Brahmamudi Serial Today Episode: : ఇంటికి వచ్చిన రాజ్‌ గుడిలో జరిగిన సంఘటనలు చెప్పడంతో వైదేమి వాళ్లు షాక్‌ అవుతారు. రాజ్‌ లోపలికి వెళ్లాక. అసలు ఎవరీ అపర్ణ అని యామినిని అడిగితే ఆవిడ రాజ్‌ ను కన్న తల్లి అని చెప్తుంది.  

వైదేహి: రాజ్‌ గతం మర్చిపోయాడు కదా ఆవిడ పుట్టినరోజు ఎలా గుర్తు పెట్టుకున్నాడు.

యామిని:  గుర్తు పెట్టుకోలేదు. బావ చెప్పినట్టుగా కో ఇన్సిడెంటల్‌గా గుడిలో కలిశారు.

 వైదేహి:  అంటే నిజంగానే రామ్‌ వాళ్లను గుర్తు పట్టలేదా..?

యామిని: గుర్తు పట్టలేదు కానీ నేను వాళ్లను ఎంత దూరం పెడదామని ట్రై చేసినా వాళ్లు దగ్గరవుతూనే ఉన్నారు

యామిని డాడీ: ఒకరు దూరం చేస్తే దూరం అవ్వడానికి అది తెలిసి తెలియని వయసులో పుట్టే ప్రేమ కాదమ్మా…? తొమ్మిది నెలలు కడుపులో మోసిన కన్నప్రేమ, ఆ తల్లి పేగు తెంచుకుని పుట్టిన ప్రేమ, పాతికేళ్లు ఆ తల్లి తన కొడుక్కి ప్రతి రోజు పెంచిన ప్రేమ. ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చి దూరం చేస్తే దూరం అయిపోతుందా..? తప్పు చేస్తున్నావు యామిని. తన ఫ్యామిలీకి తనను దూరం చేస్తూ.. తప్పు చేస్తున్నావు.

యామిని: తన ఫ్యామిలీని తనకు దూరం చేయడం నాకు మాత్రం ఇష్టమా డాడీ.. బావను నేను పెళ్లి చేసుకుంటే ఆ ఫ్యామిలీ కూడా నా ఫ్యామిలీ అవుతుంది కదా..? అప్పుడు నేను ఉండాల్సింది ఆ ఫ్యామిలీతోనే కదా

యామిని డాడీ:  మరి కావ్య పరిస్థితి ఏం చేస్తావు

యామిని: నాకు కావాల్సింది నా బావ. నా జీవితం తనతోనే నేను ఇంకెవరి గురించి పట్టించుకోను

 అని కరాకండిగా చెప్తుంది. అయినా మీరు నా గురించి ఆలోచించాలి కానీ దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పి వెళ్లిపోతుంది యామిని. ఇంట్లో అందరూ అపర్ణ, కావ్యల గురించి ఆలోచిస్తుంటారు. రుద్రాణి అపర్ణకు కూడా పిచ్చి పట్టిందని చెప్తుంది. ఇంతలో గుడి నుంచి అపర్ణ, కావ్య వచ్చి అందరికీ ప్రసాదం పెడతారు. ఎవ్వరూ తినకుండా చూస్తుండిపోతారు.

అపర్ణ: ఎందుకు అందరూ అలా చూస్తున్నారు అది దేవుడి ప్రసాద్‌ తినండి

ఇంద్రాదేవి: అన్నదానం ఎలా జరిగింది అపర్ణ

అపర్ణ:  చాలా బాగా జరిగింది అత్తయ్య గారు. ఇన్ని సంవత్సరాలలో ఏ రోజు జరగనంత గొప్పగా జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది.

రుద్రాణి:  చూశారా..? సంతోషంగా ఉందట.. నేను చెప్పింది ఇప్పటికైనా నమ్ముతారా

అపర్ణ:  ఏం నేను సంతోషంగా ఉండకూడదా..? అయినా నువ్వేం చెప్పావు..? వీళ్లేం నమ్మాలి..?

రుద్రాణి:  నిజం చెప్పాను వదిన. ఇన్ని రోజులు కావ్య ఒక్కతే పిచ్చెక్కి ప్రవర్తిస్తుంది అనుకుంటే ఇప్పుడు తనకు నువ్వు కూడా తోడయ్యావు కదా..? ఇంకా ఏం జరగాలి వదిన

అపర్ణ:  చూడు రుద్రాణి నీలాగే నేను కూడా ఇన్ని రోజులు రాజ్‌ లేడనే అనుకున్నాను. కావ్య మాటలు నమ్మకుండా తప్పు చేశా.. కానీ ఎప్పుడైతే గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకున్నానో అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. నా రాజ్‌ తప్పకుండా తిరిగి వస్తాడని నన్ను నమ్మండి నాలో వచ్చిన ఈ మార్పే నా నమ్మకానికి సాక్ష్యం. నిజం అండి మన రాజ్‌ త్వరలో మన ఇంటికి రాబోతున్నాడు

సుభాష్‌:  ఏంటి అపర్ణ నువ్వు చెప్పేది.

అపర్ణ:  అవునండి ఆ దేవుడే మన దగ్గరకు  రాజ్‌ను పంపిస్తున్నాడు. నేను చెప్తున్నాను కదా..? నన్ను నమ్మండి.. ఇక మనం ఎవ్వరం బాధపడాల్సిన అవసరం లేదు

సుభాష్‌: ఏంటమ్మా మీ అత్తయ్య చెప్పేది నిజమా..? రాజ్‌ తిరిగి వస్తాడని అంత నమ్మకంగా చెప్తుంది

కావ్య:  నేను ముందు నుంచి చెప్తున్న మాటే ఇప్పుడు చెప్తున్నాను మామయ్య. ఆయన బతికే ఉన్నారు. కానీ ఈ ఇంటికి ఎందుకు రాలేదు అన్న ప్రశ్నకు ఆయన తిరిగొచ్చిన రోజే సమాధానం దొరుకుతుంది.

రుద్రాణి: ఏంటి కావ్య నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవరూ మాట్లాడరేంటి..? గట్టిగా నిలదీయరేంటి..?

అని అడగ్గానే అందరూ రుద్రాణినే తిడతారు. మరోవైపు కావ్య గురించి తెలుసుకోవడానికి కావ్య గిఫ్ట్‌ పంపించిన కొరియర్‌ ఆఫీసుకు ఫోన్‌ చేస్తాడు రాజ్‌. అయితే కొరియర్‌ ఆఫీసు వాల్లు అది ఎవరో పోలీస్‌ డిపార్టమెంట్‌ వాళ్లు పంపించారని చెప్పడంతో రాజ్‌ షాక్‌ అవుతాడు. ఇక మొత్తం కూపీ లాగుతాను అనుకుంటాడు. మరోవైపు రూంలో రాజ్‌ ఫోటో చూస్తూ ఉన్న అపర్ణ దగ్గరకు భోజనం చేద్దాం రమ్మని కావ్య వెళ్తుంది. అయితే రాజ్‌ను ఇంటికి ఎలా తీసుకొస్తావని అపర్ణ అడగడంతో కావ్య తన ప్లాన్‌ చెప్తుంది. ఇద్దరూ కలిసి భోజనం చేయడానికి రాగానే రుద్రాణి రెండు నిమిషాలు ఆగండి అని చెప్తుంది. ఇంతలో కంపెనీ ఎంప్లాయీస్‌ వస్తారు. రాజ్‌కు నివాళి అర్పించాలి అంటారు. అపర్ణ, కావ్య షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌  అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!