Brahmamudi Serial Today Episode: తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందన్న బాధతో రూంలో ఉన్న కావ్య దగ్గరకు అప్పు వస్తుంది. ఏమైందక్కా అక్కా ఇలా ఉన్నావేంటి అని అడుగుతూ చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కిట్‌ చూసి హ్యపీగా ఫీలవుతుంది.

Continues below advertisement


అప్పు: అక్కా ఇది నిజమా..?


కావ్య: అవును అప్పు నేను తల్లిని కాబోతున్నాను


అప్పు: ఏంటక్కా నువ్వు చెప్పేది అసలు నమ్మలేకపోతున్నాను అక్కా.. కంగ్రాట్స్‌ అక్కా.. కానీ ఇదంతా ఎప్పుడు జరిగింది. బావ నువ్వు ఎప్పుడు కలిశారు.


కావ్య:  అదే అప్పు రెండు నెలల ముందు మేము శ్రీశైలం వెళ్లే ముందు ఒక బూత్‌ బంగ్లాలో


అప్పు: ఇంత గుడ్‌ న్యూస్‌ చేతిలో పెట్టుకుని అంతలా కంగారు పడతావేంటి..? ఈ న్యూస్‌ ఇంట్లో అందరికీ చెప్పి సెలబ్రేట్‌ చేద్దాం పద


కావ్య: అప్పు ఇది సెలబ్రేట్‌ టైం కాదే


అప్పు: సెలబ్రేట్‌ చేసుకునే టైం కాకపోవడం ఏంటి అక్కా.. ఒక ఆడపిల్లకు మొదటిసారి తల్లి కావడం అంటే మామూలు విషయమా చెప్పు


కావ్య: కానీ ఈరోజు ఆయన నాకు ప్రపోజ్‌ చేయడానికి వస్తున్నారే..?


అని చెప్తుంది. ఇక రాజ్‌ హుషారుగా కారులో వస్తుంటాడు.


రాజ్‌: ఈ రోజు ఎలాగైనా సరే కళావతి గారికి నా మనసులో మాట చెప్పాల్సిందే..


కావ్య: అవతల ఆయన నాకు ప్రపోజ్‌ చేయడానికి హ్యాపీగా వస్తుంటారు. ఇవతల ఇలా నేను తల్లిని కాబోతున్న విషయం ఆయనకు తెలిస్తే దీనికి కారణం ఎవరు..? అని అడుగుతారు. అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అప్పు. దీనికి కారణం మీరే అని చెప్పాలా..? అసలు నేను చెప్పగలనా..? ఆయనకు నిజం తెలియాలంటే గతం గుర్తుకు రావాలి. గతం గుర్తు చేస్తే ప్రాబ్లమ్‌ అవుతుందని డాక్టర్‌ చెప్పారు


అప్పు: మరి ఇప్పుడు ఎలా అక్కా.. బావగారు ప్రపోజ్‌ చేశాక విషయం తెలిస్తే తను తప్పుగా అనుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఏం చేస్తావు మరి


కావ్య: అదే ఆలోచిస్తున్నాను అప్పు.. ఆయనను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. అలాగని నిజం చెప్పే సాహసం చేయలేను. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అప్పు


అప్పు: అక్కా బావగారు వచ్చే లోపు బాగా ఆలోచించి కరెక్టు డిసీజన్‌ తీసుకో


కావ్య: అప్పు దీని గురించి నేను ఆలోచిస్తాను కానీ ముందు నువ్వు రేవతి గారి అబ్బాయిని తీసుకుని వెళ్లు. అప్పు ఈ విషయం ఎవరీకి చెప్పకు


అప్పు: సరే అక్కా


అని అప్పు రేవతికి కొడుకుని తీసుకుని వెళ్తుంటే రాహుల్‌ వెనక ఫాలో అవుతుంటాడు. అది చూసిన అప్పు, కానిస్టేబుల్‌ శేషుకు ఫోన్‌ చేసి రాహుల్‌ను ఎలాగైనా అడ్డించి దారి మళ్లించాలని చెప్తుంది. అలాగేనని వెళ్లి కానిస్టేబుల్‌ వెళ్తాడు. రాహుల్‌ ను ఆపేసి కార్‌ చెక్‌ చేస్తారు. ఇంతలో అప్పు రూట్‌ మార్చేస్తుంది. రాజ్‌ ఇంట్లోకి రాగానే అందరూ హాల్లో కూర్చుని ఉంటారు.


రాజ్‌: నేను వచ్చేశా ఏంటి అందరూ నాకోసమే వెయిట్‌ చేస్తున్నారా..?


ఇందిరాదేవి: ఇంకొంచెం లేటుగా వచ్చుంటే మీ అమ్మ చెంప చెల్లుమనిపించేది కూడా


రాజ్‌: ఈ రోజు అన్నింటికీ తెరదించబోతున్నా.


అంటూ కావ్యను పిలుస్తాడు. బాధగా కావ్య కిందకు వస్తుంది. కావ్య రాగానే రాజ్‌ తనను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. కావ్య ఏడుస్తుంది. అందరూ పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. కావ్య అందరికి షాక్ ఇస్తుంది. రాజ్‌ ను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్తుంది. రుద్రాణి మాత్రం హ్యాపీగా ఫీలవుతుంది. ఎవరు ఎంత చెప్పినా కావ్య మాత్రం తనకు పెళ్లి ఇష్టం లేదని కరాకండిగా చెప్పేస్తుంది. రాజ్‌ ఎమోషనల్‌ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!