స్వప్న రాజ్, రాహుల్ గురించి ఆలోచిస్తూ బేరీజు వేసుకుంటూ ఉంటుంది. రాహుల్ మాటలకు ఫ్లాట్ అవుతూ ఉంటే రాజ్ మాత్రం జీవితం గురించి చెప్తూ ఉంటాడు. విసిగిపోయిన స్వప్న లైఫ్ అంటే ఏంటో రాహుల్ తో ఉంటే తెలుస్తుంది, ఏ అమ్మాయి అయినా తనలాంటి భర్త, బాయ్ ఫ్రెండ్ గా రావాలని కోరుకుంటుంది. తను డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. మీరేం ఇచ్చారు ఈ పనికి రాణి పువ్వులు, చాక్లెట్లు. అమ్మాయితో ఎలా ఉండాలో రాహుల్ ని చూసి నేర్చుకోండి అని పూల బొకే నెలకేసి కొట్టి తొక్కుతుంది. భర్త కృష్ణమూర్తి కనకాన్ని వెక్కిరిస్తూ మాట్లాడతాడు. స్వప్న సంబరంగా ఇంటికి వచ్చి డైమండ్ రింగ్ గిఫ్ట్ గా వచ్చిందని చెప్తుంది. ఎవరిచ్చారని తండ్రి అడుగుతాడు. రాజ్ అని అబద్ధం చెప్తుంది.


Also Read: చిత్రని ట్రాప్ చేయడానికి అభిమన్యు స్కెచ్- వాలెంటైన్స్ డే రోజు వేదకి విన్నీ గిఫ్ట్


తప్పు చేస్తున్నావ్ అని భర్త కృష్ణమూర్తి కనకాన్ని దెప్పి పొడుస్తా ఉంటాడు. రేపు వాళ్ళు మన ఇల్లూ వాకిలి చూసుకోవడానికి వాళ్ళందరూ కార్లు వేసుకుని వస్తున్నారని కనకం చెప్పేసరికి స్వప్న షాక్ అవుతుంది. వాళ్ళు ఇక్కడికి వస్తే అంతా తెలిసిపోతుందని కంగారుపడుతుంది. తెలిసిపోనీవ్వు మంచిదే కదా అని కృష్ణమూర్తి అంటాడు. ఎలాగైనా స్వప్న పెళ్ళిని రాజ్ తోనే జరిపించి తీరతానని కనకం శపథం చేస్తుంది. ఎలా చేస్తావ్ మీ అక్కలాగా బంగ్లాలు ఉన్నాయా అని కృష్ణమూర్తి అనేసరికి భలే ఐడియా ఇచ్చారు. వాళ్ళని ఈ ఇంటికి కాదు అక్క వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తానని కనకం చెప్తుంది. అప్పుడే కావ్య వస్తుంది. ఆ రాజ్ కరెక్ట్ మనిషి కాదని కావ్య చెప్పేందుకు చూస్తుంది. రాజ్ ని నేనొక యాంగిల్ లో చూస్తే ఇది ఇంకొక యాంగిల్ లో చూస్తుంది నిజంగానే తను బోరింగ్ మనిషని స్వప్న మనసులో అనుకుంటుంది.


స్వప్న రాజ్ ని కలవడానికి వెళ్ళేసరికి అప్పుకి దెబ్బ తగిలిందని చెప్తుంది. ‘ఈ పెళ్లి చూపుల పేరుతో బయటకి వెళ్ళి ఏం తలనొప్పులు తీసుకొస్తున్నావ్, ఈ ఇంటిని ఈ ఆడపిల్లల్ని ఏం చేద్దామని అనుకుంటున్నావ్. ఈ పెళ్లి వద్దు ఈ నాటకాలు వద్దు’ అని కృష్ణమూర్తి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కావ్య కూడా తండ్రికే సపోర్ట్ చేస్తానని చెప్తుంది. రుద్రాణి ఇంట్లో పని మనిషిని చెం మీద కొడుతుంది. ఏం జరిగిందని రాజ్ అడుగుతాడు. ఎవరు చూడటం లేదని తను నీ గదిలో డబ్బు దొంగతనం చేసిందని రుద్రాణి చెప్తుంది. కొట్టబోతుంటే రాజ్ ఆపి ఎందుకు దొంగతనం చేశావని అడుగుతాడు. మా బాబుని హాస్పిటల్ లో చేర్చామని వైద్యం కోసం చాలా డబ్బులు కావాలని అందుకే ఇలా చేశానని చెప్తుంది.


Also Read: రాజ్ చెంప మీద కొట్టిన కావ్య- కనకం ఇంటికి పెళ్ళిచూపులకు వస్తామన్న అపర్ణ


అకౌంటెంట్ ని అడ్వాన్స్ అడగవచ్చు కదా అని అంటాడు. కాసేపు లాజిక్ మాట్లాడి దొంగ శాంత కాదు అకౌంటెంట్ అని రాజ్ తనని తిడతాడు. ఇతను చాలా మంది పేర్లు రాసి దొంగసంతకాలు చేసి చాలా డబ్బు కొట్టేశాడని రాజ్ అకౌంటెంట్ బండారం బయటపెడతాడు. అందుకు పనిష్మెంట్ గా అతన్ని ఇంట్లో పనోడిని చేస్తాడు. ఇంట్లో కనకం తలపట్టుకుని కూర్చుంటుంది. మళ్ళీ కృష్ణమూర్తి, కావ్య కనకానికి నచ్చజెప్పాలని చూస్తుంది. కానీ కనకం మాత్రం ఒప్పుకోదు. ఎందుకు చేస్తున్నా నా బిడ్డల భవిష్యత్ కోసమే కదా. ఈరోజు మంచి సంబంధం కుదిరితే అందరూ నన్ను దోషిని చేసి మాట్లాడుతున్నారు, ఈ తప్పులు చేసే తల్లి ఇప్పుడే ప్రాణాలు వదిలేస్తుందని కిరోసిన్ నెత్తి మీద పోసుకుంటుంది. దీంతో అందరూ ఏడుస్తూ ఎలా చెప్తే అలానే వింటామని అంటారు. తల్లి అలా చేసేసరికి అందరం నువ్వు చెప్పినట్టే వింటామని కావ్య కూడ మాట ఇస్తుంది. అమ్మ రాజ్ తో పెళ్లి చేయడం కోసం కష్టపడుతుంది, కానీ నేను రాహుల్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు ఎలా చెప్పాలని స్వప్న మనసులో అనుకుంటుంది.