Brahmamudi Serial Today Episode: వరలక్ష్మీ వ్రతం కోసం ఇంటికి వచ్చిన అప్పుకు చీర కట్టుకోవాల్సిందేనని చెప్తుంది స్వప్న. ముగ్గురు అక్కాచెల్లెల మధ్య ఎమోషనల్ డ్రామా నడుస్తుంది. తర్వాత కావ్య బయటకు వచ్చి ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పు, కళ్యాణ్ కు పద్దతిగా పెళ్లి జరిగితే సంతోషంగా ఈ ఇంటిలో తన చెల్లెలు కాపురం చేసేదని అనుకుంటుంది. కావ్య కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అపర్ణ కంగారు పడుతుంది. ఎప్పటికైనా కళ్యాణ్, అప్పులు ఇంట్లో అడుగుపెట్టేలా చేసేది నువ్వే అని కావ్యకు మనోధైర్యాన్ని ఇస్తుంది అపర్ణ. మరోవైపు ఇందిరాదేవితో కళ్యాణ్ బాధపడతాడు.
కళ్యాణ్: అమ్మ నా కోసం మాత్రమే షాపింగ్ చేసి అప్పును మరిచిపోయింది నాన్నమ్మ. తనకు కోడలు ఉందని కూడా గుర్తించడం లేదు.
ఇందిరాదేవి: అదేం లేదు కళ్యాన్ మీ మారిపోయింది. కాకపోతే కాస్త సమయం తీసుకుని అప్పును కూడా కోడలిగా అంగీకరిస్తుంది చూడు.
కళ్యాణ్: నిజంగా మారిపోయింది అయితే చిన్న చీర విషయానికే అప్పును అంతగా అవమానించేది కాదు నాన్నమ్మ.
అంటూ కళ్యాణ్, ఇందిరాదేవితో బాధపడుతుంటే ఇంతలో అప్పు చీర కట్టుకుని కిందకు వస్తుంది. అప్పును చూసిన ధాన్యలక్ష్మీ మనసులో తిట్టుకుంటుంది. అప్పు అసలు ఆడదానిలా కనిపించడం లేదని ఫీలవుతుంది. ఎలాగైనా అప్పు ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేయాలని అనుకుంటుంది. అయితే తననే చూస్తున్న ధాన్యలక్ష్మీని చూసి అప్పు కంగారు పడుతుంది. వారిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదని అప్పుకు ధైర్యాన్నిస్తారు ఇద్దరు అక్కలు.
ఇంట్లో పండగ వాతావరణం ఉండటంతో ఇందిరాదేవి, అపర్ణ చాలా హ్యాపీగా ఉంటారు. ఎప్పుడూ ఇలాగే ఉంటే బాగుండు అని మాట్లాడుకుంటారు. అయితే అందరం ఒకే చోట ఉంటే ఈ సంతోషం ఇలాగే ఉంటుందని కళ్యాణ్‌ను కన్వీన్స్ చేయబోతాడు రాజ్. పూజ సామన్ల కోసం కిచెన్‌లోకి వెళ్తుంది అప్పు.
అప్పు: అత్తయ్యా.. పూజ సామాన్లు తీసుకురమ్మంటున్నారు. ఎక్కడున్నాయి..
ధాన్యలక్ష్మీ: అత్తయ్య ఎవరు నీకు. పూజకు వచ్చావు పూజ చూసుకుని వెళ్లిపో.. అంతే కానీ వరసలు పెట్టి పిలిచి దగ్గరవ్వాలనుకోకు.
అంటూ ధాన్యలక్ష్మీ, అప్పును తిడుతుంది. తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువలకు అప్పు జ్యూస్ ఇస్తుంది. జ్యూస్ వారి మీద పడేలా రుద్రాణి చేస్తుంది. దీంతో ధాన్యలక్ష్మీ మరోసారి అప్పును తిడుతుంది.
ధాన్యలక్ష్మీ: ఇంటికి వచ్చిన ముత్తైదువలను ఎలా చూసుకోవాలో తెలియదా... బొత్తిగా అడివి మనిషిలా ఉన్నావు.
ముత్తైదువ: మీ ఇంటికి ఉన్న పేరు ను నీ కోడలు వీధిన పడేసేలా కనిపిస్తుందని ధాన్యలక్ష్మి.
ధాన్యలక్ష్మీ: అవును చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. మా కళ్యాణ్ కూడా తొందరపడి అప్పును పెళ్లిచేసుకొని మా కొంప ముంచాడు.
ఇందిరాదేవి: ధాన్యలక్ష్మీ ఏం మాట్లాడుతున్నావు. అసలు ఇంటి గుట్టును పదిమందికి ప్రసాదంలా పంచుతున్నది నువ్వు. ఆవిడ గ్లాస్ సరిగ్గా పట్టుకోలేదు. ఇందులో నీ తప్పేం లేదులే అప్పు.
అంటూ ఇందిరాదేవి అప్పుకు సపోర్టుగా మాట్లాడుతుంది. మీ అత్తయ్య కళ్లకు పొరలు కప్పి ఉండటంతో అది గుర్తించలేదని తిడుతుంది. ఆ తర్వాత వ్రతంలో ఎవరి కొడుకు, కోడలు వెనుకు వాళ్ల అత్తగారు కూర్చోవాలని పంతులు చెబుతారు. అయితే అప్పు, కళ్యాణ్ వెనుక కూర్చోవడానికి ధాన్యలక్ష్మీ అంగీకరించదు. దీంతో ప్రకాశం వార్నింగ్ ఇవ్వడంతో ధాన్యలక్ష్మీ కూర్చుంటుంది.
వ్రతం పూర్తి అయిన తర్వాత అతిథులందరికీ అప్పు భోజనం వడ్డిస్తుంటే ధాన్యలక్ష్మీ అక్కడ కూడా అప్పును తిడుతుంది. అతిథులకు భోజనం పెడుతున్నావా? పిండం పెడుతున్నావా? ఇంత చిన్న విషయం కూడా తెలియదా అంటూ ప్రశ్నించడంతో అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: షూటింగ్‌లో హీరో రవితేజాకు గాయం - వెంటనే శస్త్ర చికిత్స, డాక్టర్లు ఏం చెప్పారంటే?