Brahmamudi Serial Today Episode:   కొత్తగా వచ్చిన స్టెల్లా వెంట సొలు కారుస్తూ పడతారు రాహుల్‌, ప్రకాష్‌. ఇద్దరికి చెరో నిక్‌ నేమ్‌ పెడుతుంది స్టెల్లా.. రాహుల్‌ ని మిస్టర్‌ డిలిషియస్‌ అంటూ ప్రకాష్ ను పులిహోర అని పిలుస్తుంది. వాళ్ల వాలకం చూసిన స్వప్న, ధాన్యలక్ష్మీ కోపంగా ఫీలవుతుంటారు. ఇంతలో మా ఇద్దరికి నిక్‌ నేమ్‌ పెట్టావు కానీ రాజ్ పెట్టలేదేంటి నిక్‌ నేమ్‌ అంటాడు రాహుల్‌. దీంతో రాజ్‌ చెర్రి పండులా ఉన్నాడు కాబట్టి చెర్రి అంటుంది.


రాజ్‌:  ఓకే ఓకే ఎవరికేం కావాలో చెబితే తాను రెడీ చేస్తుంది.


రాహుల్‌:  నాకు ఇటాలియన్‌ డిషెష్ రెండు చాలు.


సుభాష్‌: తినడానికి పనికి వచ్చేది. తిన్న తర్వాత ఆరోగ్యాన్ని బాగు చేసేది ఒకటి చాలు.


ప్రకాష్‌: నాకు నీ చేత్తో ఏం చేసినా చాలు.


స్టెల్లా:  చూడు పులిహోర మీరు ఏం కోరుకుంటారో నేను అదే చేస్తాను.. ఇంతకీ నా అసిస్టెంట్స్‌ ఎక్కడ..?


రాజ్‌:  అసిస్టెంట్సా..?


స్టెల్లా: అవును ముగ్గురు కావాలి.  ఒకరు డిష్‌ వాషింగ్‌ చేస్తారు. ఒకరు వెజిటేబుల్‌ కట్‌ చేస్తారు. ఒకరు కుకింగ్‌లో హెల్ప్‌ చేస్తారు.  


ఇందిరాదేవి: వంటకే ముగ్గురు అసిస్టెంట్స్ కావాలంటుంది. ఇక బాత్రూం క్లీన్‌ చేయడానికి ఎంత మంది కావాలంటుందో…?


స్టెల్లా:  చీచీ అలాంటి పనులు నేనెందుకు చేస్తాను నేను ఓన్లీ కుకింగ్‌ మాత్రమే చేస్తాను.


రాజ్‌: సరే అయితే ఈ ఒక్క రోజు ఎలాగైనా అడ్జస్ట్‌ చేసుకో రేపటి నుంచి నీకు ముగ్గురు అసిస్టెంట్స్‌ ను ఇస్తాను.


స్టెల్లా: లేదు నేను కుకింగ్‌ మాత్రమే చేస్తాను. అసిస్టెంట్స్‌ వచ్చాకే వంట మొదలుపెడతాను.


రాహుల్‌:  మేం ముగ్గురం ఉన్నాము కదా..?


 అంటూ రాహుల్‌ తనను ప్రకాష్‌ను,  రాజ్‌ను చూపిస్తాడు. సరే అయితే వెళ్దాం పదండి అని కిచెన్‌ లోకి వెళ్తుంటే..  రాహుల్‌, ప్రకాష్‌ ఇద్దరూ కలిసి స్టెల్లాను చెరో వైపు పట్టుకుంటారు.  రాజ్ వెళ్లి  ఏయ్‌ వదలండి అంటూ తిడతాడు. కిచెన్‌  చూసిన స్టెల్లా..  కిచెన్‌ అంతా డర్టీగా ఉంది అంటూ తిడుతుంది. దీంతో ప్రకాష్‌, రాహుల్‌ కిచెన్‌ క్లీన్‌ చేస్తారు. రాజ్‌ చేత వెజిటేబుల్స్‌ కట్‌ చేయిస్తుంది స్టెల్లా. తాను కూర్చుని ముగ్గురి చేత వంట కంప్లీట్‌ చేయిస్తుంది.


స్టెల్లా: కుకింగ్‌  పూర్తి అయిపోయింది. తీసుకెళ్లి డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టుకుని తినేయండి.


రాజ్‌: ఏంటి ఇవన్నీ మేము మోసుకెళ్లి తినాలా..?


ప్రకాష్‌:  నువ్వే కొసరి కొసరి వడ్డిస్తావనుకున్నాను.


రాహుల్‌: నీతో కలిసి కూర్చుని లంచ్‌ చేద్దామనుకున్నాను స్టెల్లా.


స్టెల్లా: కుకింగ్‌ సెక్షన్‌ మాత్రమే నేను చూసుకుంటాను. మిగతావన్నీ ఎవరి వైఫ్స్‌ తో వాళ్లు చేయించుకోవాలి.. నాకెలాంటి సంబంధం లేదు.


రాజ్‌: ఏంటి ఇలా రోజు ముగ్గురు అసిస్టెంట్స్‌ తో సర్వం చాకిరి చేయించుకుని పైపైన గరిట తిప్పినందుకు నీకు లక్ష రూపాయలు ఇవ్వాలా..? అవసరం లేదు.


ప్రకాష్‌: ఓరేయ్‌ రాజ్‌ ఊరుకోరా.. నువ్వలా మాట్లాడితే స్టెల్లా మానేస్తుంది.


రాహుల్‌: నీకెందుకు రాజ్‌ నేను మామయ్య చూసుకుంటాము కదా..? ఆ గిన్నెలేవో మేము పెట్టేస్తాము.


రాజ్‌: ఏదో ఒకటి ఏడవండి


అని చెప్పి రాజ్‌ పైకి వెళ్లిపోతాడు. తర్వాత ఇందిరాదేవి, సీతారామయ్య, సుభాష్‌లకు కావ్య భోజనం వడ్డిస్తుంది. స్వప్న, ధాన్యలక్ష్మీ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతలో రాజ్‌ కిందకు వచ్చి మా డిషెష్‌ ఇంకా రాలేదా..? అని అడుగుతాడు. రాలేదని.. లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మా కాపురాలు కూల్చడానికి ఆ కుక్‌ ను తీసుకొచ్చావా రాజ్‌ అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. కిచెన్‌లో స్టెల్లాలో సెల్పీల కోసం రాహుల్‌, ప్రకాష్‌ పోటీ పడుతుంటారు. వెళ్లి వాళ్లను తిట్టి డిషెష్‌ తానే డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు తీసుకొస్తాడు రాజ్‌. ఇంతలో స్టెల్లా వచ్చి నేను చేసిన డిషెష్‌ ఇంకో పది నిమిషాల్లో తినాలనే లేదంటే అవి తినడానికి పనికిరావని చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!