కు ఫోన్ చేసి తిడుతుంది. డ్రైవర్ నేను ఇప్పుడు మీ డ్రైవర్ కాదని మర్యాదగా మాట్లాడండి అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తాడు. కార్లన్నీ కావ్య వెనక్కి పంపించేసింది రాహుల్ వచ్చి చెప్తాడు. కోపంతో ఇంట్లోకి వెళ్లిన ధాన్యలక్ష్మీ కావ్యను తిడుతూ అపర్ణకు చెప్తుంది. అపర్ణ కావ్యకు ఫోన్ చేస్తే తాను బిజీగా ఉన్నానని తర్వాత ఫోన్ చేస్తానని కట్ చేస్తుంది. దీంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ ఇద్దరూ కలిసి మమ్మల్ని ఎలాగూ పూచిక పుల్లగానే చూస్తుంది. కనీసం అత్తయ్యవు అనే గౌరవం లేకుండా నీ ఫోన్ కట్ చేసింది అంటూ కావ్యను తిడతారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!