Brahmamudi Serial Today Episode:  ఇంటికి వచ్చిన రాజ్‌ను చూసి కావ్య కంగారు పడుతుంది. మా ఇంటికే కరెక్టుగా ఎలా రాగలిగారు అని అడుగుతుంది. ఏమోనండి నాకు తెలియకుండానే నేను ఈ ఇంటికి వచ్చాను తీరా ఇక్కడ చూస్తే మీరున్నారు అని చెప్తాడు.

కావ్య: అదెలా సాధ్యం..

రాజ్‌: నేను మిమ్మల్ని ఇంతకముందు చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పాను కదా ఈ ఇంటిని చూస్తే కూడా సేమ్‌ ఫీలింగ్‌ వస్తుందండి. ఇంతకముందు ఈ ఇంటికి  నాకు ఏదో బంధం ఉన్నట్టు అనిపించింది. బహుశా అందుకేనేమో నా సిక్త్‌ సెన్స్‌ నన్నుఇక్కడకు తీసుకొచ్చింది. అయినా మీరేంటండి ఇంటికి వచ్చిన గెస్ట్ ను ఇలా గుమ్మం దగ్గరే నిలబెట్టి మాట్లాడుతున్నారు.

కావ్య రాజ్‌ను లోపలికి తీసుకెళ్తుంది. రాజ్‌.. కావ్య కోసం గిఫ్ట్‌ ఇస్తాడు.

కావ్య: ఓ ఇది ఇవ్వడానికే వచ్చారా..? ఇచ్చి వెళ్లిపోతారా..?

రాజ్‌: ఏంటండి ఇంటికి వచ్చిన గెస్ట్‌ కు కనీసం కాఫీ అయినా ఇవ్వరా..?

కావ్య: పాలు లేవండి..

రాజ్‌: అయితే జ్యూస్‌ అయినా ఇస్తారా..? కనీసం మంచినీళ్లైనా ఇవ్వండి

కావ్య:  జ్యూస్‌ కావాలంట (గట్టిగా అరుస్తుంది.)

అపర్ణ:  అయ్యో జ్యూస్‌ అడుగుతున్నాడంటే భోజనం కూడా ఇక్కడే చేస్తాడేమో ( మనసులో అనుకుంటుంది)

రుద్రాణి: అదేంటి కావ్య మళ్లీ జ్యూస్‌ అని అడుగుతుందేంటి

అప్పు:  అదేం లేదు మనకు ఏమైనా జ్యూస్ కావాలా..? అని అడుగుతుంది. ఇందాకా మీకు ఎంత వరకు చెప్పాను

రాహుల్‌:  మాకు తెలిసిందే చెప్తూ మమ్మల్ని ఇరిటేట్‌ చేస్తున్నావా..?

స్వప్న: ఏంటి అప్పు అంతా ఏదేదో మాట్లాడుతున్నావు. నేను పాప దగ్గరకు వెళ్తాను.

అప్పు: అయ్యో ఉండు అక్కా మొత్తం వినకుండా వెళ్తావా..?

ఇందిరాదేవి: అయ్యో అపర్ణ నాకు ఇక్కడ ఉక్కపోస్తుంది. హాల్లోకి వెళ్దాం పద

కావ్య: మీరు ఒక్కరే హాల్లో ఉంటే బోరు వస్తుంది కదా నాతో కిచెన్‌ లోకి రండి

అంటూ రాజ్‌ను తీసుకుని కిచెన్‌ లోకి వెళ్లి జ్యూస్‌ చేస్తుంది.

రాజ్‌: మీరు అర్జెంట్‌ గా ఎక్కడికైనా వెళ్లాలా కళావతి గారు.

కావ్య: అబ్బే అదేం లేదే.. ఎందుకు అలా అడిగారు.

రాజ్‌: ఏం లేదు మీరు కంగారు పడుతున్నారు కదా అందుకే అడిగాను

కావ్య: మీరు వచ్చారు కదా అందుకే ఇంత కంగారు (మనసులో అనుకుంటుంది.)

రాజ్‌:  అవును ఇంట్లో ఎవ్వరూ కనిపించడం లేదు

కావ్య: ఉన్నారంటే అందరినీ పరిచయం చేయమంటాడేమో.. (మనసులో అనుకుంటుంది) గుడికి వెళ్లారు వాళ్లు రావడానికి గంట పడుతుంది

రాజ్‌:  అయితే మనం గంట సేపు మాట్లాడుకోవచ్చు

అనగానే కావ్య జ్యూస్‌ ఇస్తుంది. రాజ్‌ జ్యూస్ తాగిన తర్వాత ఇక వెళ్తారా అని అడుగుతుంది కావ్య. తనకు వాష్‌ రూంకు వెళ్లాలని చెప్తాడు. దీంతో కావ్య రాజ్‌ను తన బెడ్‌రూంకి తీసుకెళ్తుంది. రాజ్‌ వాష్‌ రూం వెళ్లాక బయటకు తొంగి చూస్తుంటుంది కావ్య. రాజ్‌ వచ్చి తాను తీసుకొచ్చిన గిఫ్ట్ ఎలా ఉందని అడుగుతాడు. గిఫ్ట్‌ ఓపెన్ చేసి శారీ చూసి చాలా బాగుంది అంటుంది.

రాజ్‌:  నేను చెప్తే మీరు నమ్మడం లేదు కానీ మనిద్దరి ఆలోచనలు ఒకేలాగా ఉన్నాయి. ఒక విషయం అడుగుతాను నిజం చెప్తారా మనిద్దరికీ ఇంతకుముందు పరిచయం ఉందా..?  నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నా సొంత ఇంట్లోకి వచ్చినంతగా అనిపిస్తుంది. మీరేదో దాస్తున్నారు చెప్పండి.

కావ్య : మా ఇంట్లో వాళ్లు వచ్చే టైం అయింది. మీరు ఇక వెళ్లండి

అంటూ రాజ్‌ను కిందకు తీసుకెళ్తుంది కావ్య. రాజ్‌ మెయిన్‌ డోర్‌ దాటగానే అందరూ ఒక్కసారిగా హాల్లోకి వస్తారు. వాళ్లు చూస్తారేమోనని కావ్య డోర్‌ క్లోజ్‌ చేస్తుంది. అపర్ణ, అప్పు ఊపిరి పీల్చుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!