Brahmamudi Serial Today Episode:  రాజ్‌, కావ్య మాటల్లో ఏదో తేడా కొడుతుందని రుద్రాణి, దాన్యలక్ష్మీకి చెప్తుంది. ఆఫీసులో అడిటింగ్‌ జరగుతుందని రాజ్‌ అబద్దం చెప్పాడేమో అంటుంది. అబద్దం చెప్పాల్సిన కర్మ రాజ్‌ కు లేదని.. అయినా రాజ్‌ అలాంటి వాడు కాదని ధాన్యలక్ష్మీ అంటుంది. దీంతో కావ్య వేసిన డిజైన్స్‌ దొంగిలించిన వాడు రాజ్‌. నువ్వు రాజ్‌ గురించి మంచివాడు అన్నడం కరెక్టు కాదు అంటూ తన మాటలతో ధాన్యలక్ష్మీని మళ్లీ రెచ్చగొడుతుంది రుద్రాణి. మరోవైపు రాజ్‌ హాస్పిటల్‌ బిల్లు గురించి ఆలోచిస్తుంటాడు. డబ్బుల కోసం తన ఫ్రెండ్‌ కు ఫోన్‌ చేస్తాడు.


రాజ్: ఓరేయ్‌ శేఖర్‌ ఎలా ఉన్నావురా…?


శేఖర్‌: హాయ్‌ రాజ్‌.. ఎన్ని రోజులకు గుర్తుకు వచ్చానురా..


రాజ్‌: అవున్రా.. చాలా అవసరం వచ్చింది అందుకే ఫోన్‌ చేశాను. నాకో ఐదు లక్షలు అప్పు కావాలిరా.. నీకు మళ్లీ ఓ నెలరోజుల్లో తిరిగి ఇస్తాను


శేఖర్‌:  ఐదు లక్షలా ఏరా జోక్‌ చేస్తున్నావా..? నీకు ఐదు లక్షలు ఒక అవసరమా..? నీకు ఇంత చిన్న అమౌంట్‌ అవసరం వచ్చిందా..?


రాజ్: అవును శేఖర్‌ చాలా అవసరం వచ్చింది..


శేఖర్‌: ఒరేయ్‌ ఐదు లక్షలు నీకు చాలా చిన్న అమౌంట్‌ రా.. కానీ అది నాకు చాలా పెద్ద అమౌంట్‌ రా మొన్ననే ప్లాట్‌కు అడ్వాన్స్‌ కట్టాను. అయినా నీకు డబ్బుతో అవసరం ఏంట్రా.. మీ ఇంట్లోనే కోట్లకు కోట్లు మూలుగుతుంటాయి.


రాజ్‌: ఏం లేదురా..  మా ఆవిడతో పందెం కట్టానురా… నువ్వు నా బెస్ట్‌ ఫ్రెండ్‌వి అని చెప్పగానే ఒకసారి డబ్బు అడిగి చూడు అంది. నువ్వు నాకు బెస్ట్‌ ఫ్రెండువి అవునో కాదో నాకు తెలియకపోయినా.. మా ఆవిడకు తెలిసిపోయిందిలే..


అంటూ ఫోన్‌ కట్‌ చేస్తాడు రాజ్‌.


కావ్య: మీరు ఇంత చిన్న అమౌంట్‌ కోసం అడిగితే ఎవ్వరూ నమ్మరు. అయినా మీరేం టెన్షన్‌ పడకండి ఇప్పుడే వస్తాను.


రాజ్‌: ఇప్పుడే వస్తాను అని వెళ్తుంది. తెస్తానని వెళ్లిందా..? తెస్తుందా..? ఇంట్లో ఇంకా డబ్బులు ఉన్నాయా..?


అని రాజ్‌ మనసులో అనుకుంటాడు. ఇంతలో కావ్య తన బంగారు నగలు తీసుకొచ్చి ఇవి తాకట్టు పెట్టి ఐదు లక్షలు తీసుకురండి హాస్పిటల్ బిల్లు కడదాం అని చెప్తుంది. రాజ్‌ జాలిగా కావ్య వైపు  చూస్తుంటాడు. హాస్పిటల్‌ లో ఉన్న కళ్యాణ్‌కు అప్పు ఫోన్‌ చేస్తుంది.


కళ్యాణ్: హాయ్‌ పొట్టి..


అప్పు:  ఆపరా బై నీ దొంగ ప్రేమలు


కళ్యాణ్‌: దొంగ ప్రేమా ఏమైంది పొట్టి ఎందుకలా మాట్లాడుతున్నావు..


అప్పు: నాక్కాదు నీకే ఏదో అయింది. అందుకే నేను ఫోన్‌ చేస్తేనే మాట్లాడుతున్నావు. నేను గుర్తు చేస్తేనే నన్ను గుర్తు చేసుకుంటున్నావు. నువ్వు చాలా మారిపోయావు


కళ్యాణ్‌: అప్పు ఇంక ఆపు.. ఇప్పుడు నేను ఏం చేశానని ఇలా నాతో మాటలతో ఫైట్‌ చేస్తున్నావు..


అప్పు: ఏం చేశావా..? లాస్ట్‌ టైం నేను కాల్ చేసినప్పుడు నువ్వు ఎం చేప్పావో గుర్తుందా..?


కళ్యాణ్: ఏం చెప్పాను..


అప్పు: ఏం చెప్పావో నీకు గుర్తు కూడా లేదా..? వీకెండ్‌ లో నా దగ్గరకు వస్తానని చెప్పావు.. నువ్వు చాలా మారిపోయావు.. నిజం చెప్పు నువ్వు హైదరాబాద్‌లో చిన్న ఇల్లు ఏమైనా మెయింటెన్‌ చేస్తున్నావా..?


డాక్టర్ : మీరింకా బిల్లు పే చేయలేదు. అలా అయితే హాస్పిటల్‌ రూల్స్‌ ఒప్పుకోవు


అప్పు: హాస్పిటల్‌ ఏంటి.. ఎవరు పక్కన బిల్లు కట్టలేదంటున్నాడు ఏంటి..?


అని అప్పు అడగ్గానే కళ్యాణ్‌ ఫోన్‌ కట్‌ చేస్తాడు. ఇంతలో నర్స్‌ వచ్చి వాళ్ల మేనేజర్‌ వచ్చి బిల్లు పే చేసి వెళ్లాడు అని చెప్తుంది. డాక్టర్‌, కళ్యాణ్‌కు సారీ చెప్తాడు. అప్పు మళ్లీ ఫోన్‌ చేసి నిజం చెప్పమని అడుగుతుంది. కళ్యాణ్‌ నిజం చెప్పగానే అప్పు షాక్‌ అవుతుంది. వెంటనే నేను వస్తాను అంటుంది వద్దని వారిస్తాడు కళ్యాణ్‌. తాతయ్య కోమాలోంచి వచ్చేటప్పటికీ నువ్వు పోలీస్‌ యూనిఫాంలో వస్తే ఆయన చాలా సంతోషిస్తారు అని చెప్తాడు. తాము ఆఫీసులో వాడుకున్న కార్ల బిల్లు చూసి రాజ్‌ షాక్‌ అవుతాడు. కావ్య షాక్ అవుతుంది. కానీ  ఆ కార్లను రిటర్న్‌ పంపిద్దామని చెప్తుంది.  దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!