Brahmamudi Serial Today Episode: కావ్యను పిచ్చి దాన్ని చేయాలని చూస్తున్న రుద్రాణినే పిచ్చి దాన్ని చేయాలని అప్పు, స్వప్న ప్లాన్ చేస్తారు. అందుకోసం డైనింగ్ టేబుల్ మీద పచ్చి మాంసం, కూరగాయలు పెట్టి.. నోరూరించే కూరలు బాగున్నాయి అంటూ నాటకం ఆడతారు.
రుద్రాణి: కర్రీలు చేయకుండా ఇలా పచ్చిగా పెట్టారేంటి..?
స్వప్న: ఇంత మంచి కూరలు ఉండగా పచ్చివి ఉన్నాయంటావేంటి.. అత్తా..? నీకేమైనా పిచ్చి పట్టిందా..?
రుద్రాణి: ఏయ్ ఏం మాట్లాడుతున్నారు అక్కడున్నవి పచ్చివేగా..?
అప్పు: అయ్యో రుద్రాణి గారు అందరినీ పిచ్చోళ్లను చేయాలనే పిచ్చితో మీకు పిచ్చి బాగా ముదిరినట్టు ఉంది.
స్వప్న: అత్తగారు మిమ్మల్ని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. మా ఆయన ఎక్కడికి వెళ్లారో ఏంటో..
రుద్రాణి కోపంగా అక్కడి నుంచి హాల్లోకి వెళ్తుంది.
రుద్రాణి: చిన్నన్నయ్యా, ధాన్యలక్ష్మీ మీరు ఇటు రండి
ఇద్దరినీ తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది.
రుద్రాణి: వీళ్లిద్దరూ కలిసి నన్ను వెధవను చేయాలని చూస్తున్నారు
ప్రకాష్: నిన్ను ప్రత్యేకంగా చేయాలా..? పది నిమిషాలు నీతో ఎవరు మాట్లాడినా..? అర్థం అయిపోతుంది కదా.. సరే విషయం ఏంటో చెప్పు
స్వప్న: ఇక్కడ చికెన్, ఫిష్, బంగాళాదుంప మంచి కర్రీస్ చేస్తే ఈవిడ గారి కళ్లకు పచ్చిగా కనిపిస్తున్నాయంట..?
ధాన్యలక్ష్మీ: ఈ మధ్య రుద్రాణికి మైండ్ సరిగ్గా పనిచేయడం లేదులే
రుద్రాణి: ధాన్యలక్ష్మీ నువ్వు కూడా నన్నే అనుమానిస్తున్నావా..? కావాలంటే మీరే చూడండి.. పచ్చి మాంసం, పచ్చి కూరలు పెట్టి ప్రై పులుసు అంటూ మాట్లాడుతున్నారు
వెంటనే ప్రకాష్, ధాన్యలక్ష్మీ చూసి షాక్ అవుతారు. కావ్యతో పాటు మమ్మల్ని పిచ్చోళ్లను చేయాలని చూస్తున్నావా ఏంటి అంటూ రుద్రాణిని తిట్టి వెళ్లిపోతారు. తర్వాత కిచెన్‌లోకి వచ్చిన కావ్యకు రాజ్ ఫోన్ చేస్తాడు. అప్పుడే అపర్ణ వస్తుంది. అపర్ణ ఉండగా ఫోన్ మాట్లాడటానికి కావ్య ఇబ్బంది పడుతుంది. రాజ్‌ను శ్రుతి, రమ్య అంటూ పిలుస్తుంది. సిగ్నల్ రావడం లేదని పైకి వెళ్తుంది.
రాజ్: హలో కళావతి గారు నేను రమ్యను కాదండి రామ్‌ను మాట్లాడుతున్నాను.. అబ్బాయిని
కావ్య: అయ్యో తెలుసండి..
రాజ్: మరీ ఇందాకటి నుంచి శ్రుతి, రమ్య అంటూ అమ్మాయిల పేర్లతో పిలుస్తారేంటండి
కావ్య: నేను కూడా ఒక అమ్మాయినే కదండి. ఇలా అబ్బాయితే మాట్లాడుతున్నాను అని తెలిస్తే మా ఇంట్లో వాళ్లు ఏమనుకుంటారో చెప్పండి.
రాజ్: సారీ నేను అది ఆలోచించలేకపోయాను
కావ్య: ఏలా ఆలోచిస్తారు మీరు అబ్బాయి కదా..? మా అమ్మాయిలా ఒక్కరోజు ఉంటే మా కష్టాలు తెలుస్తాయి.
రాజ్: చెప్తే నేను అర్థం చేసుకుంటాను
కావ్య: సరే ముందు నన్ను ఎందుకు గుర్తు చేసుకున్నారో చెప్పండి
రాజ్: హెడేక్ అన్నారు కదా ఎలా ఉందో తెలుసుకుందామని కాల్ చేశాను.
కావ్య: నాకు వచ్చింది హర్ట్ స్ట్రోక్ కాదండి.. హెడేక్ అంతే కొంపదీసి ఇప్పుడొచ్చి నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్తారా ఏంటి..?
రాజ్: అంత లేదులే కానీ నా దగ్గర మంచి చిట్కా ఉంది అది ఫాలో అవండి హెడేక్ తగ్గిపోతుంది.
అని రాజ్ చెప్పగానే సరే అంటుంది కావ్య. రాజ్ చెప్పినట్టే చేస్తూ.. రాజ్ వచ్చి తన తలకు మసాజ్ చేసినట్టు ఫీలవుతుంది. మరోవైపు టీనా కోసం బయటకు వెళ్లిన రాహుల్‌ను ఇంటికి రప్పిస్తుంది స్వప్న. రాగానే చీపురు తీసుకుని పిచ్చ కొట్టుడు కొడుతుంది. తర్వాత రుద్రాణి వచ్చి రాహుల్‌ను ఏమైందని అడుగుతుంది. బయటకు చెప్పుకోలేక రాహుల్ బాధపడుతూ నీకేమైంది మామ్ అంటాడు. రుద్రాణి కూడా బయటకు చెప్పుకోలేక బాధపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!