Brahmamudi Serial Today Episode: ఇంట్లో కావ్య పెత్తనం భరించలేమని ఈ విషయంపై మీ అన్నయ్యను అడగమని ధాన్యలక్ష్మీ, ప్రకాష్‌ను రెచ్చగొట్టి బలవంతంగా హాల్లోకి తీసుకొస్తుంది. పని చేసుకుంటున్న సుభాష్ దగ్గరకు ప్రకాష్ వెళ్లి కావ్య పెట్టిన కండిషన్స్ వల్ల ఇంట్లో అందరూ సపర్ అవుతున్నారని చెప్తాడు ప్రకాష్. ఎవరు సపర్ అవుతున్నారు. నీ భార్య ఆమెకు సపోర్టుగా ఉన్న మందరే కదా సపర్ అయ్యేది అంటాడు సుభాష్. ఇంతలో హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి ఇంకా బిల్లు కట్టలేదని చెక్ ఇచ్చారు కానీ అది బౌన్స్ అయిందని చెప్తారు. దీంతో సుభాష్, కావ్యను పిలుస్తాడు.
సుభాష్: అమ్మా కావ్య హాస్పిటల్ బిల్ ఇంకా క్లియర్ కాలేదంట చెక్ ఎందుకు హోల్డ్ లో పెట్టారు.
రుద్రాణి: మనకు మంచి మసాలా దొరికిందిరా.. ( అని రాహుల్‌కు చెప్తూ..) లోక కళ్యాణం కోసం.. ప్రపంచ శాంతి కోసం.. దుగ్గిరాల వంశ ప్రతిష్టను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడం కోసం అంతేనా కావ్య
ధాన్యలక్ష్మీ: ఎవరిని ఉద్దరించడానికి అంత చిన్న అమౌంట్ ఆపాల్సి వచ్చింది. అయినా హాస్పిటల్ బిల్లు ఈవిడ ఆపాల్సిన అవసరం ఏమోచింది. మా మామయ్య హాస్పిటల్ బిల్లు కూడా ఎందుకు ఆపావు..
రాజ్ : అసలు విషయం బయటపడేలా ఉంది ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి (అని మనసులో అనుకుని కిందకు వస్తూ..) నేను చెప్తాను.
రుద్రాణి: మేము దేని గురించి అడుగుతున్నామో ఆ విషయం నీకు తెలుసా..?
రాజ్: ఇంతకీ నీ బాధ ఏంటి అత్తయ్యా…
రుద్రాణి: రాజ్ తాతయ్య ఉన్న హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది ఇంత వరకు బిల్లు కట్టలేదంట
అపర్ణ: హాస్పిటల్ బిల్లు ఎందుకు క్లియర్ చేయలేదు కావ్య.
ఇందిరాదేవి: ఐదు లక్షలు కూడా మన దగ్గర లేవా..? మనకా స్థాయి లేదా..?
కావ్య: అదేం లేదు అమ్మమ్మగారు.. అసలేం జరిగింది అంటే..
రాజ్: కళావతి నువ్వు ఆగు.. ఇదంతా నా వల్లే జరిగింది.. అంతా నేనే చెప్తాను.
కావ్య: చెప్పండి మీరే చెప్పండి.. అందరూ నన్ను దోషిగా నిలబెట్టినా మౌనంగా ఉన్నాను. కానీ మిమ్మల్ని అంటుంటే ఆగలేక నేనే చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు మీరే చెప్పండి
సుభాష్: రాజ్ ఏం జరుగుతుందిరా… ఇద్దరూ కలిసి ఏం చేస్తున్నారు
అపర్ణ: చేయడం కాదు ఇద్దరూ కలిసి ఏదో దాస్తున్నారు. పెద్ద విషయమే జరిగింది.
రాజ్: దాచడానికేం లేదు మమ్మీ ఇది రహస్యంగా జరిగేది ఏం కాదు.. ఆఫీసులో ఆడిటింగ్ జరుగుతుంది అందుకే ట్రాన్సిక్షన్స్ అన్ని ఆగిపోయాయి
ప్రకాష్: ఇప్పుడు ఆడిటింగ్ ఏంట్రా మార్చిలో కదా జరగాల్సింది.
రుద్రాణి: శభాష్ చిన్నన్నయ్యా అన్ని మర్చిపోయిన నువ్వు ఈ విషయం మాత్రం బాగానే గుర్తు పెట్టుకున్నావు అవును రాజ్ ఆడిటింగ్ ఇప్పుడు జరగటం ఏంటి..?
రాజ్: దానికి నీ కొడుకే కారణం అత్తా.. ఇదంతా అటు తిరిగి ఇటు తిరిగి నా మెడకే చుట్టుకుంది. మధ్యలో వెళ్లి సీఈవో సీట్లో కూర్చున్నాడు కదా..? లెక్కలు లేవు.. ఏమీ లేవు.. అంత అస్తవ్యస్తం చేశాడు. అడిటింగ్ పూర్తి కాగానే అంతా మామూలు అవుతుందనుకున్నాను. కానీ నా లెక్క కూడా తప్పింది.
అంటూ విషయం డైవర్ట్ చేస్తాడు రాజ్. ఎవరినైనా ఏదైనా అడిగే ముందు క్లారిటీగా తెలుసుకోవాలని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు. తర్వాత ఇందిరాదేవి దగ్గరకు వెళ్లిన కావ్య ఓదారుస్తుంది. దీంతో ఇంటిని ముక్కలు కాకుండా నువ్వు రాజ్ ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు అంటుంది ఇందిరాదేవి. తర్వాత రాజ్ దగ్గరకు వెళ్లిన సుభాష్ ఆఫీసులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతాడు ఎం లేవని ఉంటే మీకు చెప్పకుండా ఉంటానా డాడీ అంటాడు రాజ్. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!