Brahmamudi Serial Today Episode: రూంలో వర్క్‌ చేసుకుంటున్న రాహుల్‌ దగ్గరకు స్వప్న రొమాంటిక్‌ గా చూస్తూ వెళ్తుంది. దీంతో రాహుల్‌ ఈరోజు ఏమైనా స్పెషల్‌ ఉందా అని అడుగుతాడు.

Continues below advertisement

స్వప్న: మొగుడి ముందు అందంగా రెడీ కావడానికి కూడా టైం కావాలా..? మంచి మూడ్‌ ఉంటే సరిపోదా..?

రాహుల్‌: నువ్వు ఇంతలా సపోర్టు చేస్తావని తెలిసుంటే నేను ఎప్పుడో మారిపోయేవాణ్ని తెలుసా.?

Continues below advertisement

స్వప్న: కొంచెం లేటైనా మారాలని డిసైడ్‌ అయ్యావు అది చాలు నాకు

రాహుల్‌: డిసైడ్‌ అవ్వడం కాదు స్వప్న నేను నిజంగానే మారిపోయాను

స్వప్న: అది తెలుసు నాకు

రాహుల్‌: ఈ విషయంలో నీకే థాంక్స్‌ చెప్పాలి

స్వప్న: ఎందుకు రాహుల్‌..

రాహుల్‌: నేను మారాలనుకున్నప్పుడు ఇంట్లో ఎవ్వరూ నమ్మలేదు.. మొదట నన్ను నమ్మింది నువ్వే.. రాజ్‌, కావ్యను ఒప్పించి రాజ్‌ చేత ఈ కంపెనీ పెట్టించింది నువ్వే.. దానికి నీకు ఎన్నిసార్లు థాంక్స్‌ చెప్పినా సరిపోదు.. స్వప్న

స్వప్న: హలో శ్రీవారు మొగుడు పెళ్లాల మధ్య థాంక్స్‌ లు సారీలు ఉండకూడదు

రాహుల్‌: మరి ఏముండాలి

స్వప్న: నీకు తెలియదా..

రాహుల్‌: సారీ స్వప్న నేను కొంచెం టెన్షన్‌లో ఉన్నాను..

స్వప్న: ఎందుకు ఏమైంది రాహుల్‌

రాహుల్‌: నీ చేతుల మీదగా సెలెక్ట్‌ చేయించిన డిజైన్స్‌ అన్ని మ్యానుపాశ్చరింగ్‌ కు  పంపించేశాను కదా.?

స్వప్న: దానికి ఇప్పుడెందుకు ప్రాబ్లమ్‌

రాహుల్‌: ప్రాబ్లమ్‌ కాదు ఆ డిజైన్స్‌కు పబ్లిసిటీ కావాలి

స్వప్న: రాజ్‌ చేయించినట్టు సెలబ్రిటీల చేత పబ్లిసిటీ చేయించు

రాహుల్‌: నా కంపెనీ అంత పెద్ద కంపెనీ కాదు. అంత బడ్జెట్‌ నేను పెట్టలేను.. నువ్వే ఏదైనా మంచి ఐడియా ఇవ్వొచ్చు కదా..? నీకు ఎలాగూ మోడలింగ్‌ తెలుసు కదా..? ఆ ఫోటో షూట్‌ నువ్వే చేయోచ్చు కదా

స్వప్న: హలో నాకు పెళ్లై పోయింది. ఒక బిడ్డ కూడా ఉంది.

అయితే ఏం నువ్వు ఇప్పుడు అచ్చం ఒక మోడల్‌ లానే ఉన్నావు.. ఫ్లీజ్‌ నా కోసం మన కంపెనీ కోసం చేయవా.? అంటూ బలవంతంగా ఒప్పిస్తాడు రాహుల్‌. మరోవైపు రెస్టారెంట్‌లో ఉన్న రాజ్‌, కావ్యలకు మత్తు మందు ఇచ్చి  రౌడీలు కిడ్నాప్‌ చేసి తమ కారులో తీసుకెళ్తారు. ఇక రాహుల్‌ తన కంపెనీలో పెట్టుబడుల కోసం రాజ్‌ కంపెనీ క్లయింట్స్ ను కలిసి తన వైపు తిప్పుకుని అగ్రిమెంట్స్‌ చేయించుకుంటాడు.  తర్వాత స్వప్నను తీసుకెళ్లి యాడ్‌ షూటింగ్‌ చేయిస్తాడు. మరోవైపు కిడ్నాప్‌ అయిన రాజ్‌ స్పృహలోకి వచ్చి రౌడీలను తిడతారు.

రాజ్: రేయ్‌ ఏంట్రా ఇది

రౌడీ: మిమ్మల్ని కట్టేశాం

కావ్య: ఎందుకు కట్టేశారు

రౌడీ: కిడ్నాప్‌ చేసిన వాళ్లను కట్టేయాలమ్మా

రాజ్: మమ్మల్ని ఎందుకు కిడ్నాప్‌ చేశారురా

రౌడీ: మరి మేము పెన్‌ డ్రైవ్‌ అడిగితే మీరు ఇవ్వడం లేదు కదా..? పైగా నిన్న మమ్మల్ని కొట్టిన చోట కొట్టకుండా కొట్టేశారు

రాజ్‌: అరేయ్‌ అర్థం చేసుకోండిరా మా దగ్గర ఏ పెన్‌డ్రైవ్‌ లేదు.. ఆసలు ఆ పెన్‌డ్రైవ్‌ ఏంటో మాకు తెలియదురా

రౌడీ: ఆ మాట కాకుండా ఇంకే మాటైనా చెప్పు వింటాము కానీ మర్యాదగా పెన్‌డ్రైవ్‌ ఇవ్వండి.. మీకు గంట టైం ఇస్తున్నాను మా బాస్‌ వచ్చేలోగా ఆ పెన్‌ డ్రైవ్‌ మా చేతుల్లో ఉండాలి. లేదంటే చచ్చిపోతారు

అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతారు. మరోవైపు అప్పు, రేణుకకు తన కూతురు అంజలి బతికే ఉందని చెప్తుంది అలాగే రేణుకకు రేణుక భర్తకు ఏదైనా గొడవలు ఉన్నాయా..? అని అడుగుతుంది. రేణుక అలాంటివే లేవని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!