Brahmamudi Serial Today Episode:
నాకూతురికి సవతి వచ్చినా సరే అక్కడే ఉంటుంది. ఆస్థి లేదని భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చి నువ్వు పడుతున్న అగచాట్లు చూశాకా కూడా నా కూతురును పుట్టింటికి ఎలా తీసుకెళ్లగలను రుద్రాణి అంటూ కనకం చెప్పి వెళ్లిపోతుంది. ఇంతలో అనామిక, స్వప్న వచ్చి రుద్రాణిని తిట్టి వెళ్లిపోతారు. మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణ్ జరిపిస్తుంటారు. రామాయణం గురించి పంతులు చాలా గొప్పగా చెప్తుంటాడు. అందరూ శ్రద్దగా వింటుంటారు. అప్పు వచ్చి కళ్యాణ్‌ను పక్కకు తీసుకెళ్తుంది.
కళ్యాణ్: ఎంటి బ్రో ఏమైంది..?
అప్పు: ఏదో జరుగుతుంది. మీ ఫ్యామిలీలోనే ఎవరో మీడియా వాళ్లతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. మీ ఫ్యామిలీ పరువు తీయాలని చూస్తున్నారు.
కళ్యాణ్: ఎంటి అప్పు నువ్వు మాట్లాడేది..?
అప్పు: మీడియా వాళ్లు వాళ్లంతట వాళ్లు రాలేదు. ఇదంతా ఏదో ప్లాన్ లా ఉంది. బహుశా.. బావ తీసుకొచ్చిన బాబు గురించి బయట పెట్టడానికే ఇదంతా ప్లాన్ చేస్తున్నట్టున్నారు.
కళ్యాణ్: అవును. అసలే బాబు వచ్చిన్నప్పటి నుంచి ఇంట్లో అన్నయ్యతో గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీడియా వాళ్లు కూడా ఇంటి పరువు తీసినట్టు మాట్లాడితే.. మా పెద్దమ్మ అన్నయ్యని అసలు క్షమించదు. ఇప్పుడు ఏం చేద్దాం. ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి.
అప్పు: ఆగరా బై అందరూ పూజలో ఉన్నారు. ఎవరికీ ఏదీ చెప్పేటట్టు లేదు మనమే ఏదో ఒకటి చేసి ఆపాలి.
అంటూ కళ్యాణ్ చేతి పట్టుకుని ఆపి చెప్పగానే దూరం నుంచి చూసిన అనామిక కోపంగా వచ్చి అప్పును తిడుతుంది. ఏం బతుకులే మీవి అంటూ ఘోరంగా తిడుతుంది. దీంతో కళ్యాణ్ అడ్డుపడితే కళ్యాణ్‌ను కూడా అనామిక తిడుతుంది. దీంతో కళ్యాణ్, అనామికను కొడతాడు. దీంతో నీసంగతి చూస్తానని చాలెంజ్ చేసి అనామిక వెళ్లిపోతుంది. కళ్యాణ్, అప్పు కలిసి మీడియా రిపోర్టర్ దగ్గరకు వెళ్లి మాట్లాడతారు. ఒక పరువు గల ఫ్యామిలీ పరవు తీయడం కరెక్టు కాదని కళ్యాణ్ అడగ్గానే.. ఇంత వరకు మాకున్న ఇన్మఫర్మేషన్ నిజమా? కాదా అని డౌట్ ఉండేది. ఇప్పుడు అది నిజమనిపిస్తుంది. మా డ్యూటీ మేము చేస్తామని చెప్పి రిపోర్టర్ వెళ్లిపోతుంది. ఇంతలో కళ్యాణ్ లొపలికి వెళ్లి రాజ్‌ను మనం త్వరగా వెళ్లాలి అని చెప్తుండగానే రిపోర్టర్లు లోపలికి వస్తారు. రాజ్‌ను ప్రశ్నింస్తుంటారు. ఇంతలో కళ్యాణ్ కోపంగా అరుస్తాడు.
కళ్యాణ్: స్టాపిట్.. ఇవన్నీ మీకు ఎవరు చెప్తున్నారు. ఇలాంటి పుకార్లను ఎవ్వరూ నమ్మోద్దు. మా కుటుంబంలో తప్పులు జరిగే అవకాశమే లేదు. ఒకవేశ మా అన్నయ్య వేరే అమ్మాయితో బిడ్డను కంటే.. ఇప్పుడు మా కుటుంబంలో ఒకడిగా ఎందుకుంటాడు. ఆయన భార్యగా కళ్యాణ్ అన్నతో కలిసి ఎందుకు పూజలో కూర్చుంటుంది.
రిపోర్టర్: ఆ బిడ్డన తీసుకురావడం వల్లనే రాజ్ గారిని ఎండీ స్థానం నుంచి తీసేశారని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ స్థానంలో మీరున్నారని.. ప్రస్తుతం ఆఫీసు వ్యవహారాలు మీరు చూస్తున్నారని తెలిసింది.
కళ్యాణ్: మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను అన్నయ్య స్థానంలో లేను ఆయన స్థానం ఎప్పుడూ ఆ స్థాయిలో ఉంటుంది. మేమంతా ఆయన కింద పనిచేసేవాళ్లమే..
అని కళ్యాణ్ చెప్పగానే రిపోర్టర్స్ మీ కుటుంబంలో ఏదో సంక్షోభం జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే అడుగుతున్నాం అంటారు. దీంతో కావ్య ఆధారం లేని ఆరోపణలు చేయడం కరెక్టు కాదని చెప్తుంది. నిజానిజాలు తెలుసుకోకుండా ఒక గొప్ప కుటుంబం మీద మచ్చ వేయకండి. మమ్మల్ని బతకనీయండి అనగానే రిపోర్టర్ మరి ఈ బిడ్డ ఎవరు అని అడుగుతుంది. దీంతో కావ్య నాకు మా ఆయనకు పుట్టిన బిడ్డ అని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. రిపోర్టర్స్ అపర్ణను కూడా నిజం చెప్పమని అడుగుతారు. దీంతో అపర్ణ కూడా ఆ బిడ్డ నా మనవడు అని మా ఇంటి వారసుడు అని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఇయిపోతుంది.
ALSO READ: సీనియర్ నటి రాధ కోసం స్పెషల్ బిర్యానీ చేసిన ఆలీ భార్య - చూస్తే నోరూరుతుంది