Brahmamudi Serial Today Episode:  సీతారామయ్య సాయం కోరుతూ దుగ్గిరాల ఇంటికి వచ్చిన ప్రసాద్‌ కుటుంబాన్ని రుద్రాణి బయటకు గెంటి వేస్తుంది. సీతారామయ్యకే ఇక్కడ దిక్కులేదు. మళ్లీ మీకు సాయం కావాలా..? అంటూ తిట్టడంతో వాళ్లు బయట గేటు దగ్గర నిలబడి బాధపడుతుంటారు. అప్పుడే ఇంటికి వచ్చిన రాజ్‌ వాళ్లను చూస్తూ లోపలికి వెళ్లి వాళ్లు ఎవరు అత్తయ్యా అని అడుగుతుంది. ఎవరో దారినపోయే దానయ్యట మీ తాతయ్య సాయం చేస్తా అన్నారట అందుకోసం వచ్చారట అని వెటకారంగా చెప్తుంది రుద్రాణి. రుద్రాణిని తిడుతూ రాజ్‌ బయటకు వెళ్తాడు.


స్వప్న : సుభాష్‌ అంకుల్‌ రాహుల్‌ను ఎవరు చదివించారు..?


సుభాష్‌ : మా నాన్నే


స్వప్న : అదేంటి ఇలా గతి లేని వాళ్లందరినీ ఇంట్లో పెట్టుకుని చదివించినప్పుడు దారిన పోయే వాళ్లకు సాయం చేస్తే తప్పేంటి..?


రుద్రాణి: ఏయ్‌ స్టుపిడ్‌ వాళ్లు మేము ఒక్కటేనా..


స్వప్న :  ఒక్కటే.. కన్నతండ్రి కాకుండా ఇంకొకరి దయాదాక్షిణ్యం మీద నీ కొడుకును చదివించి ఇంకొకరికి విద్యాదానం చేస్తుంటే నీ మొగుడి సొమ్ము ఏదో దోచిపెడుతున్నట్లు ఫీలవుతావేంటి అత్త..


 రాజ్‌ వాళ్లను లోపలికి తీసుకొస్తాడు.


రాజ్‌: మా అత్తకు ఈ మధ్యనే మతిస్థిమితం తప్పింది. ఏదేదో మాట్లాడుతుంది. అయినా మీకు ఎంత కావాలి చెప్పండి


అని అడగ్గానే ప్రసాద్‌ నా కొడుకు చదువుకు ఐదు లక్షలు అవుతాయి సార్‌ అని చెప్పగానే కావ్యను ఐదు లక్షలు తీసుకొచ్చి ఇవ్వు అని చెప్తాడు రాజ్‌. డబ్బులు తీసుకొచ్చిన కావ్య వాళ్లకు ఇవ్వమని రాజ్‌ కు ఇవ్వబోతే నువ్వే ఇవ్వు అంటాడు. తను ఇవ్వకుండా ఇందిరాదేవి చేత ఇప్పిస్తుంది కావ్య. ప్రసాద్‌ వాళ్లు హ్యాపీగా వెళ్లిపోతారు. మరోవైపు ఐసీయూలో సీతారామయ్య దగ్గర ఉన్న కళ్యాణ్‌కు ఫోన్‌ చేసి ఎలా ఉన్నావని అసలు నేను వచ్చినప్పటి నుంచి నాకు ఎందుకు ఫోన్‌ చేయలేదని అప్పు అడుగుతుంది. బాగానే ఉన్నానని కళ్యాణ్‌ ఏదో చెప్పబోతుంటే హాస్పిటల్‌లో ఎవరో డాక్టర్‌ అంటూ పిలవడం అప్పు విని హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లావు అని అడుగుతుంది. తాతయ్య విషయం చెబితే అప్పు కంగారు పడుతుందని తమ రైటర్‌కు ఒంట్లో బాగాలేకపోతే వచ్చామని మేనేజ్‌ చేస్తాడు కళ్యాణ్‌. కిచెన్‌ లో ఉన్న కావ్య దగ్గరకు సుభాష్‌ వస్తాడు.


సుభాష్‌: అమ్మా కావ్య బయటకు వెళ్తున్నాను రెండు లక్షలు ఇవ్వమ్మా..


కావ్య: సరే మామయ్యా


అంటూ వెళ్లి డబ్బులు తెచ్చి ఇస్తుంది. అవి తీసుకుని సుభాష్‌ వెళ్లిపోతాడు. ప్రకాష్‌ ఏదో మర్చిపోయినట్టు కావ్య దగ్గరకు వస్తాడు.


కావ్య: ఏంటి చిన్న  మామయ్యా ఆలోచిస్తున్నారు.


ప్రకాష్: ఏం లేదమ్మా ఏదో చెబుదామని రూంలోంచి అనుకుంటూ వచ్చాను కానీ మర్చిపోయాను


కావ్య: అయితే నేను వంట చేస్తుంటాను. మీకు గుర్తు వచ్చినప్పుడు చెప్పండి..


ప్రకాష్‌: ఆ గుర్తొచ్చింది ఓ లక్ష రూపాయలు కావాలమ్మా..


కావ్య: అయితే ఉండండి మామయ్యా ఇప్పుడే తీసుకొస్తాను.


అంటూ వెళ్లి డబ్బులు తెచ్చి ఇస్తుంది. ప్రకాష్‌ కూడా వెళ్లిపోతాడు. తర్వాత రాహుల్‌ వచ్చి డబ్బులు అడిగితే కావ్య ఇవ్వనంటుంది. దీంతో రాహుల్‌ నేను వెళ్లి చిన్నత్తయ్యను అడుగుతాను అంటూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తాడు. దీంతో కావ్య డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంది. రాహుల్‌ వెళ్లిపోయాక నాకు ఈ పెత్తనం వద్దు ఆయనకే ఇస్తాను అనుకుంటూ రాజ్‌ రూంలోకి వెళ్తుంది. రాజ్‌ వంద కోట్ల ష్యూరిటీ గురించి ఆలోచిస్తూ కావ్యను తిట్టి పంపిస్తాడు. కావ్య అపర్ణ దగ్గరకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంటుంది. కానీ అపర్ణ నువ్వు అన్ని చూసుకోవాలని.. ఇది నీకు బరువు కాదు బాధ్యత అని చెప్తుంది.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!