Brahmamudi Serial Today Episode: డబ్బుల కోసం వచ్చిన చక్రికి ఇందు కిడ్నాప్‌ అయిందని తను వస్తే గానీ డబ్బులు రావని కిడ్నాపర్లు కోటి రూపాయలు డిమాండ్‌ చేస్తున్నారని ఆ కోటి కూడా నువ్వే ఇవ్వాలని రేఖ అడుగుతుంది. అయితే మీ దగ్గర ఉన్న బంగారునగలు ఇవ్వండని చక్రి అడుగుతాడు. సరే అంటూ రేఖ చెప్తుంది. మరోవైపు కడుపునిండా తిని నిద్రపోతుంటారు రాజు, లక్కీ. అప్పుడే నందు ఆ ఇంట్లోకి వెళ్లి ఇందును చూస్తుంది.

Continues below advertisement

నందు: అక్కా..

ఇందు: నువ్వా..? నువ్వెలా లోపలికి వచ్చావు. కొంపదీసి నిన్ను కూడా కిడ్నాప్‌ చేశారా..?

Continues below advertisement

నందు: నన్ను కిడ్నాప్‌ చేసే వ్యక్తి ఇంకా పుట్టలేదులే అక్కా

ఇందు: మరి లోపలికి ఎలా వచ్చావు.. బయట తాళం వేశారు. కదా

నందు: నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు.. కదా.. నా చేతుల కన్నా గట్టిగా ఆ తాళాలేం లేవు కానీ అసలు ఈ వెధవలు ఎవరు..? నిన్ను ఎందుకు కిడ్నాప్‌ చేశారు

ఇందు: ఎవరినైనా కిడ్నాప్‌ ఎందుకు చేస్తారు. డబ్బుల కోసమే..

నందు: ఏంటక్కా అంతా కన్పీజ్‌గా ఉంది. ఫస్ట్ నువ్వే కిడ్నాప్‌ చేసుకోవాలని అనుకున్నావంట మధ్యలో ఎవరో కిడ్నాప్‌ చేశారని స్వాతి చెప్పింది. అసలు ఏం జరిగింది

అని అడుతుంది నందు. ఇందు జరిగింది మొత్తం చెప్తుంది.

నందు: అక్కా ముందు మనం ఇక్కడి నుంచి వెళ్లాలి

ఇందు:  నేను ఇక్కడి నుంచి రాను

నందు: ఎందుకు అక్కా ఏమైంది

ఇందు: నేను ఆ ఇంటికి వెళితే నేను అనుకున్నది ఏదీ చేయలేను.. నన్ను నమ్ముకున్న వాళ్లకు ఏమీ చేయలేను

నందు: అప్పటి నుంచి నువ్వు మాట్లాడుతున్నది ఆ సంతకం గురించే కదా..? నాన్నమ్మ నీ గురించి చాల టెన్షన్‌ పడుతుంది. నిన్ను తీసుకొస్తానని తనకు మాటిచ్చాను అక్కా

ఇందు: ఆ రేఖ ఆంటీకి ఆస్తి వెళ్లనివ్వని నేను నాన్నమ్మకు మాటిచ్చాను. అంతవరకు నేను ఇంటికి రాలేను

నందు: వీళ్లతో వదిలేసి నేను ఎలా వెళ్లను అక్కా

ఇందు: వీళ్లు వెధవల్లా కనిపించినా నాతో బాగానే ఉంటున్నారు.. నన్ను బాగానే చూసుకుంటున్నారు.. అవునూ ఎందుకు నాకోసం ఇంత చేస్తున్నావు..

నందు: నన్ను దేవుడిచ్చిన చెల్లి అన్నావు.. అప్పుడు నువ్వు నాకు అక్కవి కదా అక్క కోసం ఇది చేయలేనా..?

అని ఇందుకు జాగ్రత్తలు చెప్పి నందు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు కోటి రూపాయలకు నగలు తక్కువ అవుతున్నయనా చక్రి చెబితే భ్రమారాంబ, రేఖ ఇద్దరూ కలిసి అపర్ణ బంగారు గాజులు లాక్కోవాలని ట్రై చేస్తుంటారు. అప్పుడే అక్కడికి వెళ్లిన నందు వాళ్లకు వార్నింగ్‌ ఇచ్చి అపర్ణను సేవ్‌ చేస్తుంది. రేఖ బయటకు వెళ్లి ఇక నగలు లేవని ఎలాగైనా డబ్బు సర్దమని రిక్వెస్ట్ చేస్తుంది. చక్రి సరే అంటూ వెళ్లిపోతాడు. మరోవైపు ఇందు దర్జాగా సోపాలో కూర్చుని తన వల్ల రాజు వాళ్లకు కోట్లు వస్తున్నాయి కాఫీ ఇవ్వండని ఆర్డర్‌ వేస్తుంది. రాజు మహరాణివి కదా అలాగే ఇస్తాను అంటూ వెళ్తాడు. ఇందు నవ్వుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!