Brahmamudi Serial Today Episode:  రాజ్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కావ్య చెప్పగానే.. ప్రాక్టికల్‌ జోక్‌ చేయోద్దని ధాన్యలక్ష్మీ చెప్తుంది. జీవితం మీద జోకులు వేసుకోవడం కరెక్టు కాదంటుంది.

కావ్య: చిన్నత్తయ్యా నా మీద నేనెందుకు జోక్స్‌ వేసుకుంటాను. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు.

అపర్ణ:  ఎందుకు ఇష్టం లేదు

కావ్య: ఇష్టం లేదు అని చెప్తున్నాను కదా

ఇందిరాదేవి: అదే ఎందుకు ఇష్టం లేదు

కావ్య:  ఇష్ట లేదంటే ఇష్టం లేదు. అన్నింటికీ కారణాలు చెప్పాలా..? ఆయన గారు ఇష్ట పడితే నేను ఇష్ట పడాలా..? ఆయన పెళ్లి చేసుకుంటానంటే నేను తలదించుకుని తాళి కట్టించుకోవాలా.?

ఇందిరాదేవి:  అది కాదే..

రాజ్‌: నాన్నమ్మ ఒక్క నిమిషం. ఇది నాకు కళావతి గారికి సబంధించిన విషయం ఇందులో మీరెవ్వరూ జోక్యం చేసుకోకండి

అపర్ణ:  అది అలా మాట్లాడుతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావురా..?

రాజ్‌: అమ్మా ఫ్లీజ్‌ మీరు బలవంతం చేసి తనను ఒప్పించడం నాకు ఇష్టం లేదు. దయచేసి మీరు ఎవ్వరూ మాట్లాడకండి. కళావతి గారు. ఇది మీ లైఫ్‌ దీని గురించి డిసీజన్‌ తీసుకునే హక్కు మీకు మాత్రమే ఉంది. మీరు ఒప్పుకోకుండా నేను ఈ ఇంటికే రాను. అలాంటిది మీ జీవితంలోకి ఎందుకు వస్తాను. కానీ నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి చాలు. నేను మీ వెంట పడుతున్నా మీరు ఏమీ అనకపోతే మీక్కూడా నా మీద ఇష్టం ఉందేమో అనుకున్నాను. ఆఫీసులో మీ ఎండీ ప్లేస్‌లో నన్ను కూర్చోబెట్టేంత నమ్మకం ఉందంటే.. మీ మనసులో కూడా నాకు స్థానం దొరుకుతుంది అనుకున్నాను. మీ సంతోషాన్ని మీ బాధను నాతో పంచుకుంటే నేను మీ వాణ్ని కాబట్టే పంచుకుంటున్నారు అనుకున్నాను. ఇందులో నేను చేసిన తప్పేంటి..?

కావ్య:  అవును చేశాను. నేను కేవలం ఫ్రెండ్ అనే అవన్నీ చేశాను. ఫ్రెండ్స్‌ ను ఎవ్వరూ సాయం అడగరా..? మీరు అందరి లాంటి వారు కాదని మెచ్యూర్‌గా ఆలోచిస్తారని అనుకున్నాను. కానీ మీరు కూడా అందరిలాగే ఆలోచించారు. అసలు నాకు బుద్ది లేదు. ఎవరో ఏంటో తెలియకుండా దగ్గరకు రానిచ్చాను. అదే నేను చేసిన తప్పు. అయినా నా ఇష్టం ఏంటో తెలుసుకోకుండా నా ఫ్యామిలీ అందరి ముందు నిలబెట్టి.. నా పరువు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు..?

రాజ్: హక్కా ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నారండి మీరు. ఇది మీరు కాదు. నేను నమ్మను మీ మనసులో ఏదో ఉంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. మీరేంటో నాకు బాగా  తెలుసు. ఎందుకిలా మాట్లాడుతున్నారో నిజం చెప్పండి.

కావ్య: నేను ముందు నుంచి ఇలాగే ఉన్నాను. నన్ను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం మీ తప్పు. అసలు నాకు తెలియక అడుగుతాను. నేను మిమ్మల్ని నాతో తిరగమని చెప్పానా..? ఫోన్‌ చేశానా.? కలవమని అడిగానా..? పోనీ మిమ్మల్ని ప్రేమించినట్టు కనిపించానా..? మరి నేనేం చేశానని ఇవాళ వచ్చి మా వాళ్ల ముందు నన్ను చెడ్డదాన్ని చేస్తున్నారు. చూడండి వచ్చింది మీరు.. తిరిగింది మీరు.. సాయం చేస్తాను అని అడిగింది మీరు.  మీరే ఏదేదో ఊహించుకుని ఇప్పుడు దానికి బాధ్యురాలిని నేను అంటే ఎలా కుదురుతుంది. దానికి నేనెందుకు సమాధానం చెప్పాలి. ఏదో గతం గుర్తుకు లేదని అంటున్నారని జాలి పడి దగ్గరకు మిమ్మల్ని రానిచినందుకు నాకు బాగా బుద్ది చెప్పారండి

అపర్ణ కోపంగా కావ్యను  కొట్టబోతుంటే.. రాజ్‌ ఆపేస్తాడు.

కావ్య:  బాగుంది అత్తయ్య పరాయి వాళ్ల కోసం నన్ను కొడతావా… ఆయన్నే నెత్తిన పెట్టుకోండి.

అని ఏడుస్తూ కావ్య పైకి రూంలోకి వెళ్తుంది. తర్వాత రుద్రాణి, యామినికి ఫోన్‌ చేసి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. యామిని హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు స్వరాజ్‌ను రేవతి వాళ్లకు అప్పగిస్తుంది అప్పు. ఇంకోవైపు రాజ్‌ గార్డెన్‌లో కూర్చుని బాధపడుతుంటే అపర్ణ, ఇందిరాదేవి వచ్చి ఓదారుస్తారు. కావ్య రూంలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!