Brahmamudi Serial Today Episode:  కావ్యను పూజలో కూర్చోనివ్వదు రుద్రాణి. దీంతో కావ్య మా ఆయన ఇక్కడే ఉన్నారు నేనే వెళ్లి తీసుకొస్తాను అంటూ బయటకు వెళ్లి రాజ్‌ ఫోటో తీసుకుని వస్తుంది. అందరూ షాక్‌ అవుతారు.

కావ్య: ఇప్పుడు వెళ్లి నేను సీతారాముల కళ్యాణం జరిపించవచ్చు కదా..? మీకేం అభ్యంతరం లేదు కదా

 రుద్రాణి:  వాటే విజన్‌, వాటే టాలెంట్‌.. ఫ్యూజులు ఎగిరిపోయాయి నాకు. ఇదేమైనా ఇల్లు అనుకుంటుంన్నావా..? ఇది గుడి అమ్మా నీ పిచ్చితో వెర్రితో స్వామి వారిని అవమానించకు.. దంపతులు కూర్చోవాలి కానీ ఇలా ఫోటోలు ఫ్రేములు పక్కన పెట్టుకుని కూర్చుంటాను అంటే  అది కుదరదు. పంతులు గారు మీరైనా చెప్పండి. మీరైనా ఈ మూర్ఖురాలికి బ్రెయిన్‌ వాష్‌ చేయండి.

 కావ్య:  ఒక్క రోజు కూడా దేవుడికి పూజ చేసి పువ్వు పెట్టని మీరు మన సంప్రదాయాల గురించి మాట్లాడతున్నారా..? రుద్రాని గారు.. సాక్ష్యాత్తు ఆ శ్రీరామచంద్రుడే కాంచన సీతను పక్కన కూర్చోబెట్టుకుని యజ్ఞం చేశాడన్న విషయం మీకు తెలుసా..?

పంతులు: అవునమ్మా.. ఏదైనా మనం కల్పింకున్నదే.. ఆవిడ చేసేది కరెక్టే..

కావ్య: రుద్రాణి గారు పూజారి గారు ఏం చెప్పారో అర్తం అయిందా..?

అప్పు: ఇంకే మాట్లాడతారు అక్కా ఈవిడకు ఇప్పుడు ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి.

ఇంద్రాదేవి: కావ్య చేత రోజూ అక్షింతలు వేయించుకోకపోతే రుద్రాణికి పూట గడవదేమో

అంటూ తిట్టగానే రుద్రాణి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఇంతలో పూజ దగ్గరకు యామిని, రాజ్‌ వాళ్లు వస్తారు. అక్కడి జనాల్ని చూసి యామిని బాధపడుతుంది.

యామిని: చూశావా మమ్మీ జనాలు అందరూ వచ్చేశారు. ఇప్పుడు మనం ఈ చివరి వరుసలో కూర్చోవాలి. ఎంత త్వరగా రావాలని ట్రై చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

 రాజ్:  ఎక్కడ కూర్చుంటే ఏమిటి యామిని

 యామిని: అలా అంటావేంటి బావ.. ఆ సీతారాముల కళ్యాణాన్ని దగ్గర నుంచి చూడాలని ఆశ పడ్డాను. ఇప్పుడు సంబంధం లేదన్నట్టుగా దూరంగా కూర్చోవాల్సి వస్తుంది.

 రాజ్‌:  ఇంత చిన్న విషయాన్ని ఎందుకు అంత గొడవ చేస్తావు. ఎక్కడ కూర్చున్న దేవుడు అందరినీ సమానంగానే చూస్తాడు. లేటుగా వచ్చారని కక్ష్య గడతారా ఏంటి..?

 యామిని:  అలా కాదు బావ నేను ఏదైనా అనుకుంటే అది నాకు దక్కాలి.

 రాజ్‌: అలా అనుకుంటే ఉన్నది కూడా దక్కకుండా పోతుంది. ఇక్కడే కూర్చుందాం

అని చెప్పగానే అందరూ అక్కడే కూర్చుంటారు. ఇంతలో రాజ్‌ కావ్యకు ఫోన్‌ చేయాలని..  ఒక చిన్న ఫోన్‌ మాట్లాడి వస్తానని చెప్పి బయటకు వెళ్తాడు. బయటకు వచ్చిన రాజ్‌ను ప్రకాష్‌ చూసి షాక్‌ అవుతాడు. రాజ్ ను ఫాలో అవుతాడు. కానీ రాజ్‌ ప్రకాష్‌కు దొరకడు. ఆదే విషయం అందరికీ చెప్పాలనుకుంటాడు ప్రకాష్‌. కానీ మర్చిపోతాడు. మరోవైపు రాజ్‌, కావ్యకు ఫోన్‌ చేస్తాడు. కావ్య తాను పూజలో ఉన్నానని తర్వాత చేస్తానని కాల్ కట్‌ చేస్తుంది. రాజ్ లోపలికి రావడం చూస్తుంది. ఎవరైనా చూస్తే ఎలా అనుకుంటూ కంగారు పడుతుంది.

  బయటకు వెళ్లిన రుద్రాణి రాజ్‌ను చూసి షాక్‌ అవుతుంది. పంతులు దగ్గరకు వెళ్లి మైకు తీసుకుని రాజ్‌ ఇక్కడే ఉన్నాడని చెప్పి వెనక్కి తిరిగి చూడండి రాజ్‌ కనిపిస్తాడు అంటుంది. అందరూ చూడగానే రాజ్‌ కనిపిస్తాడు. అందరూ రాజ్ దగ్గరకు వెళ్లి ఎమోషనల్‌ అవుతారు. బాధపడతారు. రాజ్‌ మాత్రం ఎవరండి మీరు అని అడుగుతాడు. యామిని కూడా ఈయన మా బావ రామ్‌.. మీరనుకున్నట్టు రాజ్‌ కాదు అని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!