Brahmamudi Serial Today Episode: కనకం, కృష్ణమూర్తిలను తిడుతున్న రుద్రాణిపై ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. నువ్వు నీ కొడుకు క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసని తిడుతుంది. భర్తను వదిలేసిన నిన్ను ఇలాంటి శుభకార్యాలకు పిలవకూడదు. పొద్దునే లేచి నీలాంటి నీచమైన ముఖం చూస్తేనే అరిష్టం అని ఇందిరాదేవి కోప్పడుతుంది. మీ ఇద్దరూ కలిసి ఈ పెళ్లి చెడగొట్టారు అంటుంది. అపర్ణ కూడా రుద్రాణి, ధాన్యలక్ష్మీని తిడుతుంది. మరోవైపు అప్పు పెళ్లి ఆగిపోయిందని అనామికకు ఎవరో ఫోన్ చేసి చెప్తారు.
అనామిక: నీ పెళ్లి ఆగిపోయిందట.. పెళ్లి పెట్టుకుని ఇలా లేచిపోవడం సూపర్ సీన్
అప్పు: నా పెళ్లి సంగతి సరే నా నుంచి నిన్నెవరు కాపాడుతారు.
అనామిక: అసలు ఇక్కడి నుంచి నిన్ను ఎవరు కాపాడుతారు?
అని అనామిక అంటుంది. అప్పుడే డోర్ తెరుచుకుంటంది. కల్యాణ్ హీరోలా ఎంట్రీ ఇస్తాడు. కల్యాణ్‌ను చూసి అనామిక షాక్ అవుతుంది. కళ్యాణ్ రౌడీలను కొట్టి అప్పును తీసుకెళ్తుంటే అనామిక వార్నింగ్ ఇస్తుంది. అప్పుకు ప్రమాదం ఎటు నుంచి అయినా వస్తుంది. ఎలా కాపాడుకుంటావో చూస్తానని హెచ్చరిస్తుంది. మరోవైపు రుద్రాణి, ధాన్యలక్ష్మీతో నేను ఇంటికి వెళ్తాను అంటుంది.
ధాన్యలక్ష్మీ: నాకు తోడు ఉండకుండా వెళ్లిపోతావా రుద్రాణి..?
రుద్రాణి: నీకు వీళ్లందరూ తోడు ఉన్నారు. అయినా నువ్వు ఇక్కడ ఉండి ఏం లాభంలేదు. ఈపాటికి నీ కొడుకుకి అప్పుకు పెళ్లి అయిపోయి ఉంటుంది. ఇంటికెళ్లి దిష్టి తీసి హారతి ఇవ్వాలికదా! అవన్ని రెడీ చేసుకో
అని రుద్రాణి చెప్తుండగానే కళ్యాణ్, అప్పును తీసుకుని ఎంట్రీ ఇస్తాడు. అందరూ షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావ్ అత్త. అప్పు గురించి ఏం తెలుసు నీకు. పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి. లేదా నోరు మూసుకుని ఉండాలి అని కల్యాణ్ ఫైర్ అవుతాడు. ఏంటీ మా అమ్మని అంటున్నావ్. ఇక్కడ మాయమైన అప్పు నీతో ఎలా వచ్చింది అని రాహుల్ ప్రశ్నిస్తాడు. ధాన్యలక్ష్మీ కూడా అప్పు నీతో ఎలా వచ్చిందని అడుగుతుంది. అసలేం జరిగింది కళ్యాణ్ చెప్పరా అంటూ రాజ్ అడుగుతాడు.
కళ్యాణ్: అప్పును కిడ్నాప్ చేశారు. మత్తుమందు ఇచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఓ గదిలో బంధించారు.
కావ్య: కిడ్నాపా? ఎవరు చేశారు.?
కళ్యాణ్: ఇంకెవరు ఈవిడ ముద్దుల కోడలు అనామిక.
రుద్రాణి: అనామిక లేదు ఆవకాయ లేదు. జైలుకు వెళ్లిన అనామిక వచ్చి కిడ్నాప్ చేసిందంటే నమ్మాలా?
అని రుద్రాణి మాట్లాడుతుండగానే బంటి వచ్చి జరిగింది మొత్తం చెబుతాడు. ఈ పెళ్లి ఆగిపోవడానికి మా అమ్మా ఈ రుద్రాణి అత్తయ్యే కారణం అయ్యుంటారు అంటాడు కళ్యాణ్.
కళ్యాణ్: ఆంటీ ఇదిగోండి మీ కూతురు ఎలా వెళ్లిందో అలాగే వచ్చింది. లేచిపోలేదు.
కనకం: ఏవమ్మా ధాన్యలక్ష్మీ ఇప్పుడేం మాట్లడవు. రుద్రాణితో కలిసి నా కూతుళ్ల గురించి అన్నన్ని మాటలు అన్నావ్. పోయిన పెళ్లి కొడుకును తీసుకురాగలవా. మీరు దుగ్గిరాల కుటుంబం కాకుంటే ఏం చేసేదాన్నో నాకె తెలియదు. ఆడపుటుక పుట్టారు ఎందుకు?
కృష్ణమూర్తి: పెళ్లి ఆగిపోని. పెళ్లి కొడుకు వెళ్లిపోని. నా కూతురు క్షేమంగా వచ్చింది అది చాలు. దీనికి పెళ్లి జరగపోయినా పర్వాలేదు. నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను.
అనగానే అమ్మమ్మ గారు ఇప్పటిదాకా వాళ్లు ఇన్ని మాటలు అన్నారు. వాళ్లను ఏం చేయమంటారో చెప్పండి అని స్వప్న అంటుంది. ఏం లేదు. వాళ్లు చేసిన పనికి సిగ్గుపడుతున్నారు అని కావ్య అంటుంది. వీళ్లు చేసిన పనికి అప్పు పెళ్లి ఆగిపోయింది. ఇంత జరిగికా అప్పును ఎవరు పెళ్లి చేసుకుంటారు. వీళ్లు చేసిన దానివల్ల ఎవరు ముందుకొస్తారు. అప్పు జీవితాంతం ఇలా ఉండిపోవాల్సిందేనా అని కనకం బాధ పడుతుంది. ఇంతలో రాజ్ తాళిబొట్టు తీసుకొచ్చి అప్పును నా తమ్ముడు మనస్ఫూర్తిగా ప్రేమించాడు. ఎవరి మూలంగా అప్పుపై నిందలు పడ్డాయో వాడే తాళి కడతాడు. అనగానే అందరూ షాక్ అవుతారు. తాళి తీసుకుని అప్పు మెడలో కళ్యాణ్ కట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.