Brahmamudi Serial Today Episode: వ్రతం అయిపోయాక రాజ్‌, కావ్యను గార్డెన్‌లోకి తీసుకెళ్తాడు. నేను అక్షింతలు వేస్తేనే ఇంట్లో వాళ్లు హ్యాపీగా ఉన్నారు. ఇక మనం పెళ్లి చేసుకుంటే వాళ్లు ఎంత సంతోషపడతారో కదా..? అంటూ చెప్పగానే కావ్య రాజ్‌ను తిడుతుంది.

కావ్య: ఇంకోసారి పెళ్లి అంటే బాగుండదు. అలాగైతే ఇంటికి రావొద్దు.. ఎంత చెప్పినా ఇంకా వస్తానంటే నేనే ఎటైనా వెళ్లిపోతాను.

రాజ్‌:  మీరు ఎక్కడికి వెళ్లొద్దు నేనే వెళ్లిపోతాను.

రాజ్‌, స్వరాజ్ ను తీసుకుని వెళ్లిపోతాడు. కావ్య ఎమోషనల్‌ అవుతుంది. లోపల కనకం హ్యాపీగా ఫీలవుతుంది.

కనకం: చూశారా వదిన గారు అల్లుడి గారితో అక్షింతలు ఎలా వేయించానో..?

ఇందిరాదేవి: చూశాములే చేతితో ఎలా వేయించావో

కనకం:  అబ్బా కావ్యకు తన భర్త చేత అక్షింతలు వేయించామా లేదా..? అన్నదే చూడాల్సింది. ఎలా వేయించామా అన్నది కాదు.. చూశారా మనం అనుకున్నట్టుగానే వరలక్ష్మీ వ్రతం పూర్తి చేశాము.

రుద్రాణి రాహుల్‌ ను తిడుతుంది.

రాహుల్:  నన్నేం చేయమంటావు అమ్మ టాబ్లెట్‌ పని చేయకపోతే నేనేం చేయాలి.

అప్పు కళ్లు తిరిగి కింద పడిపోతుంది.

 రాహుల్‌: చూశామా మమ్మీ టాబ్లెట్‌ పని చేసింది

రుద్రాణి: అవునురా..? దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు  ఆ రాజ్‌ ఉండగా పని చేసి ఉంటే బాగుండేది.

స్వప్న డాక్టర్ కు ఫోన్‌ చేస్తుంది. డాక్టర్‌ వస్తుంది.

అప్పు: ఏమైంది డాక్టర్‌ నాకు అసలు ఏమీ అర్థం కాలేదు.

డాక్టర్‌: నీకు ఫుడ్‌ ఇన్ఫెక్షన్‌ అయింది. ఉదయం ఏం తిన్నావు..

అప్పు: ఇడ్లీ తప్పా ఏమీ తినలేదు డాక్టర్‌.

డాక్టర్‌: మరేమైనా తీసుకున్నావా..?

అప్పు: రెగ్యులర్‌గా వాడే టాబ్లెట్‌ వాడాను.

డాక్టర్‌ టాబ్లెట్‌ చూసి ఎక్స్‌ఫైర్‌ అయిపోయిన టాబ్లెట్‌ తీసుకున్నావు దీని వల్లే ఇలా జరిగింది. ఇంజక్షన్‌ ఇచ్చాను కదా పర్వాలేదులే అంటూ బయటకు వెళ్తుంది. అప్పు వేసుకున్న టాబ్లెట్‌ వల్లే ఇలా జరిగిందని విషయం చెప్పి వెళ్లిపోతుంది డాక్టర్‌.

రుద్రాణి: ఏంటి కావ్య ఇది.. చూసుకోవాలి కదా..? ఇలా చేశావేంటి..?

అపర్ణ: టాబ్లెట్‌ వేసుకుంది అప్పు అయితే కావ్యను ఎందుకు నిలదీస్తున్నావు.

రుద్రాణి: ఎందుకంటే  ఆ టాబ్లెట్‌ ఇచ్చింది కావ్య కాబట్టి. ఏంటి కావ్య నేను చెప్పింది నిజమే కదా..? మార్నింగ్‌ అప్పుకు ఆ టాబ్లెట్‌ ఇచ్చింది నువ్వే కదా..?

కావ్య: అవును ఆ టాబ్లెట్‌ ఇచ్చింది నేనే కానీ..?

ధాన్యలక్ష్మీ: ఇంకా కానీ అంటూ మాట్లాడుతున్నావేంటి..?  అసలు ఏం చేయాలి అనుకుంటున్నావు నువ్వు.. నటించకు నీ మనసులో ఏముందో తెలుసుకోలేనంత అమాయకురాలిని ఏమీ కాదు నేను.

రుద్రాణి: తనను అని ప్రయోజనం ఏముంది ధాన్యలక్ష్మీ నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను. నీ కోడలిని జాగ్రత్తగా చూసుకోవాలి అని కానీ నువ్వే వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు ఏమైందో

ధాన్యలక్ష్మీ:  ఈ ఇంట్లో ఎవ్వరిని నమ్మినా నమ్మకపోయినా నిన్ను నమ్మాను. కానీ మనసులో ఇంత కుట్ర పెట్టుకుని నా కోడలి కడుపును పోగొట్టాలని చూస్తావు అనుకోలేదు.

అపర్ణ: ధాన్యలక్ష్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు.. కావ్య అలా చేస్తుందని అసలు నువ్వు ఎలా అనగలుగుతున్నావు.. తను ఏంటో నీకు తెలియదా..? పైగా తన చెల్లెలి కడుపును పోగొట్టాలని ఎందుకు  అనుకుంటుంది.

ధాన్యలక్ష్మీ: ఎందుకంటే.. తను తల్లి కాలేకపోయింది కాబట్టి అక్కా..?    ఈ ఇంటికి కోడలిగా మొదట అడుగుపెట్టింది తనే కాబట్టి తనే మొదటి వారసుడిని ఇవ్వాలని ఎన్నో  కలలు కనింది. కానీ రాజ్‌ తో గొడవలు పడటం వల్ల అది జరగలేకపోయింది. ఇప్పుడు తనకు దక్కని అదృష్టం అప్పుకు దక్కిందని ఈర్షతో ఈ పని చేసింది. నా మాట నిజం కాదని తనను చెప్పమనండి..

అపర్ణ: నోటికి ఎంత మాటొస్తే అంత మాట అనేయడమేనా..? అసలు తను

అంటూ నిజం చెప్తుంటే.. కావ్య ఆపేస్తుంది. ధాన్యలక్ష్మీ కావ్యను తిడుతుంది. దీంతో కనకం నిజం చెప్తుంది. ధాన్యలక్ష్మీ బాధపడుతుంది. కావ్యకు సారీ చెప్తానని పైకి వెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!