Brahmamudi Serial Today Episode:  రాజ్‌ సంతకం ఫోర్జరీ చేసి పవరాఫ్‌ అటార్ని కావ్యనే కావాలని క్రియేట్‌ చేసిందని రుద్రాణి అందరి ముందు చెప్తుంది. రాజ్‌ లేకుండా సంతకం ఎవరు చేశారని నిలదీస్తుంది. దీంతో కావ్య సైలెంట్‌గా చూస్తుంది.

ఇంద్రాదేవి:  తను అలా అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి కావ్య ఆ పేపర్లు నీకు ఎలా వచ్చాయి

సీతారామయ్య: కంపెనీ ఎండీ లేకుండా ఒక కంపెనీకి సంబంధించిన పూర్తి హక్కులు వేరొకరి పేరు మీదకు రాయడం సాధ్యం కాని పని కదమ్మా అలాంటిది నువ్వెలా చేయగలవు.

 సుభాష్‌: ఇవి వర్జినల్‌ కాదనుకుందామంటే అధికారం కోసం విలువలు చంపుకుని నమ్మిన సిద్దాంతాలను పక్కన పెట్టి నువ్వేం చేయవు.

కావ్య: నన్ను బాగా అర్థం చేసుకున్న మీరే రుద్రాణి మాటలకు ఇదేంటి అని నన్ను ఎలా అడగాలనిపిస్తుంది మామయ్యగారు

ఇంద్రాదేవి: రుద్రాణి సాక్ష్యాలతో వచ్చి ప్రశ్నిస్తుంది అమ్మా తనకు ఏం సమాధానం చెప్పమంటావు

కావ్య: ఎవరేం అడిగినా సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత నాదే కాబట్టి చెప్తున్నాను వినండి   మామయ్య గారు.  ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో పవరాఫ్‌ అటార్ని అవసరం పడితే ఇబ్బంది పడకూడదని ఎప్పుడో నా పేరు మీద ఇవి రెడీ చేయించి పెట్టారు ఆయన.

రుద్రాణి: నువ్వు చెప్పేదంతా అబద్దం ఇవేమీ నేను నమ్మను

కావ్య: మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు

రుద్రాణి: కానీ నువ్వు ఫ్రాడ్‌ చేశావని రేపు ఎవరైనా కంప్లైంట్‌ చేస్తే.. నీకేం నువ్వు జైలుకు పోతావు. కానీ పోయేది మా ఇంటి పరువు

అపర్ణ: రుద్రాణి అసలు నువ్వు ఏం రుజువు చేయాలనుకుంటున్నావు

రుద్రాణి: అసలు ఇది రాజ్‌ సంతకమేనా..? లేక ఫోర్జరీ చేశారా అనేది  తెలుసుకోవాలి.

అంటూ ఫోన్‌ చేసి ఫోరెన్సిక్‌ అతన్ని పిలుస్తుంది. బయటే రెడీగా ఉన్న అతను వెంటనే ఇంట్లోకి వస్తాడు. రుద్రాణి ఆ పేపర్స్‌ మొత్తం అతనికి ఇస్తుంది. ఆ పేపర్లు అతను పరిశీలిస్తుంటాడు.

రుద్రాణి: ఏం కావ్య హాల్లో సెంట్రల్‌ ఏసీ ఉన్నా నీకు చెమటలు పడుతున్నాయి. అయినా అతను ఇప్పుడేగా వర్క్‌ స్టార్ట్‌ చేసింది. ఆ సంతకాలు ఎవరు చేసింది తెలియని అప్పుడు నీకు నేను పట్టిస్తాను అసలైన చెమటలు. ఇంకా ఎంత సేపు పరిశీలిస్తారు. అవి ఫోర్జరీ అని చెప్పండి.

ఫోరెన్సిక్‌ వ్యక్తి: ఇవి రెండు వర్జినల్ సంతకాలే మేడం. రెండింట్లోనూ ఒకరే సంతకాలు చేశారు.

అంటూ అతను చెప్పగానే రుద్రాణి, రాహుల్‌ షాకవుతారు. కాఫీ ఫాపులో రాజ్‌ తిరిగి వచ్చి సంతకం చేసిన విషయం కావ్య గుర్తు చేసుకుంటుంది.

రుద్రాణి: నేను ఇచ్చిన డబ్బులు సరిపోలేదా..? అదే దీని పేమెంట్‌ సరిపోలేదా..? ఇంకా ఇస్తాను.. ఇంకే కావాలో చెప్పండి.. టైం కావాలా చెప్పండి. ఇంకొకసారి క్లియర్‌గా చూసి చెప్పండి

ఫోరెన్సిక్‌ వ్యక్తి: నేను క్లియర్‌గానే చూశాను మేడం ఇది వర్జినల్‌ సంతకమే

రుద్రాణి: ఏమయ్యా అసలు నీకు పని తెలుసా..?

ఫోరెన్సిక్‌ వ్యక్తి: మేడం నేను ఈ వర్క్‌ 20 ఏళ్లుగా చేస్తున్నాను. రెండు నిమిషాల్లో ఏది వర్జినల్‌ సంతకమో.. ఏది ఫోర్జరీ సంతకమో చెప్పేయగలను

రుద్రాణి: నిన్ను నమ్ముకుంటే నా టైం అంతా వేస్ట్‌ అయింది. నీకంటే ప్రొఫెషనల్‌ దగ్గరకు తీసుకెళ్తాను

ఫోరెన్సిక్‌ వ్యక్తి: మేడం మీరు ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్లండి ఈ రెండు సంతకాలు ఒక్కరివే అని చెప్తారు. ఆ తర్వాత మీ ఇష్టం

అని చెప్పి వెళ్లిపోతాడు.  ఇంట్లో వాళ్లందరూ రుద్రాణిని తిడతారు. కావ్యను మెచ్చుకుంటారు. తర్వాత రాత్రికి రాజ్‌.. కావ్య వేసిన పొడుపుకథకు ఆన్సర్‌ కోసం నెట్‌ సెర్చ్‌ చేసి కావ్యకు ఫోన్‌ చేసి మీ పొడుపుకథకు ఆన్సర్‌ దొరికింది అని చెప్తాడు. దీంతో కావ్య ఏంటో చెప్పండి అని అడుగుతుంది. రాజ్‌ ఏదేదో చెప్తుంటే కావ్య నవ్వుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌  అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!