Brahmamudi Serial Today Episode: కావ్య, శ్వేత ఇద్దరూ కలుసుకుని వెన్నెలను ఎలా వెతకాలో ప్లాన్ చేస్తారు. వెన్నెలను బయటకు రప్పించేందుకు ఓల్డ్ స్టూడెంట్ పార్టీ ఏర్పాటు చేయాలని.. ఆ పార్టీకి కచ్చితంగా రాజ్ వచ్చేలా చేయాలని కావ్య శ్వేతకు చెప్తుంది. అదంతా నేను చూసుకుంటానని శ్వేత చెప్తుంది. మరోవైపు సుభాష్ ఆలోచిస్తూ కూర్చుని ఉంటాడు. అపర్ణ వస్తుంది. ఈ ఇంట్లో ఉండాలని నాకు అనిపించడం లేదు. అని చెప్తుంది. సుభాష్ పలకడు ఎందుకు అని అడగరా? అనగానే
సుభాష్: నాకు అలాగే అనిపిస్తుంది. అటువంటప్పుడు ఎందుకు అని ఎలా అడగ్గలను.
అపర్ణ: బయటి వాళ్లు అంటే ఎమో కానీ ఇంట్లో వాళ్లే మాటలతో నరకం చూపిస్తున్నారు.
సుభాష్: స్వర్గం లాంటి ఇల్లు నరకంలా మారిందని నాకు అర్థం అవుతుంది.
అపర్ణ: ఉమ్మడి కుటుంబం అని ఒక్కతాటి మీద నడవాలని ఎవ్వరూ తప్పు చేసినా సర్దుకుపోవాలని ఇలా ఒపిక పడుతూ వస్తే అందరికీ అది అలుసుగా మారిపోయింది.
అంటూ ఇద్దరూ ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి బాధగా ఆలోచిస్తుంటారు. మరోవైపు రాజ్ బాబును ఎత్తుకుని పైకి వెళ్తుంటే అపర్ణ వెళ్లి రాజ్‌ను తిడుతుంది. రాజ్ అవేవీ పట్టించుకోకుండా పైకి వెళ్లిపోతాడు. మరోవైపు కావ్య బయటి నుంచి వస్తుంది. కాఫీ తీసుకుని టాబ్లెట్ వేసుకొండి అని అపర్ణకు ఇవ్వబోతుంటే..
అపర్ణ: తలనొప్పి టాబ్లెట్ కు పోతుంది. మరి ఇంటికి పట్టిన అరిష్టం ఎప్పుడు పోతుంది. ఎలా పోతుంది. సంవత్సరం అయింది ఈ ఇంటికి ఒక నష్టజాతకురాలు ప్రవేశించింది. ఆ నష్టాన్ని ఎలా పూడ్చాలి. ఎప్పుడు పూడ్చాలి. అసలివ్వనీ నువ్వు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచే మొదలయ్యాయి.
కావ్య: అత్తయ్యా..
అపర్ణ: అత్తయ్యా అని పిలవకు.. రేపు నీలాగే ఇంకొకరు కూడా వచ్చి అత్తయ్యా అని పిలుస్తారు. ఎంతమంది కోడళ్లకు నేను అత్తయ్యను కావాలి. నీమీద ఇష్టం లేకే నా కొడుకు పక్కదారి చూసుకుని ఉంటాడు. ఇంట్లో వాడి వ్యక్తిత్వం దిగజారిపోయింది. నేను సమాధానం చెప్పలేక నలిగిపోతున్నాను.
అని అపర్ణ తిడుతుంటే.. ఇందిరాదేవి వచ్చి అపర్ణను తిడుతుంది. రాజ్ కూడా పైనుంచి వస్తూ వింటుంటాడు. కావ్య నష్టజాతకురాలు కాదు నష్టపోయిన అభ్యాగురాలు అని చెప్తుంది. రాజ్‌ను తిడుతుంది. కావ్యను ఇంకోసారి తిడితే బాగుండదని వార్నింగ్ ఇస్తుంది. రాజ్ పైకి వెళ్లి అపర్ణ అన్న మాటలు గుర్తుచేసుకుంటుంటాడు. మరోవైపు రుద్రాణి, ధాన్యలక్ష్మీ మాట్లాడుకుంటుంటారు. మొత్తానికి మనం అనుకున్నది జరిగిందని సంతోషిస్తుంటారు. ఇంతలో స్వప్న, అనామిక వచ్చి మేము తీసుకెళ్లిన లంచ్‌బాక్స్ తినలేదని చెప్తారు. ఇద్దరూ కలిసి కూర్చుని మీ కొడుకులు పెద్ద బిజినెస్ మ్యాన్ లు అయినట్లు కలలు కంటున్నారా? అని ఎలాంటి కొడుకులను కన్నారు అంటూ కోపంగా వెళ్లిపోతారు. మరోవైపు కావ్య రూంలోకి వెళ్లగానే
రాజ్: ఒక్క మాట చెప్తాను వింటావా?
కావ్య: ఇప్పటివరకు మీరేం చెప్పినా విన్నాను.
రాజ్: ఈ మాట నీకు నచ్చకపోవచ్చు..
కావ్య: నా భర్త ఓ బిడ్డను తెచ్చి ఈ బిడ్డకు తండ్రిని నేనే అని దర్జాగా చెప్పాడు. ఆ మాట ఏ భార్యకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. అయినా వినలేదా? పర్వాలేదు చెప్పండి.
రాజ్: నువ్వు మీ పుట్టింటికి వెళ్లిపో.. అవును మా ఇంట్లో ఉండొద్దు వెంటనే వెళ్లిపో నేను మంచివాణ్ని కాదు మంచి భర్తను కాదు.
కావ్య: ఎందుకలా అంటున్నారు.
అనగానే నీకు సుఖం లేదు. సంతోషం లేదు. నీకు ఏమీ మిగల్లేదు. ఇంకా ఎందుకుండాలి నువ్విక్కడ.. అంటూ ఇంట్లో అందరూ నిన్ను ఎంతలా అవమానిస్తున్నారో నేను వింటూనే ఉన్నాను. అని రాజ్ చెప్పగానే.. లెక్కలన్నీ తేల్చుకుని వెళ్తాను. ఈ గడప దాటితే ఇంకో గడప తొక్కనని కావ్య చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపపు అనామిక రెడీ అవుతూ నువ్వు నా కోరిక మేరకు ఆఫీసులో అడుగుపెట్టావు. ఇప్పుడు నిన్ను నా దారిలోకి తెచ్చుకుంటా అని మనసులో అనుకుంటుంది. ఇంతలో అనామిక వాళ్ల అమ్మ ఫోన్ చేసి మీ నాన్నకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయాయని చెప్తుంది. కళ్యాణ్‌ను ఎప్పుడు మన ఇంటికి తీసుకొస్తావు అని అడుగుతుంది. త్వరలోనే జరుగుతుందిలే అని అనామిక చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: రెడ్ సూట్‌లో నేహా శెట్టి అందాల విందు - 'రాధిక' లుక్స్‌కి ఫిదా అవుతున్న నెటిజన్లు