Brahmamudi Serial Today Episode: దుగ్గిరాల ఇంటి కోడలుగా తాను అడుగుపెట్టినప్పటి నుంచి ఎవ్వరి ముందు అబద్దం చెప్పలేదని. ఇవాళ తాను అబద్దం చెప్పాల్సి వచ్చిందని అపర్ణ ఇంట్లో అందరిని కోప్పడుతుంది. అయితే ఇంటి పరువు కోసం అలా చెప్పాల్సి వచ్చిందని  కావ్య చెప్పగానే.. నీకే ఈ ఇంట్లో విలువ లేదు. నీ హద్దులు మర్చిపోయావని అపర్ణ తిడుతుంది. దీంతో నాకు విలువ లేదని నాకు తెలుసు, కానీ మీరెందుకు నిజం చెప్పలేదు. మీ కొడుకు తప్పు చేశాడని ఎందుకు చెప్పలేదు. మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మీ కొడుకు నా మెడలో తాళి కట్టాడన్నది నిజం. మా ఇద్దరికి ఏనాడో బ్రహ్మముడి పడిందన్నది నిజం అంటూ కావ్య, అపర్ణను నిలదీస్తుంది. ఎక్కడి నుంచో వచ్చిన నేనే ఇంత సంయమనం పాటిస్తుంటే..కన్నతల్లి అయిన మీరు ఎం చేస్తున్నారు. ఆయనను ఇంట్లోంచి వెళ్లిపోమ్మంటున్నారు. ఆయన ఉనికినే ప్రశ్నిస్తున్నారు అంటుంది.


అపర్ణ: ఆపు.. చాలు ఆపు.. నువ్వు ఒక త్యాగ మూర్తివి. నువ్వు చేసింది ఒక త్యాగం. నీ భర్త ఆదర్శపురుషుడు. వాడు చేసింది లోక కళ్యాణం. ఈరోజు నీకు నా ముందు మాట్లాడటానికి గొంతు పెకిలిందా? ఎంత ధైర్యం నీకు.. నన్నే ప్రశ్నించే స్థాయికి వెళ్లిపోయావా? నువ్వెంత..? నీ బతుకెంత..? నీ లెక్కెంత..?


ఇందిరాదేవి: అపర్ణ ఆవేశపడకు. ఎవరు తప్పు చేశారు. ఎవరు ఒప్పు చేశారు అన్నది పక్కన పెడితే ఈరోజు ఈ ఇంటి పరువు పోకుండా బయటపడ్డాము. సమస్య వచ్చినప్పుడు ఆవేశం కన్నా.. ఆలోచనతో మాట్లాడాలి. సమస్య నుంచి గట్టెక్కె మార్గాన్ని శోధించాలి.


అపర్ణ: అందుకు మార్గం ఒక్కటే ఉంది అత్తయ్య. అసలు నేనే తప్పు చేశాను. నువ్వు ఆ బిడ్డను తీసుకొచ్చిన రోజే ఈ ఇంట్లోంచి గెంటివేసి ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్తితి వచ్చి ఉండేది కాదు. గడప లోపలికి రానిచ్చి తప్పు చేశాను. ఇంక రెండు రోజులే మిగిలాయి. ఈలోపు నువ్వు నిజం చెప్పకపోతే కన్నకొడుకు అని కూడా చూడకుండా నిర్దాక్ష్యిణంగా బయటకు గెంటివేస్తా..


  అని చెప్పి అపర్ణ వెళ్లిపోతుంది. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. తర్వాత రుద్రాణి, రాహుల్‌ను కావ్య తిడుతుంది. ఎందుకు తిడుతున్నావని.. మర్యాదగా మాట్లాడమని రుద్రాణి కోపంగా అడుగుతుంది. దీంతో మీరు ఎంత చేసినా ఈ ఇంట్లో వాళ్లు మిమ్మల్ని ఇంత మంచిగా చూసుకున్నా ఈ ఇంటి పరువు తీయాలన్న కోపం ఎందుకు మీకు అంటూ నిలదీస్తుంటే.. స్వప్న వస్తుంది. ఇద్దరిని తిడుతుంది.


రాహుల్‌: ఎయ్‌ ఎంటో నీ చెల్లితో కలిసి ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నావు. పెళ్లానివి పెళ్లాంలా ఉండు.


స్వప్న: మీరేమో వెన్నుపోటు పొడవచ్చు. కానీ మేము మాత్రం కనీసం మాటల్తో కూడా పొడవకూడదా?


రుద్రాణి: ఎంటి వింటున్నాను కదా అని రెచ్చిపోతున్నారు ఇద్దరూ.. అవును నేనే మీడియా వాళ్లకు చెప్పాను అయితే ఎంటి ఇప్పుడు. చెప్పడం తప్పే ఒప్పుకుంటున్నాను. కానీ రాజ్‌ చేసింది ఇంకా పెద్ద తప్పు కాదా? నేను జరిగింది చెప్పాను. కానీ నీ మొగుడు జరగరాని తప్పు చేశాడు.


స్వప్న: సరే ఇప్పుడు ఎందుకు ఈ గొడవ ఎవరి సంగతి ఎవరు తేల్చాలో అందరి దగ్గరకు వెళ్లి పంచాయతీ పెడదాం. ఎవర్ని ఇంట్లోంచి పంపించాలో వాళ్లే డిసైడ్‌ చేస్తారు.


అంటూ స్వప్న అందరికి చెప్పడానికి వెళ్తుంటే కావ్య, స్వప్నును ఆపుతుంది. మీ భవిష్యత్తు అడుగు దూరంలో ఆపేశాను. అని వార్నింగ్‌ ఇవ్వగానే రాహుల్‌, రుద్రాణి ఇప్పుడు ఏం చేయాలని అడుగుతారు. దీంతో నువ్వు మీ అమ్మ సారీ చెప్పాలని స్వప్న అనడంతో రాహుల్‌ సారీ చెప్తాడు. దీంతో ఇంకొకసారి ఇలా చెస్తే మీ గురించి ఇంట్లో అందరికీ చెప్పేస్తానని కావ్య వెళ్తిపోతుంది. మరోవైపు అనామిక, కళ్యాణ్‌ కొట్టడాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తుంది. ఇంతలో అక్కడకు రుద్రాణి వచ్చి అనామికను రెచ్చగొడుతుంది. అప్పును అవమానించమని చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 ALSO READ: బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో బుట్ట బొమ్మ... పూజా హెగ్డే భలే ఉంది కదూ!