Brahmamudi Serial Today Episode:  రాజ్‌ రాగానే కాఫీ షాపు నుంచి కావ్య వెళ్లిపోతుంది. ఎందుకు వెళ్తున్నావు అంటూ రాజ్‌ అడగ్గానే.. ఏం లేదని చెప్పి కావ్య వెళ్లిపోతుంది. ఇంతలో యామిని వస్తుంది.   

యామిని:  ఏంటి బావ ఇక్కడేం చేస్తున్నావు

 రాజ్‌: నీ కోసమే చూస్తున్నాను

 యామిని: అబ్బా చా నిజమేనా..?

రాజ్‌: నిజంగా నీ కోసమే చూస్తున్నాను

యామిని:  నాకు తెలుసు బావ నువ్వు నా కోసమే చూస్తున్నావని..జస్ట్‌ కిడ్డింగ్‌.. అయినా చెప్పకుండా వచ్చేశావేంటి..? పిలిస్తే నేను కూడా వచ్చేదాన్ని కదా..?

రాజ్‌: అంటే పొద్దునే నిన్ను డిస్టర్బ్‌ చేయడం ఎందుకని వచ్చేశా

యామిని: కాఫీ తాగుదాం దా బావ..

రాజ్‌: చెప్పాను కదా నేను తాగేశాను. నువ్వు తాగి ఇంటికి వచ్చేసెయ్‌

యామిని: కాఫీ నాకు కూడా ఏమీ వద్దులే ఇంటికి వెళ్దాం పద బావ.

అనగానే ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. మరోవైపు యామిని గురించి ఆమె ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ గురించి ఎంక్వైరీ చేయిస్తుంది అప్పు. ఎంక్వైరీ చేసిన కానిస్టేబుల్‌ కొన్ని వివరాలు చెప్తాడు. ఇంకా పూర్తి వివరాలు కావాలని కానిస్టేబుల్‌కు చెప్తుంది అప్పు. మరోవైపు అపర్ణ జ్యూస్‌ తాగుతుంది.

ఇంద్రాదేవి: నిన్నిలా చూస్తుంటే.. నాకు చాలా సంతోషంగా ఉంది. కనీసం ఫ్రూట్స్‌ అయినా తినడం మొదలు పెట్టావు

 అపర్ణ:  నాకు మాత్రం కావ్య ధైర్యం ఇచ్చింది అత్తయ్య.  తన మాటలు తన నమ్మకం చూస్తుంటే. ఎక్కడో చిన్న ఆశ మొదలైంది.

రుద్రాణి: నేడే చూడండి.. మీ అభిమాన నటి నట విన్యాసం. దుగ్గిరాల ఇంటి కోడలి విశ్వరూపం. ఆలసించిన ఆశాభంగం.. మంచి తరుణం మించినా దొరకదు

స్వప్న: అబ్బా అత్తా ఫర్‌పెక్ట్‌గా మాట్లాడుతున్నావు అత్తా.. నీకు కరెక్టు ప్రొఫెషన్‌ దొరికింది. పనిలో పనిగా మన కంపెనీ పోస్టర్లు కూడా ఒక నాలుగు ఇస్తాను వెళ్లి గోడలకు అతికించి ప్రచారం చేసి వచ్చేయ్‌ డబ్బులకు డబ్బులు వస్తాయి. మన కంపెనీకి ప్రచారం వస్తుంది

రుద్రాణి: పోస్టర్లు గోడకు అతికిస్తే ఏమోస్తుందే..అదే  నీ చెల్లెలు నటించిన ఈ చిత్రాన్ని థియేటర్‌లో ఆడిస్తే దాని పెర్మామెన్స్‌కు వంద రోజులు గ్యారంటీగా ఆడుతుంది.

ఇంద్రాదేవి: ఏంటా వెర్రి వాగుడు. నా మనవరాలు నటించడం ఏంటి..?

 రుద్రాణి:  వెర్రి వాగుడు నాది కాదమ్మా నీ మనవరాలిది. ఏంటి ఏవ్వరికీ నమ్మకం కలగడం లేదా..? పోనీ వీడియో చూస్తే నమ్ముతారా..? మొబైల్‌ లో చిన్నగా కనిపిస్తుంది. బిగ్ స్క్రీన్‌ కనెక్ట్ చేస్తాను. చూసి తరిండండి.

కావ్య వీడియో చూసి అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో కావ్య వస్తుంది.

రుద్రాణి:  ఓ మన హీరోయిన్‌ కూడా వచ్చింది. నీ గురించి నీ పెర్మామెన్స్‌ గురించే మాట్లాడుతున్నాం కావ్య. ఇప్పుడు వాళ్లు రివ్యూ ఏమిస్తారో నీ యాక్టింగ్‌ కు ఎన్ని స్టార్స్‌ ఇస్తారో తెలుసుకుందామా..? ఏంటి వదిన ఏం మాట్లాడావు. తన నమ్మకాన్ని చూసి మీలో ధైర్యం వచ్చిందా..? మరి ఈ వీడియో చూసి ఏమనిపించింది. నిన్నటి వరకు అందరూ ఏమన్నారు కావ్యను నేను టార్చర్ పెడుతున్నానా..? ఇప్పుడు ఎవరు ఏంటో అందరికీ బాగా అర్థం అయిందా..?

కావ్య: రుద్రాణి గారు నేను ఒక్కదాన్నే మాట్లాడుకున్నాను అని ఎలా అనుకుంటారు.  నేను ఫోన్‌ మాట్లాడాను కదా..? ఆ విషయం మీకు తెలుసా..? నా చెవిలో బ్లూటూత్‌ ఉంది చూడండి. నేను క్లయింట్స్‌ తో ఫోన్‌ మాట్లాడుతుంటే.. వీడియో తీసి నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకున్నారు. అసలు నన్ను ఫాలో అవ్వడానికి మీరెవరండి.  ఇంకొక్కసారి నన్ను ఇలా ఫాలో చేస్తే ఊరుకోను.

అని కావ్య కోపంగా రుద్రాణికి వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది.  అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు ఇంటికి వెళ్లిన రాజ్‌ కూడా కోపంగా యామినికి వార్నింగ్‌ ఇస్తాడు. తన ప్రతి విషయంలో కలగజేసుకోవద్దని చెప్తాడు. దీంతో యామనిని బాధపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!