Brahmamudi Serial Today Episode: ఇంట్లో వాళ్లకు నిజం తెలియడంతో బాధగా ఉంటారు. ఇంతలో వచ్చిన రాజ్‌, కావ్య కేరళలో జరిగిన విషయాలు చెప్పి కావ్యకు అంతా బాగానే ఉందని చెప్తాడు. అందరూ హ్యపీగా ఫీలవుతుంటే.. రుద్రాణి మాత్రం అనుమానిస్తుంది.

Continues below advertisement

 రుద్రాణి: మీరు మళ్లీ అబద్దం చెప్తున్నారేమో…? ఎలా నమ్మేది.?

రాజ్‌: నాకు తెలుసు అత్త నువ్వు నమ్మవని కళావతి ఆ రిపోర్ట్స్‌ ఇలా ఇవ్వు..

Continues below advertisement

రిపోర్ట్ చూసిన రుద్రాణి సైలెంట్‌ గా ఉండిపోతుంది.

అపర్ణ: చాలా సంతోషంగా ఉందిరా.. నువ్వేమో నీ భార్యను సంతోషపెట్టడానికి మా ముందు నటిస్తావు. అదేమో బిడ్డను కని ఈ ఇంటికి వారసుణ్ని ఇవ్వడానికి  ఆనందంగా ప్రాణత్యాగం చేయాలి అనుకుంటుంది. మేమేనట్రా మూర్ఖులం మేమేనా జాలి దయ లేని వాళ్లం

ఇందిరాదేవి: రేయ్‌ మా ఆనందం అయినా.. బాధైనా.. కష్టమైనా, సుఖమైనా అంతా మీతోనే కదరా అలాంటిది మాకు సంతోషాన్ని పంచి మీరు బాధను ఎలా దిగమింగారురా..?

అపర్ణ: కావ్య ఇందుకోసమేనా.. కేరళ వెళ్లే ముందు మళ్లీ తిరిగిరానట్టు బాధగా వెళ్లావు

కావ్య: మేము నటించాల్సి వచ్చినా..? అబద్దాలు చెప్పినా..? చాటున ఏడ్చినా.. అంతా మన కుటుంబం కోసమే.. కానీ ఇంక ఆ అవసరం లేదు.. ఇంక రాదు కూడా.. నేను నా బిడ్డను కనడమే కాదు కళ్లారా చూసుకోగలను అత్తయ్య.. ఇదిగో అత్తయ్య గారితో తలంటు పోయించగలను.. అమ్మమ్మగారు మీ భుజాల మీద నా బిడ్డను ఎక్కించగలను.. మీరు కలలు కన్న కావ్య బిడ్డను మోసి కని ఈ ఇంటికి వారసుడిని ఇవ్వాలన్నా మీ అందరి ఆశ నేను తీర్చబోతున్నాను.. ఇంత కన్నా నాకేం కావాలి..?

హ్యాపీగా ఉండగానే.. రాజ్‌ కు రమాకాంత్‌ ఫోన్‌ చేస్తాడు.

రమకాంత్‌: ఈవెనింగ్‌ అవార్డు ఫంక్షన్‌ ఉందిగా మీరొస్తారని తెలుసు కానీ మళ్లీ ఒకసారి గుర్తు చేద్దామని కాల్‌ చేశాను.

రాజ్: అవునా ఏం అవార్డు..

రమాకాంత్‌: అయ్యో మీకు తెలియదా అండి.. ఎనీవే సాయంత్రం ఆరు గంటలకు వచ్చేయండి.

అంటూ కాల్‌ కట్‌ చేయగానే.. రాజ్‌ కన్ఫీజ్‌గా సుభాష్‌ను ఏం పంక్షన్‌ అని అడుగుతాడు. నేను చెప్తాను అంటుంది స్వప్న.

స్వప్న: మీరు రాహుల్‌ చేత పెట్టించిన ఆర్‌ కంపెనీని రాహుల్‌ మార్కెట్‌లోకి తీసుకెళ్లారు.. ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఆర్‌ కంపెనీ గురించే చర్చ జరుగుతుంది. అందుకే అసోసియేషన్‌ వాళ్లు రాహుల్‌కు సన్మానం ఏర్పాటు చేశారు.

రాజ్‌: అవునా.. సూపర్‌.. ఓరేయ్‌ రాహుల్‌ కంగ్రాచ్యులేషన్స్ రా..

అంటూ రాజ్‌, అప్రిసియేట్‌ చేస్తాడు. అందరూ రాహుల్‌ను కోపంగా చూస్తుంటారు. తర్వాత అప్పును స్టేషన్‌ను దొంగచాటుగా పంపిస్తాడు కళ్యాణ్‌. అలా పంపించడం ప్రకాష్‌ చాటు నుంచి చూస్తాడు. ఇంతలో కళ్యాణ్‌ లోపలికి రాగానే.. ధాన్యలక్ష్మీ జ్యూస్‌ తీసుకుని అప్పు కోసం పైకి వెళ్తుంటుంది. కళ్యాణ్‌ వచ్చి అబద్దం చెప్పి దాన్యలక్ష్మీని కిచెన్‌లోకి పంపిస్తాడు. వెనక నుంచి అంతా గమనిస్తున్న ప్రకాష్‌ మాత్రం కళ్యాణ్‌ దగ్గరకు వచ్చి నిలదీస్తాడు. కళ్యాణ్‌ మళ్లీ అబద్దం చెప్పి తప్పించుకుంటాడు.  తర్వాత కావ్య, రాజ్‌ కలిసి ఫంక్షన్‌కు వెళ్తారు. అక్కడ స్వప్న, రాహుల్‌ గురించి చాలా గొప్పగా చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!